Friday, March 5, 2021

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు


సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు 

తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. కదిరి ప్రాంత ప్రజలు కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ.
సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు.

భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొంటారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలను, ఇంట్లో ఉండే పాత పొరకలు, తట్టలు , విరిగిపోయిన మంచాలు మొదలైన పాడైన పాత వస్తువులను మంటల్లో వేసి కాల్చివేస్తారు. వ్యవసాయంలో వాడి పాతబడి దెబ్బ తిన్నవాటిని భోగి మంటల్లో వేస్తారు. కొంత మంది సంప్రదాయం పేరుతో భోగి మంటలు వేయాలన్న తాపత్రయంతో రబ్బరు, టైర్లు, పెట్రోలు పోసి తగల పెడుతున్నారు. దాని వల్ల కాలుష్యం పెరిగి ఆరోగ్యం పాడవుతుంది. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు.
భోగి రోజు పట్టణాలలో బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుకుంటారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు.
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగిస్తారు. దాదాపుగా అందరిళ్ళలో అత్తిరాసలు, ఓళిగలు, చక్కిలాలు, పాయసం, పులిహౌర, వడలు మొదలయిన వంటకాలు చేసుకుంటారు. కొత్తబట్టలు ధరిస్తారు. కొంతమంది ఈ రోజున పెద్దల పండుగ జరుపుతారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు.ఎద్దు లేదా ఎనుము పేడతో ముద్దగా చేసి దానిపై గుమ్మడి పూవును పెడతారు. గతంలో గొబ్బియ్యాలో అంటూ అమ్మాయిలు పాటలు పాడేవారు. ఇప్పుడది కనుమరుగైంది. పట్టణాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు వివిధ సంఘాల వారు. కొంతమంది పిల్లలు గాలిపటాలను ఎగుర వేస్తారు.
సంక్రాంతి రోజు గంగిరెద్దులను ఆడించే వ త్తి గల గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత న త్యాలు చేయిస్తారు. ఇవి చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్లు మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టూ అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చి ఉంటుంది. అందుకనే వారికి ధాన్యం బిక్షగా ఇస్తారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెంతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ తలపాగా ధరించి దానిపై రాగి పాత్ర కదలకుండా ఉంచుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇదంతా పాత సంప్రదాయం. మారిన పరిస్థితుల్లో గంగిరెద్దుల వారు అలా తిరగాల్సిన అవసరం నేడు లేదు.
మూడోరోజు కనుమ. దీనినే పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశువులను రైతులు పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్ని తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, ఎనుములను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
రాయలసీమలో ముఖ్యంగా కదిరి పల్లెల్లో ఇంటి ముందరే పశువుల కొట్టం ఉంటుంది. దానికి దగ్గరే పొంగలి వండుతారు. పొంగలిని కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం, పెసలు, పాలు వేసి వండుతారు. దాన్ని పశువులకు నైవేద్యంగా తళిగ(పళ్లెం)లో సమర్పిస్తారు. కొంతమంది కాటమయ్య దేవునికి కోడిని కోసి నైవేద్యంగా పెడతారు.
మద్దిమాను, నేరేడి మానుచెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పుచెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇదొక పెద్ద ప్రహాసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసెళ్ళు ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు, మేకలు ఐతే కొన్ని వాటంతటవే తింటాయి. లేకపోతే వాటికి కూడా తినిపిస్తారు. ఏడాది కొక్కసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారిణి అని వీరి నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకపోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునైన కత్తితో బాగా చెక్కి వాటికి రకరకాల రంగులు పూస్తారు. కొంతమంది వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో గజ్జల పట్టాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఎద్దుల బండిని కూడా అలంకరిస్తారు. కొన్ని చోట్ల ఎడ్లబండి పందేలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

Sunday, January 24, 2021

లేపాక్షి ఖ్యాతి ఫ్రభవిల్లిన కీర్తి



నాటి వైభవానికి గుర్తింపు • గణతంత్ర పరేడ్ లో శకటం ప్రదర్శన

విజయనగర రాజుల ప్రముఖ వాణిజ్య కేంద్రంగా.. చిత్ర, శిల్పకళా సౌందర్యానికి కాణాచిగా... లేపాక్షి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది.2021,జనవరి, 26న ఢిల్లీ రాజ్ పథ్ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మరోమారు విశ్వవ్యాప్తం కానుంది. మన రాష్ట్రం తర పున 'లేపాక్షి శకటాన్ని పరేడ్లో ప్రదర్శించనున్నారు. 

శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం ఏడు శిరస్సుల నాగేంద్రుడు

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర కాలంలో కోశాధికారిగా ఉన్న విరూపణ్ణ, వీరన్న అనే అన్నదమ్ములు 1522-1588 వరకు 16 సంవత్సరాల పాటు నిర్మిం చారు. ఆలయం మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ఉన్న కొండ పై పునాది లేకుండానే నిర్మించడం

ఎంతో ఘన చరిత్ర కలిగిన లేపాక్షి ఆలయ ఘనకీర్తి పర్యాటకశాల ఆధ్వర్యంలో  నిర్వహించిన ఉత్సవాలతో విశ్వవ్యాప్తమైంది  మొదట 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్సవాలు నిర్వహించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృ త్వంలో రెండుసార్లు ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించి లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలసోదరుడు అచ్యుతదేవరాయలు ఆస్థా 

  
 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్లో లేపాక్షి శకటంలో  
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది విగ్రహం శకటానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవ నుంది. ఆలయ అద్భుత నిర్మాణ శైలి, ముఖ మంటపం, అధ్యాంతరంగా ఆగిన కల్యాణ మంటప నమూనాను ప్రదర్శిం చనున్నారు. రాతితో చెక్కిన పెద్ద వినాయకుడు, ఏడు శివ స్సుల నాగేంద్రుని ప్రతిమ శకటంలో ఆకర్షణగా నిలవనుంది దక్ష యజ్ఞం లో వీరభద్రుడి ఉగ్రరూపాన్ని చాటేలా శకటం ముందుకు సాగే సమయంలో వీరకైవుల సంప్రదాయ కళ రూప నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు.




ఆలయంలోని నాట్యమంటపం, బతా

మంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటపం, వేలాడే స్తంభం ఏడు శిరస్సులు నాగేంద్రుడు, సీతమ్మ పాదం ఎటుచూసిన మనవైపే చూసే శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యమున్న ఇతిహాసాలు నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఆలయంలో మొత్తం 878 స్తంభాలు ఉండగా ఒక్కో స్తంభం ఒక్కో చరిత్రను ప్రస్పుటించేలా శిల్పులు చెక్కారు. ఆలయం గర్భగుడి పైకప్పుపై సహజ రంగులతో 24 అడు గుల పొడవు. 14 అడుగుల వెడల్పుతో గీచిన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం ఆసియాలోనే అతి పెద్ద చిత్రంగా ప్రఖ్యాతి చెందింది. ఆలయంలో వీరభ ద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లు ప్రధాన దేవ తలు.

విశేషం. ఈ ఆలయం కట్టక ముందే ఇక్కడ సీతాదేవి మోపిన పాదం, రాముడు ఆంజనేయుడు, చోళరాజు, ఆగస్త్య మహర్షి ప్రతిష్టించిన లింగాలతో పాటు వీరభద్రుడు స్వయంభు వుగా వెలసిన లింగం ఉంది. ఇలా బర్కడ ఐదు లింగాలు, సీత మ్మపాదం ఒకేచోట ఉండటం చూసిన విరూపణ్ణ అచ్యుతదేవరా యలు అనుమతితో ఆలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఆలయం మొత్తం ఏడు ప్రాకారాల్లో నిర్మించగా ప్రస్తుతం మూడు ప్రాకారాలు మాత్రమే

కనబడతాయి

ప్రపంచంలోనే పెద్ద ఏకశిలా నంది

విజయనగర రాజుల కాలంలో లేపాక్షిలో చెక్కిన ఏకశిలా రాతి నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నంది విగ్రహం 27అడుగుల పొడవు, 18అడు గుల వెడల్పు ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు మైసూరు చాముండి హిల్స్, బెంగళూరు నంది విగ్రహాలు ఉన్నాయి.

Date : 24/01/2021 EditionName : ANDHRA PRADESH( ANANTAPUR. ) Page