Tuesday, September 29, 2020

అనంతపురం జిల్లాలో చారిత్రక సాహిత్యం


అనంతపురం జిల్లాలో చారిత్రక సాహిత్యం

        కల్లూరి వెంకటనారాయకవి 'శాంతి సామ్రాట్' పేర అశోకచక్రవర్తి చరిత్రను రచించాడు. కుంటి సుబ్రహ్మణ్యశర్మ 'విశ్వజ్యోతి' పేరుతో బుద్ధచరిత్రను రాశారు. 'లేపాక్షి' శిల్ప కావ్యాన్ని కిరికెర భీమారావు, చింకాయ గొందికి చెందిన జయరామిరెడ్డి 'కబీరు' కావ్యాన్ని రచించారు.
        విశ్రాంత ఉపాధ్యాయుదైన విద్వాన్ దస్తగిరి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు ఐదుకల్లు సదాశివన్' జీవిత చరిత్రనుఅక్షర బద్ధం చేశారు. అలాగే మరొక కమ్యూనిస్టు యోధులు వి.కె. ఆదినారాయణరెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి, జీవిత చరిత్రలను విద్వాన్ దస్తగిరి గ్రంథస్తం చేశారు. బత్తిన వెంకటరామిరెడ్డి కూడా జిల్లాలో వున్న ప్రముఖ సాహితీ మూర్తులు,స్వాతంత్ర్య పోరాట యోధుల జీవిత చరిత్రలను గ్రంథస్తం చేశారు.

Monday, September 28, 2020

కమ్యూనిస్టు ఉద్యమంలో కామ్రేడ్ పూలకుంట సంజీవులు

                                                 
            నేను పూలకుంటలో రౌద్రనామ సంవత్సరం భాద్రపద శుద్ధసప్తమి ఆదివారం అనగా 07-09-1920 న జన్మిం  చినాను. 1934-35 లలో  పసులూరు హరిజన ఎరికిలప్ప  జిల్లాబోర్డు మెంబరు. ఖద్దరుధారి. పూల కుంట, చియ్యేడు , దుర్గం, మన్నీలలో  ప్రచారం చేసేవారు. నేనూ,నా స్నేహితుడు మోదీన్ సాబూ ఖద్దరు టోపీలు పెట్టుకొనేవాళ్ళం. చియ్యేడు కల్లంగడి దగ్గరకు పోయి  కల్లుతాగొద్దని పాటలు పాడేవారం. తాగుబోతులు ‘కల్లు’ మామింద పోసేవారు. ఎరికిలప్పను  తన్నేవారు. ఎర్రమల కొండప్ప, పసలూరు ఎరికిలప్ప శిస్తు తగ్గించమని  కలెక్టరు ఆఫీసుకు దగ్గరకు జనాలను పిలుచుకొని పోయేవారు. పూలకుంట నుండి జనాలు ఎక్కువమందిని కదిలించేవాళ్ళం.  
             ఎరికిలప్పగారు పూలకుంట వచ్చినపుడు నా యింట్లోనే  భోజనము. ఆయనను యింట్లోకి పిలిచి భోజనం  పెట్ట డానికి  అమ్మకు యిష్టంలేదు. కాని  నచ్చచెప్పంగా, చెప్పంగా భోజనం పెట్టడానికి మాత్రం అంగీకరించింది. మోదీన్ తండ్రిగారు పండితుడు. పాటలు రాసినాడు. కావ్యాలు రాసినాడు. “కాంగ్రెసువాళ్ళు చెప్పేది వినర” వంటి పాటలు రాసినాడు.  “శ్రీ రాముడు తన రామను కారామము దప్పి వెదుక” ఇటువంటి మధురమైన పద్యాలతో రామాయణ కావ్యం రాసినాడు.     
                      1936లో సదాశివన్, ఎరికిలప్పగార్లు మా గ్రామాలకు వచ్చేవారు. ‘కేశవ విద్యానికేతన్’ హరిజన హాస్టలుకు  గింజలు వసూలుచేసేకి వచ్చేవారు. నేనూ, మోదీను వారి వెంట తిరిగి వడ్లు,రాగులు వసూలు చేసేవాళ్ళం. అపుడు ఎకరానికి 10 బస్తాలు పండేవి. బస్తా ధర రెండు రూపాయలు, రెండు ముప్పావలా( రు.02-75) వుండేది. చెనిక్కాయ ‘మణువు’ ఏడు అణాలు( 42 నయాపైసలు), బంగారు తులం రు,18/-  వుండేది. కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. అరవై, డెబ్బై శాతం కూలీలు పస్తులుంటున్నారు. ఒక పూట అడుక్కుతినేవారు. రైతులమీద ఆధారపడి వున్నారు. వూరిలో వీధిబడి వుండేది. నెలకు అర్ధ రూపాయి, రూపాయి యివ్వాలి. గ్రాంటు స్కూలు కూడా వుంది. నేనూ , గురప్ప, వసూలు చేసిన ధాన్యాన్ని గాడుదుల మీద హాస్టలుకు చేరవేసేవాళ్ళం. అపుడు సదాశివన్ గారు ముద్దా, పప్పూ పెట్టేవాడు. ఆయనా మా పక్కనే కూ ర్చొని అదే తినే వాడు. ‘ఏ దేశం పోదాం  బాబూ, ఎంతదూర మాదేశం /  ఆకలి లేదు,అప్పులు లేవు ఆ దేశం రష్యాదేశం “అని మానికొండ సత్యనారాయణ పాటను గ్రాంఫోను పెట్టి వినిపించేవాడు. అన్నా చెల్లెల పాట రష్యా దేశం గురించిన పాటలు వినిపించేవాడు.
                    సదాశివన్ గారు పూలకుంట బి.ఎ.నాగిరెడ్డి  రాప్తాడు కింకిర వెంకటరెడ్డి, పరసన్నాయపల్లి వెన్న పూసల నాగి రెడ్డి, మన్నీల అల్లు మొరప్ప మొదలగు యువకులతో సంబంధాలు పెట్టుకొని క్యాడరును తయారు చేసినాడు. వారికి రాత్రి బస  హాస్టలు. ఈ యువకులు స్వతంత్ర భారత్ ను పంచేవాళ్ళు. కాంగ్రెసు పార్టీలో వామపక్ష భావాలు గల వారిని తయారుచేయాల ని కొన్నిపుస్తకా లు యిచ్చేవారు. మాలపల్లి, విశ్వరూపం, కాంగ్రెసు చరిత్ర( పట్టాభి గారిది). అవి మేం పంచేవాళ్ళం. సదాశివన్  తోపాటు జి. రామకృష్ణ వచ్చేవాడు. అయన సాహిత్యం అందించేవాడు, చర్చలు చేసేవాడు. 
                     1941 లో పూలకుంటలో 15 మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వి.కె.కూడా మాతోపాటు పాల్గొన్నాడు. అర్గనైజరుగా సదాశివన్ గారు వచ్చినారు. పోలీసులు మమ్మల అరెస్టు చేయలేదు. నిరుత్సాహం కలిగింది.  వి.కె. కథ ఎట్లంటే వి.కె.నే ముందుకు వచ్చి తనను అరెస్టు చేయమంటే చేయరు.  పోలీసులు అరెస్టు చేస్తామని ముందుకు వచ్చిన కేసుల్లో  అయన దొరకడు. ఈ సత్యాగ్ర హ సమయంలో నేనూ, కే. నరసింహారెడ్డి శింగనమల, ధర్మవరం యేరియాలో   ఒక నెల రోజులు కాంగ్రెసు ప్రచారం చేసినాము.
                నేను వడ్డేవాన్ని. మా వృత్తి  రాళ్ళు కొట్టడం. 09-08-1942  న వులిసికొండల్లో రాళ్ళు కొట్టుకుంటూ వుంటే పోలీసులు జీపులో వచ్చి నన్ను అరెస్టు చేసినారు. అప్పటికే  నరసింహారెడ్డి, గురప్ప, మోదీన్ సాబ్ లను  అరెస్టు చేసినారు. మూడు నెలల యిరవై రోజులు సబ్ జైలులో ఉంచినారు  రైల్వేపట్టాలు పీకేసినామని  మాపై కేసు. సాక్షులు రాలేదు.  కాంగ్రెసు పైన ఎట్లా చెప్పేదని?  ఎవరూ  సాక్ష్యం చెప్పలేదు. కేసు కొట్టేసినారు. 
               ఉప్పరపల్లి రెడ్డి  బలమైనవాడు. ఆ  వూరి కురువవాండ్లకు బలం చాలదు. భయపడి రెడ్లకు గొర్రెలు సమర్పించుకో వల్ల. నాయకులు అండర్ గ్రౌండ్ లో వున్నారు. రహస్యంగా రాప్తాడు గరండాల వద్ద  వి.కె. సదాశివన్, తరిమెల నాగిరెడ్డి, నేనూ, సి.ముత్యాలప్ప సమావేశం అయి చర్చించినాము.  రెవెన్యూ మంత్రి కళావెంకట్రావుకు  మెమొరాండం యివ్వాలని నిర్ణయం. సంజీవులు, ముత్యాలప్ప కరపత్రం వేసినాము.  గొర్రెలు,కుక్కలు జనాన్ని పిలుచుకొని సదాశివన్,జి.రామకృష్ణ, నేనూ, ముత్యాలప్ప, నరసింహారెడ్డి అనంతపురం  దగ్గర మెమొరాండం యిచ్చినాము. రెడ్డిని బర్త్ రఫ్ చేసినారు. 
                1946- 47- 48 లో కరువు. పార్టీ పిలుపు మేరకు స్టోర్లు పెట్టాలని,  స్టోర్లలో బండికమ్మలు అమ్మాలని, రంగూన్   బియ్యం సక్రమ పంపిణి చేయాలనీ పోరాటాలు చేసినాము. బ్లాక్ మార్కెట్ చేయకుండా చేసినాము.  ప్రొక్యూర్ మెంట్ పెద్ద రైతుల దగ్గర మాత్రమే చేయాలనీ డిమాండు పెట్టాము. 
                   ఆకుతోటపల్లిలో శిల్పం చెక్కుతావున్న నన్ను  పోలీసులు అరెస్టు చేసి,  డిటెన్యూగా కడలూరు జైల్లో పెట్టినారు.  కడలూరు జైలు ఒక యూనివర్సిటీగా వుండేది. పెద్దవాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఎ.కె. గోపాలన్ వంటి వారు నిరంతరం క్లాసులు తీసుకొనేవారు.నెలకు 50/- లు అలవెన్సు యిచ్చేవారు. కమ్యూనిస్టుపార్టీకి రాజీనామా చేస్తే విడుదల చేస్తామని జైలు అధికారులు ఆశ పెట్టినారు. నాకు తెలిసి  అట్లా ఆశపడినవారు  ఒక్కరు లేరు. జైలులో  చైనా డే  జరిగింది. రణదివే నాయక త్వాన  కడలూరు జైలుల్లో  పోరాటం జరిగింది. తుపాకులతో పోలీసులు వస్తే, కట్టెలతో సి.పి.ఐ. ఎదురు దాడి చేసింది. జైలరు థామస్ 24గం. తాగుతాడు. ఎ.కె.గోపాలన్ కు థామస్ కు పడింది. ఎ.కె.గోపాలన్ జైలరు పిస్తోలు లాక్కున్నాడు.  కాల్పులు జరిగినాయి. ఇద్ద రు చనిపోయారు. రామకృష్ణ, గజ్జల మల్లారెడ్డి. ముత్యాలప్ప, నేనూ కింద పడుకున్నాము. జైలరు పోయినా డా లేదా అని చూడ బోతే రవ్వ వచ్చి తగిలి కన్నుపోయింది  జి. రామకృష్ణకు.                    
               చియ్యేడు, పూలకుంటలో కౌలుదార్ల ఉద్యమం జరిగింది. పూలకుంట, దుర్గం, చియ్యేడు గ్రామాలలో దాదాపు 75 శాతానికి భూములు లేవు.  అంతా కోరుకు చేసేవాళ్ళే. కపిల బావులు, చెరువుల కిందా సాగు.మూడింట రెండువంతులు కోరు  దారుకు, ఒక వంతు భూస్వామికి ఉండేది. అన్నిఖర్చు లు కోరుదారే భరించాలి.  మూడు గ్రామాల కోరు రైతులను, చిన్న రైతు లను కలిపి రాత్రిపూట మీటింగులు పెట్టినాము.  నిర్ణయం మేరకు రైతులు,కోరుదారులు సమ్మె చేసినారు. భూములు బీడుపడి నాయి. భూములు బీడు పడుతానే పోలీసులు నా  కోసం వెతకలాడబట్టిరి.  ఆఖరుకు సబ్ కలెక్టరు, DSP, సి.ఐ.డి.ఇన్ స్పెక్టర్   పూలకుంటకు వచ్చినారు. “ ఏమండీ! మీ వూళ్ళో ఈ సమస్య వుంది. ఎందుకు ఘర్షణ పెట్టుకుంటారు? మా దగ్గరకు వస్తే మేము పరిష్కారం చేస్తాము కదా! సంజీవులు గారిని ఎక్కడున్నా పిలిపించండి. తొందరగా పరిష్కారం చేసి పోతాము.” అని నమ్మ బలికినారు మంచి మాటలతోనే.  పూలకుంట బయట డెన్నులోనే వున్నాను. ఆ వూరిలో  90 శాతం అంతా  పార్టీ అనుకూలురే. హానిచేసే వాళ్ళు ఒక్కరూ లేరు. పోలీసులు వచ్చినారంటే తక్షణం కామ్రేడ్స్ కు  చేరవేసేవాళ్ళు జనాలు. ఒక వేళ డెన్నులో లేకుండా ఊర్లో వున్నా  దగ్గరలో వున్న ఏ ఇంట్లో దూరైనా రక్షణ తీసుకోవచ్చు.ఆ రోజుల్లో పూలకుంట, కృష్ణమరెడ్డి పల్లి. ప్రసన్నాయపల్లి, సోదనపల్లి (మరింత బలమైన కేంద్రం) రహస్య కేంద్రాలు. నేను  వద్దు,వద్దు, అన్నా వినకుండా నన్ను బయటకు తెచ్చినారు  కామ్రేడ్స్.  వి.కె. గారు వేరే తాలుకాలో వున్నారు. సమస్య పరిష్కారం కోసం కాదు, నన్ను అరెస్టు చేయ డానికే వచ్చినారు  అని చెప్పినా వినలేదు. నువ్వు బయటకు వస్తే పరిష్కారం అవుతుందని డి.నాగిరెడ్డి, సత్తారు, కూరపాటి రామిరెడ్డి  నన్ను బయటకు తెచ్చినారు. జనం ఎనిమిది వందలు దాకా వుంటారు.  స్కూలు దగ్గరకు రాగానే రిజర్వ్ పోలీసులు చుట్టు ముట్టినారు. అపుడు మోసం తెలుసుకున్న జనం రాళ్ళతో, గుండ్లతో తిరగబడినారు. DSP  నా దగ్గరకు వచ్చి, “సంజీ వులు గారు! చావాలనుకున్నారా? మీరు చస్తారు, మేము చస్తాం.  దానివల్ల లాభం ఏమిటి?”  అన్నాడు.  జనాన్ని ఆపి,  నమ స్కారం పెట్టి, అరెస్టు అయినాను.
           కొరియర్ ద్వారా విషయం తెలుసుకొని  రాత్రికి రాత్రే వి.కె.గారు వచ్చినారు.  అరెస్టును ఖండిస్తూ ఒక కరపత్రం వేసి నాడు.( పూలకుంట సంజీవులు అరెస్టు, చియ్యేడులో పోలీసుల తందనాలు 08-04-1949 )   ఉద్యమం నడిపినాడు.చేండ్ల లో సమావేశాలు వేసి సమ్మె కొనసాగేటట్లు చేసినాడు. చివరకు భూస్వాములు డి.నాగిరెడ్డి, కూరపాటి రామిరెడ్డిలతో సంప్రదింపు లు జరిపి కోరుదార్లకు అనుకూలమైన ఒప్పందం చేసుకున్నారు. 
       నేను  జైలునుంచి వచ్చిన తరువాత నన్ను  కలుసుకోడానికి వీకే  పూలకుంటకు మా యింటికి వచ్చినాడు. జైలు జీవితం గురింఛి విచారించిన తరువాత శివాయిజమా పోరాటాలు చేద్దామని మొదలు పెట్టినాడు “ ఇగో వి.కె.అన్నా! ఇంకా నెల కూడా కాలేదు. మల్లా పంపిచేతట్లు ఉండవే!’ అని నవ్వింది నా భార్య .“ తప్పదమ్మా యివన్నీ! ఈ సారి అట్లా జరగదులే. ఈయప్ప ఇంట్లో  వుంటాడు. నేను జైలుకు పోతా” అన్నాడు వీకే.  పూలకుంటలో  ధనిక రైతుల ఆధీనంలో వున్న  290 ఎకరా లు పంచల్ల అని ప్లాన్ వేసినాం. ఆ ధనిక రైతులు తమ చేండ్లకు ఆనుకొనివున్న కొండలు, గుట్టలు, గొందులు అన్నీ  ‘ మావే  అంటారు. పసలోన్నీ రానీరు, గోర్లోన్నీ రానీరు.  పట్టపగలే ఆక్రమించినాం.  దగ్గర దగ్గర 40 కాండ్లతో మడకలు కట్టించి. ఎర్రజండాలు కట్టించి, తప్పెట్లతోమ్యాలాలతో ఆభూములు ఆక్రమించినాం.  భూస్వాములు రాలేకపోయిరి. ఇది 1951 నాటి మాట. అంటే శివాయిజమా చట్టం రాకముందే పార్టీ అమలు పరచిన చట్టం. భూస్వాములు బహిరంగంగా పార్టీని ఎదిరించ లేక రహస్యంగా పోలీసులకు రిపోర్టులు పంపేవారు. అట్లా పంపేవాళ్ళ లో ఒక పొగరుబోతును గుర్తించినారు కామ్రేడ్స్. అత న్ని  దారి కాచి కొట్టినారు కామ్రేడ్స్. సంజీవులు, వి.కె. అండర్ గ్రౌండులో వున్నారు. డి.నాగిరెడ్డి, సత్తారు, ఓబులే సు, ఆ పని చేసినారు. “ యిప్పుడు ప్రాణాలతో వదలుతున్నాం. ఈ సారి ప్రాణాలు తీస్తాం.” అని హెచ్చరించినారు. భయపడి పోయి ఇక మీదట పంపము అని అగ్రిమెంటు చేసుకున్నారు. ఆ రోజుల్లో  యిట్లా  కట్టడి చేయకపోతే  మేము తిరగటం ఇబ్బంది,  ప్రజాకా ర్యక్రమాలు చేయడం ఇబ్బంది. ఆ తరువాత  భూఆక్రమణ  కొనసాగింది. రిజిస్టర్లు లేవు, పట్టాలు లేవు. ఆక్రమించిన వాళ్ళే తాడుతో కొలతలేసుకొని, ఒద్దికతో, ఒప్పుదలతో  మేరలు  నిర్ణయించుకున్నారు, వారంటు ఉండడం తో నేను  అజ్ఞా తంగా వున్నాను. పోలీసులు వచ్చి నాయిల్లు, సత్తార్ యిండ్లు పడగొట్టినారు. భార్యా, యిద్దరు పిల్లలను వీకే సురక్షిత ప్రాంతంలో పెట్టినాడు. నేను నరిసినేకుంటలోచిక్కినాను. సబ్ జైలులో వేసినారు.“ నిన్ను డిటెన్యూగా మల్ల జైలుకు పంపుతాము. నువ్వు  చాలా దుర్మార్గంగా వున్నావు. విదిచిపెట్టేస్తే మళ్ళా ఉద్యమాలు నడుపుతావా?” అని DSP అన్నాడు. . ‘ అనంతపురం విడిచి ఎక్కడకు పోకూడదు. పల్లెలకు పోకూడదు. పల్లెలో చిక్కితివా, చిక్కినచోటే కాల్చిపారేస్తా , ప్రతిరోజూ కనపడల్ల, రిపోర్టు చేయల్ల’ అన్నాడు. దానికి నేను అంగీ కరించలేదు.  నేను స్టేషనుకు వచ్చి రోజూ కనపడటం సాధ్యం కాదు.మీరేం చేసుకుంటా రో చేసుకోండి  అన్నాను.
                నరసనేకుంటలో  భార్యను,పిల్లలను, నాయన్ను పెట్టి  రాత్రిపూట  వి.కె.తో కలుసుకొని పల్లెలెంబడి తిరిగేవాన్ని. పోలీసుల కేమంటే  నాకు వ్యతిరేకంగా పల్లెనుండి రిపోర్టు పోగూడదు అంతే.
                 1952 ఎన్నికలలో వి.కె.గారితో పాటు ప్రచారానికి తిరిగినాను. మాకు  అనంతపురం, నార్పల ప్రాంతాలు కేటా యించినారు.. నెహ్రు వచ్చినారు. లక్షమందితో బహింగసభ జరిగింది. సంజీవరెడ్డి దుర్మార్గాలు, కాంగ్రెసు దుర్మార్గాల మీద పార్టీ కరపత్రం వేసింది. యింతమంది జనాలు వచ్చినారు. నేను తప్పక గెలుస్తా ను, నాగిరెడ్డి ఓడిపోతాడు, ఓడిపోతాడు అన్నా డు సంజీవరెడ్డి. ఆ సభలో వున్న కామ్రేడ్స్.“ మీరు తప్పకుండా ఓడిపోతారు. నాగిరెడ్డి గారు తప్పక గెలుస్తాడు. గెలుస్తాడు’ అని గట్టిగా అరచినారు.  ఈ ఎన్నికలలో సంజీవరెడ్డిగారు ఓడిపొయినారు. నాగిరెడ్డి గారు గెలిచినారు.          
              రహస్య దినాల్లో  కామ్రేడ్స్ కలుసుకొనేది కొండల్లోనే.  రాత్రి పూట  పడుకొనేది అక్కడనే. దుర్గం, చియ్యేడు కొండ ల్లో పూలకుంట, చియ్యేడు కామ్రేడ్స్ వుండేవారు. వి.కె.గారి వెంట నేను పల్లెలు తిరుగుకుంటూ ఆ కొండల్లో  చేరేవాళ్ళం. వి.కె. గారికి  ఈ కామ్రేడ్స్ అంటే చాలా ప్రేమ.  ఒక ఉదాహరణ చెప్తా ---  మీరంతా నిద్ర పోండి.  తెల్లార్లు  నేను సెంట్రి డ్యూటీ చేస్తా అనేవాడు.  తెల్లార్లు నిద్రపోడు. మేలుకొనే వుంటాడు. మేము ఎపుడన్నా  వంతులవారి గంటకొకరో,  రెండు గంటల కొకరో  డ్యూటీ  చేసేవాళ్ళం.  దుర్గం కొండల్లో  దేవలాలు, సత్రాలు వున్నాయి. అక్కడ తరగతులు నిర్వహించారు. సదాశివన్ గారు, వీకే గారు  తరగతులు బోధించినారు. ప్రజలు మాకు  అన్ని సౌకర్యాలూ అందజేస్తారు. కాఫీలు, టిఫెన్లు, భోజనాలు అన్నీ రహ స్యంగానే అందజేసేవారు. సదాశివన్ గారితో పెద్ద సమస్య. సిగరెట్టు గాని, బీడి గాని తాగనీడు. కంబడి కప్పుకొని  తాగుతామ ని అన్నా  సదాశివన్ గారు  ఒప్పుకోనే ఒప్పుకోరు. పరసన్నాయపల్లె,  క్రిష్ణమరెడ్డి పల్లి, చియ్యేడు, పూలకుంట కామ్రేడ్స్ ఈ తర గతులకు హాజరైనారు. తరిమెల యేరియా గంపమల్లయ్య కొండల్లో కూడా ఇట్లాంటి తరగతులు నిర్వహించి నారు.  అక్కడ వి.కె.గారు, నాగిరెడ్డి గారు తరగతులు బోధించినారు. ఇక్కడి నుండి డి.నాగిరెడ్డి, చియ్యేడు కృష్ణారెడ్డి ఆ తరగ లకు హాజరై నారు.“రహస్య రోజుల్లో కామ్రేడ్స్ కు ఏమీబాధలు కలగకూడదు. అవి ఏమన్నా వుంటే నేనే భరిస్తాను” అనేది వి.కె గారి .వైఖరి. జాగ్రత్తగా చూసేవాడు.  
            1952 ఎన్నికల తరువాత అనంతపురం తాలుకాలో రాజశేఖరరెడ్డి నాయకత్వం వహించినాడు. పెద్ద పోరాటాలు జరిగినాయి.  కళ్యాణదుర్గం, కూడేరు మండలం, అనంతపురం తాలుకాలో పెద్దపోరాటాలు జరిగినాయి. నేను, చలిచీమల ముత్యాలప్ప,రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన గార్లదిన్నె మండలం బూదేడులో గుర్రం నారాయణప్ప గారి 500 ఎకరాలు ఆక్రమణ చేపట్టినాము.  ఆయన పెద్ద భూస్వామి. మంది, మార్బలాన్ని తెచ్చినాడు. సారాయి డబ్బాలు దించినాడు. రాజశేఖర రెడ్డి మా నాయకుడు. కొండాపురం సుంకిరెడ్డి,( పామిడిదగ్గర కొండాపురం అప్పుడు పార్టీకి పెద్ద యూనిట్టు) తరిమెల శ్రీరామి రెడ్డి జనాన్ని తీసుకొని వచ్చినారు. శింగనమల SI  పోలీసులతో వచ్చినాడు. SI  భూస్వామినే అరెస్టు చేసినాడు. వ్యవసాయకా ర్మిక కార్మికసంఘ పోరాటానికి లభించిన చారిత్రాత్మక విజయ మంటాడు రాజశేఖరరెడ్డి.  నాకు తెలిసి అనంతపురం జిల్లాలో భూస్వామిని  అరెస్టు చేసిండేది ఈ ఒక్క సంఘటనే. 500 ఎకరాలు ఆక్రమించినాము. వ్యవసాయ కార్మికసంఘ జిల్లాకార్యద ర్శి  నేను, అధ్యక్షుడు భంగి ఎర్రిస్వామి. రాజశేఖర రెడ్డి నాయకత్వాన  ఆ యేరియాలో చాలా గ్రామాల్లో భూ ఆక్రమణలు చేసి నాము. తిమ్మసముద్రం నారాయణ రెడ్డి రాజశేఖరరెడ్డికి దగ్గర బంధువు. ఆయనివి  800 ఎకరాలు ఆక్రమించినాం. రాజశేఖర రెడ్డి కార్యకర్తలతోపాటే  ఒక కార్యకర్త యింట్లో అన్నం తింటున్నాడు. నారాయణ రెడ్డి అదేపనిగా మేముండే దగ్గరకు వచ్చి ఏం రాజశేఖర రెడ్డి!యింటికి పోయి భోంచేసి యివన్నీ చూసుకోవచ్చు గదా! ఏమప్పా! నేనున్నాను గదా. ఆ మాత్రం గుర్తించలేడా ? నువ్వు కార్యక్రమాలు ఏమన్నా  చేసుకో అవన్నీ నాకు కాబట్టవు. నాకు చాతనైతే ఎదుర్కొంటా. లేకుంటే ఓడిపోతా.’ అన్నాడు .”లేదు చిన్నాయనా! ఈ పనులన్నీ చూసుకొని వస్తామనుకొంటి” అన్నాడు .రాజశేఖరరెడ్డి.. నారాయణ రెడ్డి ఆ భూములన్నీ వదలుకున్నాడు. రాజశేఖర రెడ్డి నాయకత్వాన ఆ ఏరియాలో జరిగిన పోరాట ఫలితమది. ఆత్మకూరు మండలం లోని పడమట యాలేరులో క్రైస్తవులు ఎక్కువ. వాళ్ళంతా మేధావులు. MA, BA లు చదివినవాళ్ళు. మా బృందం  మీటింగు పెడితే ‘కమ్యూ నిజం ఈ దేశానికి కొత్త. కమ్యూనిజం ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి పరుస్తుంది? అని ప్రశ్నించేవారు. “క్యాపటలిజం ఈ దేశానికీ కొత్త. దేశంలో మనగలుగుతోంది కదా! క్రైస్తవం ఈ దేశానికి కొత్త.మీరంతా క్రైస్తవ మతం తీసుకున్నారు కదా!” అని మేం జవాబిచ్చేవాళ్ళం.‘ ఓనమాలు రాకపోయినా ఈ కమ్యూని స్టులతో వాదించలేము” అనుకొం టూ MA, BA లు వెళ్ళిపోతారు.       
                   1955  ఎలెక్షన్  ప్రచారానికి  పోయినాము. ఆంథోనిరెడ్డి గారు మా  ప్రత్యర్థి అభ్యర్థి. ఆయన సంజీవరెడ్డిగారికి   చాలా ప్రియమైనవాడు. అక్కడకు పోయింది పార్టీ ప్రచార దళం. బీదల యిండ్లకాటికే పోయినాము.  గోనెపట్టల మీద, పాత ఈతచాపల మీద రాజశేఖరరెడ్డి తో సహా అందరూ కూర్చున్నాము.  వాళ్ళు పెట్టిన బొరుగులో, కారం బోరుగులో తినేవాళ్ళం. అప్పటికి కరెంటు రాలేదు ఆవూరికి.  గ్యాస్ లైట్లు ముట్టిచ్చుకొని ఏడెనిమిది మంది రెడ్లు వచ్చినారు. “ ఏమర్రా సంజీవులు! ఓబులప్పా! ( ముద్దలాపురం)  మీకన్నా తెలీదేమర్రా?   నా యింట్లో కూడుతిని, తరువాత యాడన్నా సాయండి. రేప్పొద్దున సంజీవరెడ్డి అడిగితే మాకు సిగ్గుపోదా?” అన్నారు.“ అవన్నీ ఏమీ లేదు. వీళ్ళతో మాట్లాడి వస్తామనుకోయింటి ఓట్లడిగేకి. మీరు ఓట్లు వేయరు. అయినా అడిగే ధర్మం వుంది కదా!” అని రాజశేఖర రెడ్డి జవాబు. నిష్టురమెందుకు? అక్కడికే పోదామం టే  “సంజీవులు! నువ్వూరుకో. మనం యెక్కడికి పోవల్లనో ఆటికే పోవల్ల.వాళ్ళ దగ్గర నువ్వు తినకపోయినా నేను తింటానప్పా. బొరుగులు పెట్టనీ కారాలు పెట్టనీ.” అనేవాడు. అట్లా ఈయన పేదవాళ్ళ యింట్లోనే కూర్చోనేవాడు. పేదవాళ్ళు పెట్టిందే తినేవాడు. 
            రాజశేఖర రెడ్డిగారు గొప్ప మార్క్సిస్టు తత్వవేత్త. ఏ మాట మాట్లాడినా థియరిటికల్ గానే మాట్లాడుతాడు. ములాజు లేదు. మా పూలకుంట శాఖలో నాకు ఇంకో కామ్రేడ్ కు తగాదా వచ్చింది. ఆ కామ్రేడ్ మంచి ఉపన్యాసకుడు. తాలూకా స్థాయి నాయకుడు. గ్రామ శాఖ ఆయన్ను తీసేసింది.. అయన జిల్లా పార్టీకి అపీలు చేసుకున్నాడు.  ఒక జిల్లా నాయకుడు వచ్చినాడు. శాఖ రిపోర్టు విన్నాడు. తొలగించిన కామ్రేడ్ వాదన విన్నాడు. ఏమి చెప్పకుండానే వెళ్ళాడు. ఆ కామ్రేడ్ ను తీసివేస్తే ఆ ఏరియా లో కమ్యూనిస్టుపార్టీ ఎట్లా బలపడుతుంది? సంజీవులు యాడ నిర్మిస్తాడు? అని వాదించినాడు. అప్పుడు రాజశేఖరరెడ్డి  ‘ అంటే నువ్వు మార్క్సిజం ఏం చదువుకున్నావ్?  పార్టీ నిర్మాణానికి కార్మిక వర్గం తరము కాదా? భూస్వాములే ఆకర్షిస్తారా? వట్టి ఆక ర్షణ కాదు.ఉద్యమాలు కావల్ల. ప్రజలు తమంటకు తాము పోరాటాలు చేసుకోవల్ల” అన్నాడు. నేను జిల్లా కమిటీ సభ్యుణ్ణి. పూలకుంట శాఖతీర్మానాన్నే   జిల్లా కమిటీ ఆమో దించింది. అదీ రాజశేఖరరెడ్డి అంటే. 
         రాజశేఖర రెడ్డి గారు, నేనూ  రాత్రిపూట  ఆత్మకూరు మండలం,పడమట నారాయణపురం పోతున్నాం నడుచుకుంటూ.  శివాయిజమా పోరాటం జరుగుతున్న కాలం.1952 నాటి మాట యిది. ఇద్దరే పోతున్నాము. అక్కడినుంచి ఇద్దరో, ముగ్గురో వస్తున్నారు.చీకటి సరిగా కనపడరు. మమ్ముల చూసి వాళ్ళు నిలబడినారు. మేమూ నిలబడినాం. ఎట్ల వాళ్ళతో సంప్రదింపు లు జరిపేది? ‘ సంజీవులూ!’ అనె. ‘ ఏం రాజన్నా!’ అంటి. ‘ ఓ పాట పాడప్పా!’ అనె. పాట అందుకుంటి. పాట అంటే పార్టీ పాటనే. పాడతానే ‘ ఒరే! మన కమ్యూనిస్టు పార్టీ వాల్లురా!’ అని దగ్గరకు వచ్చేసిరి.  అక్కడ ఉద్యమముంది. పైగా శివాయిజ మా ఉద్యమం బలంగా వుంది.  ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను  సస్పెండ్ చేయించిననాం.  ఆ కాలంలో దాదాపు 400 ఎకరాలు పంచినాం   కడదరకుంట, కరుట్లపల్లి, నారాయణపురం మొదలగు గ్రామాల్లో.     
         కల్యాణదుర్గం యేరియాలో 16వేల ఎకరాలు చట్టం రాకుండానే పార్టీ పంచింది.. భంగి ఎర్రిస్వామి, భంగి రామప్ప, తుపాకుల రాముడు వీళ్ళంతా మహా వీరులు.  1954 కర్నూలుకు పెద్దఆకలి యాత్ర చేసినాం.  కల్యాణదుర్గం, అనంతపురం తాలూకాల నుండి జనం ఎక్కువ మంది వచ్చినారు. పోలీసులకు కార్యకర్తలకు పెద్ద ఘర్షణ.  గుంతకల్లులో లాఠీఛార్జి జరిగిం ది.రైలు ఎక్కడం, దిగడం. గొలుసు లాగడంఎట్లో కర్నూలు చేరుకున్నాం. బ్రహ్మాండమైన ప్రదర్సన. ఊరేగింపు తరువాత సభ. ప్రకాశంపంతులు గారు ముఖ్యమంత్రి. సంజీవరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి. “ ఏది ఏమైతేనేమి? కుటుంబానికి ఐదెకరాలు పంచుతాము. నాగిరెడ్డిగారూ మీరు యింటికి వెళ్లిపోవచ్చు.”  అన్నాడు ప్రకాశంపంతులుగారు.
         1940 - 41  ల నుండి సదాశివన్, రాజశేఖర రెడ్డి గార్లతో  నాకు పరిచయం. అయితే వి.కె.గారితో 1942 ఆగస్టు లో సబ్ జైలులో పరిచయం. మన్నీల దగ్గర రైలు పట్టాలు పీకినారని కేసు మోపి నన్ను, మోదీన్ సాబ్, నరసింహారెడ్డిలను తెచ్చి సబ్ జైలులో పెట్టినారు. కాలేజి ల్యాబ్ దహన కేసులో  వి.కె. గార్ని జైల్లో పెట్టినారు. సదాశివన్ గారు, రాజశేఖర రెడ్డిగారు, మాల్యవంతం వెంకటరెడ్డి గారు, కె.ఎస్.రాఘవాచారిగారు కూడా అదే జైలులో వున్నారు. వేరే కేసుల్లో లోలూరు ఎల్.బి. శాస్త్రి, శివశంకర్ వున్నారు. అదే వీకేతో  మొదటి పరిచయం. మా యిద్దరికీ  సంధాన కర్త జి.రామకృష్ణ . ఆయనే వి.కె.గారు యిచ్చే పుస్తకాలు సాహిత్యం  అందజేసేవాడు.  
           సబ్ జైలులో పరిచయం తరువాత వారానికి రెండు సార్లన్నా  పూలకుంట నుండి నడచిపోయి వి.కె.గారిని చూసి వచ్చే వాన్ని. అనేక పుస్తకాలు యిచ్చేవాడు. అనేక విషయాలు చెప్పేవాడు. జిల్లా జాతీయోద్యమంలో పాల్గొన్న మాలాంటి యువకుల
ను సమీకరించి  నెలకొక్కసారన్నా రాజశేఖర రెడ్డి గారింట్లో తరగతులు పెట్టించేవాడు. తరిమెల నాగిరెడ్డి గారు, ఐదుకల్లు సదా  శివన్ గార్లు  టీచర్లుగా ఈ తరగతులు నిర్వహించేవారు  యిపుడు వి.కె.గారున్న యిల్లు ఒకప్పుడు ఠాగూర్ లాడ్జ్ గ వుండేది. అక్కడ స్టడీసర్కిల్స్  నిర్వహించేవారు. వి.కె. గారు ఈ యన్నిట్లో  చాల చురుకుగా పాల్గొనేవాడు. వి.కె.గారు మా వయసు వారి కందరికీ చాల ప్రీతిపాత్రుడు.  చాల ఆప్యాయంగా మాట్లాడుతాడు. నిదానము, నిబ్బరంగా వుంటాడు.అందరినీ ఆకర్షించే శక్తి ఆయనలో వుంది. మంచి మాటలతో, మంచి పద్ధతులతో ఎవరికి ఏ సహాయం చేయాలన్నా చేసేసేవాడు. అందువల్ల మా లాం టి యువకులందరికీ వి.కె. అంటే ఆకర్షణ.  
             ఒకసారి ప్రసన్నాయ పల్లెలో కలరా వచ్చింది. 1943లో. పరసన్నాయపల్లె మా అమ్మ పుట్నిల్లు. నేను  కొంతకాలం అక్కడే పెరిగినాను. కలరా వచ్చిన సంగతి తెలిసి  పూలకుంట నుంచి నడుచుకుంటూ పరసన్నాయపల్లె చేరినాను. అప్పటికే వి.కె. గారు పదిమంది విద్యార్థులతో చేరుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఊరిలో నా స్నేహితుడు  వై.నాగిరెడ్డి,నేనూ   పాల్గొన్నాం. వీధులన్నీ వూడ్చినాం పరిశుభ్రతపై అవగాహన కల్పించినాం. ఈ కార్యకలాపాలు చూసి రైతులంతా చాలా ఆశ్చ ర్య పడినారు. వి.కె.గారిని ప్రశంసించినారు. నన్నూ, నాగిరెడ్డిని  కూడా  ప్రశంసించినారు. 
           ఆ సంవత్సరంలోనే  జి. రామకృష్ణ నాతో సభ్యత్వ దరఖాస్తు రాయించుకొని రాజశేఖర రెడ్డి గారికి యిచ్చి నాడు. రెకమెండు చేసిన వారెవరంటే సదాశివన్ గారు, జి.రామకృష్ణగారు. రెకమండేషన్ వుంటేనే సభ్యత్వం. ఆ సంవత్సరం లోనే పరసన్నాయపల్లె నాగిరెడ్డి, ముద్దలాపురం ఓబులప్ప, ఇంకా అయిదారు మందికి సభ్యత్వం యిచ్చినట్లు నాకు బాగా జ్ఞాప కం. 
              1943 లోనే కమలానగర్ లో 30 -35  సభ్యులతో పార్టీ సమావేశం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ కమిటీని ఎన్నుకు న్నాము. రాష్ట్రపార్టీ నుండి ముక్కామల నాగభూషణరావు గారు హాజరైనారు. ఆర్గనైజర్ గా రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నాం ఆ కమిటీలో రాజశేఖర రెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, జి. రామకృష్ణలను కమిటీమెంబర్లుగా ఎన్నుకున్నాం. 1946 లో ఉరవకొండలో  జిల్లా పార్టీ ప్రథమ మహాసభ జరిగింది.  దాదాపు 62 ప్రతినిధులు హాజరైనారు. అనంతపురం తాలూకా నుండే  ఎక్కవమంది హాజరైనారు. రాష్ట్రం నుండి  చండ్రరాజేశ్వరరావు గారు హాజరైనారు. తరిమెల శ్రీరాముల రెడ్డి, సోదన పల్లె నారాయణరెడ్డి, భంగి ఎర్రిస్వామి, తుపాకుల రాముడు, గణేనాయక్, కమ్మక్కగారి దాసప్ప, రాము, తాతినేని వెంకటేశ్వర రావు ఇలా అన్ని ప్రాంతాల నుండి యోధులంతా వచ్చినారు. రాజశేఖర రెడ్డిగారిని  కార్యదర్శిగా ఎన్నుకొన్నాం. 
               1945 లో ధర్మవరంలో పేరూరు ప్రాజెక్టు మహాసభ జరిపింది పార్టీ. గాడిచర్ల హరిసర్వోత్తమరావు వచ్చినారు. పల్లెం శ్రీనివాసులు గారు  బాగా సహాయపడినారు. శ్రీనివాసులు గారు, సదాశివన్ గారు మంచి దోస్తులు. ఆ సభ కోసం పల్లెలు తిర గాల్సివుంది. వి.కె.ను నన్నూఒక దళంగా వేసినారు. రెండు సైకెండ్లు యిచ్చినారు. ఏ సభలు జరిపినా మేమిద్దరం ఒకటే దళం.  నేనే ఎందుకంటే నేను బాగా పాటలు పాడుతాను కాబట్టి.పాటలు విన్న జనం బాగా వస్తారు. ఆ కిటుకు ఆయన కు తెలుసు. జాతీయ గీతాలు పాడేవాణ్ణి. గురజాడ అప్పారావు గీతాలు పాడేవాన్ని.  పదండి ముందుకు, పదండి ముందుకు తోసుక పోదాం  పైపైకి  వంటి మహాప్రస్థానం  గీతాలు పాడేవాన్ని, కొన్ని నా స్వంతపాటలు పాడేవాన్ని. నేను బాగా పాడేవా న్ని.గొంతు బాగుండేది. నేను రచ్చకట్ట మీదో, దేవలంముందో నిలబడి పాడుతూవుంటే ఊరు ఊరంతా వచ్చేది. అబద్దం కాదుసార్!  నిజం. దాని కోసం వి.కె.గారు అదేపనిగా నన్నే ఎంచుకొంటాడు.  నాకు సంజీవులే కావల్ల అనేవాడు. రాజశేఖర రెడ్డి కూడా  పోట్లాడేవాడు  నా కోసం.  
                బుక్కపట్నంలో  1945 మే లో  జిల్లా రైతు సంఘ మహాసభ జరిగింది.  సభకు రాష్ట్రం తరఫున సుందరయ్యగారు వచ్చినారు. మిక్కిలినేని రాధాకృష్ణగారు బుర్రకథ చెప్పడానికి వచ్చినారు. చెరువుకింద పెద్ద పెద్ద  పందిర్లు వేసినారు. జిల్లా నలుమూలల వుండే కార్యకర్తలంతా వచ్చినారు. దాదాపు జనం ఐదువేలమంది వచ్చింటారు. కార్యకర్తలు 150మంది వచ్చి నారు
               మహాసభల ప్రచారం నిమిత్తం సదాశివన్ గారు మూడుదళాలు వేసినాడు. వెంగళమ్మ చెర్వు లక్ష్మినారాయణ రెడ్డి , నీలం రాజశేఖర రెడ్డి, వి.కె.ఆదినారాయణ రెడ్డి దళ నాయకులు. సంజీవులు నాకు కావల్లంటే, నాకు కావల్లని రాజశేఖర్, వికె.ల మధ్య పోటి. ఆఖరకు వి.కె.జతకే నేను . ఎందుకంటే మొదటినుంచి వి.కె. జతగాడు.రాజశేఖర్ నాకంటే పెద్దోడు, గురు వు.  సమానంగా  మాట్లాడేకి వుండదు. వికె తో అయితే అన్ని మాట్లాడుకోవచ్చు. తమాషాలు పడవచ్చు.  
              వికె. చానా చొరవ వున్న మనిషి.  కుంటిమద్ది, దాని చుట్టుపట్టు పల్లెలకు పోదాం అంటాను నేను . అక్కడ జాతీ యోద్యమం వున్న పల్లెలవి.  తెలిసినవారుంటారు అని నా అభిప్రాయం. కాదు కొత్తపల్లెలకు పోదాం అంటాడు వికె. ఎక్కడికి పోదాం అంటే  మేడాపురం పోదాం అన్నాడు. మేడాపురం, గుంటికొండ, ఓబులాపురం, నాగసముద్రం, దామాజిపల్లి – ఈ యేరియాకు పోదాం అన్నాడు. అక్కడ మమ్మల్ని మాట్లాడించేనాథుడు  లేడు. పళ్ళెం శ్రీనివాసులు రెండుసైకెండ్లు తీయించినా డు. మొట్టమొదట  మేడాపురంలో మీటింగు పెట్టినాం. నేను పాట పాడితే  వూరంతా వచ్చింది. మహాసభ గురించి మాట్లాడి నాం. ఎనిమిది గంటలకు తిరిగి బయలుదేరినాము . అక్కడ ఒక సత్యాగ్రాహి ఉన్నాడు. విశ్వనాథం అని ఆయన పేరు. మా  వయస్సు వాడే.  ఆయన కనుక్కున్నాడు మమ్ముల . మా యందర్నీ కలిపే పత్రిక యేది  అంటే సాధన. పప్పూరు రామాచార్యుల సంపాద కత్వాన వచ్చేది.  జాతీయోద్యమంలో  పాల్గొనేవాళ్లు  ఏ మూల వున్నా వారి పేర్లు  ఆ పత్రికలో వచ్చేవి. మేం  జైళ్లో వున్నాము  కదా.  మా పేర్లు ఆ పత్రికలో వచ్చేవి. ఆయన తనను పరిచయం చేసుకొని భోంచేసే పోవల్ల అన్నా డు. అక్కడి నుంచి దామాజిపల్లి, నాగసముద్రం మొదలైన పల్లెలకు పోయినాం.
               అట్లా కొత్త ప్రాంతాలకే పోదాం అంటాడు వికె. ప్రజలపట్ల మంచి విశ్వాసం వికె గారికి.  కార్యక్రమాన్ని పవిత్రంగా భావించేవాడు.  ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే  నెరవేరుద్దాం అంటాడు. కొత్త అయితేనేం మనం పాటలు పాడితే ప్రజలు వస్తారు. మీటింగు పెడతాం. ఎవరో ఒకరు అన్నం పెడతారు సంజీవులూ! అంటాడు. అంత విశ్వాసం ప్రజల పట్ల,ప్రజా కార్య క్రమాల పట్ల. జనం అంటే పడిచస్తాడు.     
               పాముదుర్తి కల్లా పోదాం అంటాడు వికె. ఆ పాముదుర్తి రెడ్లతో కష్టం.  అసలు బ్రిటీషు ప్రభుత్వమే వాళ్ళను జిల్లా విడిచి పొమ్మని ఉత్తర్వులు జారీ చేసింది. వికె కు నేను ఒక షరతు పెట్టినాను. పాముదుర్తి యేరియాకు పోదామంటు న్నావ్. నే నొస్తాను. కానీ అక్కడ మాత్రం రెడ్లను గురించి నీవు పేరెత్తకూడదు. బయపరెడ్డి యిట్ల, యింకో రెడ్డి యిట్లా అంటే నేను మాత్రం  రాను. అట్ల నువ్వు ఉంటానంటేనే నేను యెల్లబారుతా  అనే షరతుపై బయలుదేరినాము. నాకు భయమెక్కువ. వికె గారికి ధైర్య మెక్కువ. పాముదుర్తి రెడ్లు, తరిమెల రెడ్లు, చీమలవాగుపల్లె రెడ్లు  రక్తబంధువులు. పాముదుర్తి వారికి వికె గారెవరో తెలుసు. చీమలవాగుపల్లె రైతు  ‘ధనిక రైతు, నిజాయితీ రైతు, బాగా కష్టపడి పని చేసే కుటుంబం’ అని తెలుసు.  కానీ వికె. మానవ సంబంధాలను ప్రజా సమస్యల దృక్పథంతో  చూస్తాడు తప్ప, బంధుత్వాల వరసలతో కాదు. మాట్లాడుతా మాట్లాడుతా తిట్టిన తిట్టు తిట్టకుండా రెడ్లను తిట్టి పారేస.  సభ అంతా నిశ్శబ్దం. మీటింగు తరువాత భోంచేసి  పొమ్మని మనుషులతో చెప్పంపినా డు బయపరెడ్డి. మేము పో లేదు.  మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. అగ్రహారం లో తినల్లని. అగ్రహారంలో బ్రాహ్మణులు వున్నారు. సూర్యనారాయణ, నరసింహారావు వున్నారు.  వీళ్ళు ఎప్పుడూ  రెడ్లకు వ్యతిరేకం. రాత్రి అగ్రహారంలోనే వుండి, పొద్దు న్నే గూనిపల్లి, సిద్దరాంపురం వచ్చినాము.  
               పాముదుర్తి అంటేనే సదాశివన్ గారు గుర్తుకొస్తారు నాకు.  1937 జిల్లాబోర్డు ఎన్నికలలో కల్లూరు సుబ్బారావు గారు నిలబడినారు.  ప్రత్యర్థి పాముదుర్తి రెడ్డి.  కల్లూరు సుబ్బారావు అంటే కాంగ్రెసు తరఫున ప్రచారం చేయడానికి సదాశివన్ గారు పాముదుర్తికి వచ్చినారు. మీటింగు పెట్టి బాగా వాయించినాడు.  రెడ్డి మనుషులు సదాశివన్ పై దుమ్మెత్తిపోసినారు. కండ్లలో పడిన దుమ్ము తుడుసుకొని సత్రంలో పడుకున్నారు సదాశివన్ గారు.  పొద్దున్న లేచి చూస్తే తలపాటున పెట్టుకున్న సంచి లేదు. నేరుగా రెడ్డింటికి పోయినాడు. నా సంచి పోయింది. మీరు చెబితే సంచి వస్తుంది అన్నాడు. “ ఎవరో పిల్లనాయల బాగొచ్చినావు!  వచ్చి తిట్టింది కాక, సంచి పోయిందని నా మీదకే వచ్చినవా?” అన్నాడు రెడ్డి. “ లేదండి రెడ్డిగారూ! మీరు చెప్పితే సంచి వస్తుంది.మీ వూర్లో మీకు తెలీ కుండా యా దొంగ వుంటాడు? తెప్పించండి.” అన్నాడు.  “నాకు సాధ్యం కాదు” అన్నాడు రెడ్డి. సరే ఏమన్నా చేసుకో! మా గాంధీ గారు చెప్పినట్లు సత్యాగ్రహం చేస్తాను” అని  వాకిట్లో  కూర్చున్నాడు. పది నిముషాల్లో బ్యాగ్ వచ్చింది. అట్లా జరుగు తుందేమో నని భయం. పిల్లోన్ని ఈదలాడేకి బాయిలోకి దిగమంటే దిగను దిగను, భయం భయం అంటాడు. ఈత నేర్పించేవాడు మునగబెండ్లు కట్టి దిగొద్దులే దిగొద్దులే అంటూనే  బాయిలోకి నూకుతాడు. పిల్లోడు రెండు అరుపులు అరిచి, రెండు మునక లు మునిగి తరువాత నిర్భయంగా ఈదలాడుతాడు. అట్లా ఈ సంఘటనతో నా భయాన్ని పోగొట్టినాడు వికె.  ఆయన ప్రత్యేకత  ఏమంటే  ఆ రెడ్ల సంగతేమిటో చూద్దాం! ఆ దౌర్జన్యపరుల సంగతేమిటో చూద్దాం !అంటాడు. అట్లా చోటికే  డ్యూటీ వేసుకుంటాడు. సులభంగా  వుండేచోటికి  పోడు.  ఆయనలో వుండే గొప్పతనమే అది. కొత్త ప్రాంతాలకే పోదాం, పెద్ద వాండ్లనే  ఢీకొడదాం, ప్రజలను చైతన్యం చేద్దాం అంటాడు వికె.  
               ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీని  నిషేధించలేదు గాని, నాయకులందరిపైన అరెస్టు వారంట్లు జారీ అయినాయి. కమ్యూ నిస్టు పార్టీ ఆర్గనైజేషన్ పధ్ధతి కూడా మార్చింది. ఉరవకొండ,కళ్యాణదుర్గం, అనంతపురం,గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, తాలూ కాల నిర్మాణం వికె గారికి అప్పగించబడింది.పెనుగొండ, ధర్మవరం, గ్యాదిగకుంట,కదిరి, బుక్కపట్నం వగైరా ప్రాంతాల నిర్మా ణ బాధ్యత సదాశివన్ గారికి అప్పగించబడింది. 
              వీకే 1948 మార్చిలో మా గ్రామాలకు రహస్యంగా వచ్చేవాడు. ఉప్పరపల్లి రెడ్లకు వ్యతిరేకంగా, దుర్గం భూస్వాము లకు వ్యతిరేకంగా, పూలకుంట, చియ్యేడు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించినాము. జూన్ లో రహస్యస్థావ రం నుండి పరసన్నాయపల్లి నాగిరెడ్డితో ఒక లెటర్ పంపినాడు వీకే. సంపూర్తిగా బయట వుండవద్దని, సెమీ లీగల్ గా వుండ మన్నాడు. డి.నాగిరెడ్డి, సత్తారు, కూరపాటి రాముడు(రామిరెడ్డి), కిష్టప్ప (కృష్ణారెడ్డి)- వీళ్ళంతా బయటే వున్నారు.  వికె.గారి రహస్యస్థావ రం  చియ్యేడు కూడా. చియ్యేడులో వికె,గారి భార్య  పార్వతమ్మ గారి దగ్గర బంధువు ఒకామె వుండేది. ఎవరికీ తెలీదు. ఆమెకు తెలుసు, మా యిద్దరికీ తెలుసు. నా స్థావరం ఎక్కువగా  దుర్గం కొండలు, కృష్ణమరెడ్డి పల్లి.   మా మధ్య కొరి యర్లు వుండేవారు. కొరియర్లు గట్టిగా వుండల్ల. పట్టుకొని కొట్టినా ఏమీ చెప్పకూడదు. చాకల ఓబులేసు ( పూలకుంట), కృష్ణా రెడ్డి(చియ్యేడు) కొరియర్లుగా వుండేవారు.
     వికె. సమయస్ఫూర్తి  చాలా గొప్పది. నేను ఆయనతో కలిసి రాత్రిపూట పూలకుంట నుండి సోదనపల్లెకు పోతాండాము దాదాపు 30 కి.మీ.వుంటుంది. నడుచుకుంటూ పోతున్నాం. దాదాపు రాత్రి 1.30 గం. అయింటాది. చెన్నంపల్లి దగ్గరకు చేరు కున్నాం. చెన్నం పల్లికి  కొండలకింద పోవల్ల. వెన్నెల బాగా వుంది.  దావ వారనే  పెద్దబండ వుంటే దానిమీద ఇద్దరం కూర్చుం టిమి.  అక్కడ దక్షిణాది నుంచి  ఐదు మంది పెద్ద పొట్లి ఎత్తుకొస్తున్నారు. వాళ్ళు మాకు కనపడతా వున్నారు. మేమూ వాళ్లకి కనపడుతూ  వున్నాము. వికె.పంచ ఎగ్గట్టి  ఏదో ఆఫీసరు మాదిరి  వుంటే పోలీసులనుకున్నారు మమ్మల్ని. “ ఎవరు మీరు?” అనిరి. మేము పలకలేదు. పలక్కపోతే రాళ్ళు వేసిరి. నేనేం చేస్తి నంటే ‘వీకే ! పిస్తులు తీ. పైకి కాల్చు’ అంటి. ఊరుకో కాల్చకూ డదు అని, నీ పేరు ప్రకటించుకో, ప్రకటించుకో అనె. అంటే  నేను ఆ యేరియావాన్ని కదా. ఆ సమయస్ఫూర్తి అట్లాంటిది. నేను సంజీవుల్ని, కమ్యూనిస్టును  అంటి. ఆ ఐదుమందిలో ఎవడో ఒకడు మా వాడున్నాడు. వడ్డేవాడు. “ నువ్వు కమ్యూనిస్టువి కదా! మావాడివి కదా! అని కులం పేరుతొ పిలిచినాడు.  అవునర్రా! యిట్లా  రా! అంటి. అప్పుడు వారొచ్చి పరిచయం చేసుకుండ్రి. అంత సమయస్ఫూర్తి ఆయనిది. ఎందుకు చెప్తున్నానంటే ఎంత వ్యతిరేక పరిస్థితుల లోనూ, అత్యవసర పరిస్థితులలోను గాబరా పడకుండా బెదిరి పోకుండా తెలివితేటలు ఎట్లా ప్రయోగిస్తాడో అనేది చెప్తున్నా. పిస్టలు కాల్చడం తప్పు. పిస్టలు కాల్చితే ఈయేరి యాలో కమ్యూనిస్టులు తిరుగుతూ వున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. అందువల్ల నీ పేరు ప్రకటించుకో అన్నాడు. ఎందుకంటే నేను ఈ యేరియావాన్ని. అందరికి తెలుసు. గొప్ప విపత్తులో సమయస్ఫూర్తికి వీకే పెట్టింది పేరు. 
            నేను జైలుకు పోయినపుడు నా  కుటుంబాన్ని గడ్డకేసింది వీకేనే. కామ్రేడ్ ఫణిభూషణ్ తో( తరిమెల కామ్రేడ్)  డబ్బు పంపేవాడు. నాకే  కాదు చాల మందికి సహాయ పడినాడు. ఈ విషయాలు తను చెప్పడు. మమ్మలా ప్రచారం చేయొద్దంటాడు.   వికె. నిరంకుశత్వాన్ని  సహించడు. అనంతపురం తాలుకాలో దాదాపు 20 గ్రామాల్లో పెత్తందార్లకు వ్యతిరేకంగా వికె. నాయక త్వాన పోరాటాలు జరిగినాయి. ఐదుమంది కామ్రేడ్స్ చంపబడ్డారు. పెద్దపోరాటాలు సాగిచ్చినాము. జయప్రదం అయినాము. నా వాడు, తనవాడు అనే తత్త్వం వీకే కు లేదు.1967-77 వరకు అనంతపురం తాలుకాలో పెత్తందార్ల వ్యతిరేక పోరాటాలు చేసినాం. తోపుదుర్తి, పూలకుంట, చియ్యేడు, కృష్ణమరెడ్డిపల్లి, కందుకూరు, జంబులదిన్నె, ముంటిమడుగు, తరిమెల, కురు గుంట – యిలా దాదాపు 18 గ్రామాల్లో భుస్వామిక వ్యతిరేక పోరాటాలు చేసి, అక్కడి ప్రజలకు ప్రజాస్వామిక హక్కు కల్పిం చడంలో – రక్తపాతం జరిగినా – విజయం సాధించినాం. అందులో వికె.గారు రాత్రింబవళ్ళు పని చేసినాడు. శత్రువు మీద పడతాడు, బాంబులేస్తాడు అన్నా ఊర్లోకి పోకుండా పోయింది లేదు. ఊరిపక్క చేండ్లలో సమావేశాలు జరిపేవారం. వాళ్లకు మంచి చెడ్డలు చెప్తూ పోరాట పటిమలు నేర్పినాము. మొత్తం మీద పేదవాళ్ళ పోరాటాలన్నీ జయప్రదం అయినాయి  
              పార్టీ చీలిక తరువాత వికె.గారు పెద్ద బాధ్యత మోసుకున్నారు. మొత్తం జిల్లా అంతటా పార్టీ ఎక్కువ భాగం నాగిరెడ్డి వెంట, CPM వెంట పోయింది. నాగిరెడ్డి గారు  నాతో చర్చించినారు. నేను CPI లోనే కొనసాగుతానన్నాను. అనంతపురం తాలుకాలో పూలకుంట, కృష్ణమరెడ్డిపల్లి, చియ్యేడులో సగం, కక్కలపల్లి శాఖ మా వైపున్నాయి. అంతా కొట్టుకపోయారు. “వికె, సదాశివన్ తప్ప ఎవరున్నారప్పా మీకు?” అని మమ్మల్ని  తక్కువచేసి  మాట్లాడేవారు. ‘సైన్యం మా కల్లా. నాయకత్వం మీ కల్లా”  అనేవారు CPM వారు. ఆ పరిస్థితులలో నిలబడటం, పార్టీని నిలబెట్టడం అంత సులభం కాదు. వికె. మేరుపర్వ తం లాగా నిలబడినాడు కమ్యూనిస్టుపార్టీకి. 
             సోదనపల్లె, జంబులదిన్నె, తరిమెల – వీళ్ళంతా దగ్గర బంధువులు వీకే కు. దగ్గర బందువైనా సహించేవాడు  కాదు వికె.  ఆయనలో గొప్పతనం ఏమిటంటే మనలాంటి వాళ్ళు పోతే ఆయనే కుర్చీలు వేసేవాడు. కాఫీలు తెచ్చిచ్చేవాడు. ఎమర్జన్సీ పీరియడ్ లో బొందలేడు  భూస్వాములతో పెద్ద పోరాటం చేస్తున్నాం. ప్రామిసరీ నోట్లు అన్నీ తెప్పించి చించి వేయించినాం. ఆ పోరాటంలో సదాశివన్ గారు, నేనూ ఎక్కువగా కనపడ్డాము. నేను ఒకసారి పోతే భూస్వాములు గుర్తించలేదు. మాకు సదాశి వన్ గారున్నారు, వీకే గారున్నారు. నీ మాట వినెల్లేదు అన్నారు. ఆ భూస్వాములు ఏడెనిమిది మంది జీపులేసుకొని వీకే దగ్గరకు వచ్చినారు. నేను పోయేవరకూ సమావేశం మొదలు పెట్టలేదు వికె.  నేను పోగానే  నాకోసం  కుర్చీ తీసుకొచ్చి వాళ్ళ మధ్య వేసినాడు వికె. వాళ్ళు నన్ను గుర్తించల్ల కదా!
                  వికె.  ప్రజాస్వామిక వాది. శత్రువును ఉద్యమాల ద్వారా  దెబ్బతీయాలనే చూస్తాడు. రహస్య రోజుల్లో అంతే, బయటి రోజుల్లో అంతే.  కేవలం మనకు అపాయమైనపుడు వాని పీడ వదలించుకుంటాం గాని, ఉద్దేశ్యపూర్వకంగా మనం  హింసావాదులం  కాకూడదు అనేవాడు.  తాడిపత్రిలో  దివాకర రెడ్డికి వ్యతిరేకంగా చేసిన పోరాటం  చాల  గొప్పది.  నా అను భవంలో  రాయలసీమలో అంతమంచి పోరాటం జరగలేదు. ప్రజాస్వామ్యం  కోసం  పోరాటం.  అన్ని శక్తుల్ని కలుపుకొని కర 
పత్రాలు,వాల్ పోస్టర్లతోనే పోరాటం. అంతే కాని ఒక బాంబు వేయలేదు మనం.  అనంతపురం నుండి ఢిల్లీ దాకా వాల్ పోస్టర్ల ప్రచారంతోనే మనం ఆయన్ను ఓడించినాం. పి.వి. నరసింహారావుగారు ప్రధానమంత్రిగా వున్నపుడు, విజయభాస్కర రెడ్డిగారు ముఖ్యమంత్రిగా వున్నపుడు  అనంతపురంలోనే ఎక్కడో కలిసినారు వీళ్ళు. “ తాడిపత్రిలో, ధర్మవరంలో , పెనుగొండలో ప్రభు త్వం ఉందా?” అని  అడిగినాడు వికె గారు విజయభాస్కరరెడ్డి గారిని.  దానికి ఏమి సమాధానం చెప్తాడో అని విజయభాస్కర రెడ్డిగారిని చూస్తున్నారు పి.వి. గారు. దానికి విజయభాస్కరరెడ్డి గారు ఏమీ సమాధానం చెప్పలేక పోయినారు. ఈ దెబ్బతోనే దివాకరరెడ్డిగారిని మంత్రిపదవి నుండి తీసేసిరి. నిజంగా ప్రజాస్వామిక ఉద్యమమంటే అదే ఉద్యమం. అన్ని పార్టీలను, తెలుగు దేశం వారిని, యింకా కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులన్నిటిని  కలుపుకున్నాడు. ఎవర్నీ కూడా  నువ్వు రావద్దు అని చెప్పలేదు విజయం సాధించినాము.   
                  తెలంగాణా సాయుధపోరాట కాలంలో ఆయుధాల కోసం రాష్ట్ర పార్టీ పిలుపిచ్చింది. ఆస్తులమ్మి యివ్వండి అని. అప్పటికప్పుడు  వికె.గారు 40 ఎకరాలు అమ్మి పార్టీకి యిచ్చినాడు.నేను కూడా ఉడతకు ఉడతా భక్తిగా నా పెండ్లాం కమ్మలు తీసి యిచ్చినాను. ఉద్యమం జయప్రదం కావాలని ఆ పని చేసినాను. ‘ ఆ దరిద్రునికి యివన్నా వద్దా?’ అని తరిమెల నాగిరెడ్డి గారు కమ్మలు వాపసు పంపినాడు.
             పార్టీ కార్యకర్తలపట్ల  అయన చాల జాగ్రత్తగా, ఆప్యాయంగా  వుంటాడు. కార్యకర్త చెప్పేది చాల ఓర్పుగా వింటాడు.  కార్యకర్తల్ని  కసురుకోడు. నడవడిక సవరణ విషయంలో కార్యకర్తకు ఏమన్నా చెప్పాల్సి వస్తే అతని సన్నిహితులతో చెప్పిస్తాడు కార్యకర్తను వదలుకోడు. మరీ మితిమీరితే తీసేసేదాంట్లో మొట్టమొదటివాడు ఆయనే.  క్రమశిక్షణ విషయంలో ఎవరినీ లెక్క పెట్టడు. 
                   వికె.కు చట్టపరంగా పదెకరాల భూమి ప్రభుత్వం నుండి పొందవచ్చు. ‘భూమి యాడన్నా చూడు. పార్టీకి యిద్దాం సంజీవులూ!’ అన్నాడు. మన్నీల దగ్గర చూసినాను. అప్పటి ధరలో రెండు లక్షలు వస్తుంది.  అప్లికేషను MROకు యిచ్చినాను కూడా.  కాని, వికె. నే నన్ను పిలిచి ‘ ఎందుకులే సంజీవులూ! కమ్యూనిస్టుపార్టీకేమో లాభమే. కాని ఆ భూములు పోగొట్టుకొన్న వాళ్ళు తిట్టుకుంటారు ఈ వికె మా భూములు లాక్కున్నాడని. యాడన్నా వసూలు చేసి పార్టీ కిద్దాం లే!’అన్నాడు.
                మేము 1942 నుండి ఈ యేరియాలో కలసిమెలసి పనిచేసినాం. చాలా ఆత్మీయులం.1942నుండి నే నెట్లా మెలి గిండేది అంతా  ఆయనకు తెలుసు.  ఆయన సహవాసం లేకుండా నేను కమ్యూనిస్టు నాయకుడిని అయిండే వాణ్ని కాదు. నన్ను ప్రోత్సహించింది వీకే నే. నేను యింతవరకూ పార్టీలో వున్నానంటే వికే వల్లనే. 
            యింక   సదాశివన్ గారి పేరు తలచుకోవాలంటే మన తనువు,మనసు పరిశుభ్రంగా వుండాలి. అప్పుడే ఆయన పేరు ఎత్తడానికి మనకు అర్హత వున్నట్లు. అనంతపురం జిల్లాలో తొలి కమ్యూనిస్టు సదాశివన్ గారే. శివాయిజమా పోరాటాలకు ఆద్యుడు ఆయనే. హరిజనులకు గొప్ప సేవ చేసినవాడు సదాశివన్ గారే. ఆయనకు తెలిసినన్ని పల్లెలు ఏ కమ్యూనిస్టు కూ తెలీ వు. కార్యకర్తలకే కాదు, వారి కుటుంబాలకు దగ్గరివాడు ఈయన. కార్యకర్తలతో ఇబ్బంది ఏర్పడితే ‘ వుండు నీ కత నాయకుని తో చెప్తా” అని ఆ కార్యకర్తల కుటుంబ స్త్రీలు బెదిరించేవారు. చెప్పిందే చేసేవాడు. విమర్శా ఆత్మ విమర్శా బాగా పాటించేవాడు శుభ్రత పాటించేవాడు. పాటింపజేసేవాడు. ఈయన MLC గావున్నప్పుడు ‘ మీ నాయకుడు అసెంబ్లీలో మేము చెవుల్లో దూది కూరుకున్నా  ‘కరువు, కరువు’ అని ఆయన అరిచే అరుపులు గుయ్ మని వినపడతాయి.’ అని చెప్పేవాడు గుఱ్ఱంవెంకన్న.  పుస్తకాలు బాగా చదివేవాడు. ఇంటికి పోయినవారికి ఆ విషయాలు వివరించేవాడు. కార్యకర్త స్థాయినిబట్టి చెప్పడమో, వివరిం చడమో, వ్యాఖ్యానించడమో , చర్చించడమో చేసేవాడు. పుస్తకాలు ఇచ్చి చదవమనే వాడు. తీసుకపోయిన పుస్తకాలు ఖచ్చితం గా తిరిగి తనకు చేరాల్సిందే. ఆయనకు భారతం అంటే చాల యిష్టం. శాంతి పర్వం ఆధారంగా వర్గాకలహాల గురించి చర్చిం చేవాడు. ఆంధ్రప్రభలో రోజు భారతం సీరియల్ గా వేసేవారు. దాన్ని దస్తగిరి గారితో చదివించుకొని వినడం చాలా సార్లు చూసినాను.  నిరాడంబరుడు. నిగర్వి. అబద్దాలు,అతిశయోక్తులు చెప్పడు. క్రిందివర్గాలనుండి పార్టీలోకి ఎక్కువ రావాలనే వాడు. నా మొదటి భార్య చనిపోయి మూడు సంవత్సరాలు గడిచినాయి. పిల్లతో కష్టమని సదాశివన్ గారే  రెండో పెళ్ళికి ఒప్పించినాడు. అయన సతీమణి రాజమ్మ గారు గొప్ప త్యాగశీలి. ఉదారం వుంది. ఇద్దరికి పెట్టమంటే నలుగురికి పెడుతుంది. అలాంటిగుణాలు ఉండ బట్టే సదాశివన్ ఇంత నాయకుడు కాగలిగినాడు. మాయట్లా కుటుంబాల ఆడవాళ్ళు పొతే, చక్కగా స్నానాలు చేయించి, తన బట్టలు కట్టబెట్టేది. మా పిల్లలను ఎత్తుకొని అట్లాడిచ్చేది.  ఎప్పుడో వచ్చేదని సినిమా చూపించి పంపేది. ఇంటి సహాయకులుగా హరిజనులనే ఉంచుకోనేది.  గ్రామాలనుండి కార్యకర్తల కుటుంబాలు వైద్యం కోసంవస్తే వారిని ఇంట్లోనే వుంచుకొని, వైద్యం చేయించి తృప్తిగా పంపేది.  సదాశివన్ రాజమ్మ గార్లది అన్న్యోన్న దాంపత్యం, ఆదర్శ జీవితం.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------    

మీకు రెండు విషయాలపై నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వుంది. మొదటిది అనంతపురం కమ్యూనిస్టుఉద్యమాన్ని గ్రంథస్తం చేస్తున్నందుకు , రెండోది 1970 దశకం ప్రారంభంలో కొన్ని కారణాల వల్ల స్తబ్దంగా వున్న నాలో మీరు (దస్తగిరి) అభ్యుదయ రచయితల సంఘం కార్యకలాపాల్లో ఇన్ వాల్వు చేసి  ‘ కమ్యూనిస్టు చురుకు’  కలిగించినందుకు. 
--------------------------------------------------------------------------------------------------------------------------------------------- 
ఆధారం :--  పూలకుంట సంజీవులు గారితో ఇంటర్వ్యూ –  (1) 17 మే 1994 ; (2) 21 నవంబర్ 1997
______దస్తగిరి

జిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం



జిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం
                      __ పిళ్లా విజయ్,9490122229

         ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు 16వ శతాబ్దంలో వసు చరిత్ర రాసిన రామరాజ భూషణుడు కొంతకాలం పెనుకొండలో నివసించినట్లు
చారిత్రక ఆధారాలున్నాయి. వసుచరిత్రలో ఆయన వర్ణించిన కోలాహల పర్వతమే పెనుకొండ అనీ, సుక్తిమతీనదే చిత్రావతి నది అని చెపుతారు.
         17వ శతాబ్దంలో పాఠకులకు ఆసక్తి పెంచే 'శుకసప్తతి' కథా కావ్యాన్ని రాసిన 'పాలవేకరి కదిరీపతి' ఈ జిల్లాలోని కదిరి ప్రాంతంవాడనేందుకు
చారిత్రక ఆధారాలున్నాయి. ఈ కావ్యంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తాయి.    అదే 17వ శతాబ్దంలోనే సమాజంలోని కల్మషాన్ని తన పద్యాలతో కడిగేస్తూ, మంచి చెడ్డలను సమీక్షిస్తూ, ప్రజలలో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ
ప్రజాచైతన్యం రగిలిస్తూ ఆలవెలదులలో పద్యాలను సరళసుబోధకంగా అల్లిన 'ప్రజాకవి వేమన' కదిరి ప్రాంతంలోనే ఉన్నట్లు, గాండ్లపెంట మండలంలోని
కటారుపల్లె గ్రామంలో సమాధి అయినట్లు అనేక చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రాచీన కవుల్లో వేమనది విశిష్ట స్థానం. తన సమకాలీన సామాజిక వ్యవస్థలో వున్న దుర్లక్షణాలను
తీవ్రంగా విమర్శించిన కవి వేమన ఒక్కడే. అస్పృశ్యతను మతఛాందసత్వాన్ని, కర్మ కాండను, మూఢ విశ్వాసాలను, స్త్రీ వ్యామోహం, స్వార్థం, మోసం లాంటి గుణాలను నిస్సంకోచంగా విమర్శించి సామాజిక సంస్కరణకు నడుంకట్టిన కవి వేమన. 'భూమి నాదియన్న ఫక్కున
నవ్వు" అంటూ భూమిపై వున్న వ్యామోహాన్ని తగ్గించు కోవాలన్నాడు. “శ్రమమున బుట్టు సర్వంబు తానౌను" అని శ్రమైక జీవన గౌరవాన్ని వేమన కీర్తించాడు.
        భూస్వామిక సమాజంలో పుట్టి విశేష ఆదరణ పొందిన అవధాన ప్రక్రియ నేటికీ ప్రజాదరణ పొందడం విశేషం. భూస్వామిక భావజాలం ఉన్నచోట వ్యక్తిపూజ, వ్యక్తి ఆరాధన ఉంటుంది. ఇప్పటికీ యువత ఎవరో ఒకరిని కీర్తిస్తూ పూజిస్తూ ఉండడం సహజంగానే ఉంది. భూస్వామిక భావజాలం ఇంకా ప్రజల్లో ప్రబలంగా ఉందనడానికి ఇది నిదర్శనం గా చెప్పవచ్చు. కుంటి మద్ది శ్రీనివాసా
చార్యులు శతావధానం చేసేవారు. కవితానంద వాల్మీకి రామాయణాన్ని రాసిన సోంపల్లి కృష్ణమూర్తి అష్టావధానాలు చేసేవారు. పామురాయిగ్రామానికి చెందిన అల్లసాని రామనాధ కవి కూడా
అష్టావధానంలో దిట్ట. వర్తమాన కాలంలో (2015లో) మడకశిర ప్రభావతి ప్రథమ మహిళా శతాధిక అవధానిగా ప్రసిద్ధి పొందారు. అవధాన ప్రక్రియలో, పద్యరచనలో ఆశావాది ప్రకాశరావు ఎంతో
పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన ప్రథమ దళిత అవధానిగా ప్రసిద్ధుడు. 
        ఆధ్యాత్మిక విషయాలపై రాసిన వారిలో ఎల్లమరాజు నారాయణ భట్టు, పెనకల పాటి కాగలూరు రుద్రకవి, వేదాంతం లక్ష్మయ్య, రాప్తాటి ఓబిరెడ్డి, మరూరు లక్ష్మీనరసప్ప, మొదలైన వారున్నారు. చిత్రకవిత్వ ప్రక్రియలో కవితా చిత్రములతో 'నిర్యోష్టశతకం' కావ్యాన్ని రాప్తాటి ఓబిరెడ్డి రచించారు. శివతాండవం తదితర గ్రంథాలను రాసి సరస్వతీ పుత్రుడనే బిరుదును
పొందిన పుట్టపర్తి సత్యనారాయణచార్యులు కడపలోనే ఎక్కువగా నివసించినాజన్మస్థలం మాత్రం అనంతపురము జిల్లానే. రాయదుర్గంలోని గుమ్మగుట్ట మండలానికి చెందిన కలుగోడు అశ్వరరావు 'అశ్వర్థ భారతం' రాశారు. కుంటిమద్ది
శేషశర్మ మనుచరిత్రను సంస్కృతంలోకి అనువదించారు. రత్నాకర బాలరాజు
'బౌద్ధయుగం' అనే గ్రంథాన్ని రచించారు. డాక్టర్ సర్వేపల్లి రాసిన బ్రహ్మసూత్రాలుపుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. సి.వి.రామారావు, వి. భీమారావు పెర్ల్ బక్ రాసిన ' గుడ్ ఎర్త్' గ్రంథాన్ని సుక్షేత్రం పేరుతో తెలుగులోకి అనువదించారు. తలమర్ల కళానిధి 'దక్షిణేశ్వరభాగవతం' లాంటి అనేక పద్యకావ్యాలు రచించారు.

అనంతపురం జిల్లాలో సాహిత్య వికాసం



    
                                     
        “క్షామములెన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞానమృత దృష్టికిన్ కొరతనందని రాయలసీమ లోపలన్” అని డాక్టర్ నండూరి కృష్ణమాచార్యులు చెప్పినట్లు రాయలసీమలోని అనంతపురము జిల్లాలో ప్రాచీన కాలంనుండి నేటి వరకు సాహిత్య వికాసం నిరంతరాయంగా ఫరిడ విల్లుతోంది.
        ప్రాచీన సాహిత్యాన్ని మినహాయిస్తే, ఆధునిక సాహిత్యమంతా సంక్షోభ సమాజ ప్రతిబింబమే. కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న జీవితాన్ని, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ క్రీనిడల్ని సాహిత్యం ఆవిష్కరిస్తోంది.
        సాహిత్యానికి, ఆర్థిక సామాజిక పరిస్థితులకు,
రాజకీయ పరిస్థితులకు పరస్పర సంబంధముంది. కాలానుగుణంగా సాహిత్యంలో రూపం మారినట్లే,
వస్తువూ మారుతూవస్తోంది. కాకపోతే జిల్లాలో ఉన్న నైసర్గిక స్వభావం వల్ల ఇక్కడ కరువు తాండ వించడం, దానికి తోడు పాలకవర్గాల నిర్లక్ష్యం, ప్రజల అమాయకత్వం వెరసి సాహిత్యంలో వ్యదార్థ జీవన దృశ్యం అణుమాత్రం కూడా మారలేదు. అయితే జిల్లా రాజకీయ పరిణామాల వల్ల, ప్రజా ఉద్యమాల వల్ల, సాహిత్య కారుల్లో సామాజిక చైతన్యం విస్తృతమైంది. ప్రజా జీవితాన్ని కాకుండా
నేలవిడిచి సాముచేసే సాహిత్యం ఇక్కడకనిపించదు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ప్రభావం సాహిత్యకారు లపై, సాహిత్య విమర్శకులపై ప్రబలంగా ఉండటం వల్ల అనంతపురము జిల్లా సాహిత్యం తెలుగు సాహితీయవనికపై తనదైన ముద్రను వేసుకొంది.
        వ్యవస్థను ప్రశ్నించడం, ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల పాఠకులు తాననుభవిస్తున్న స్థితికి లోనై కళ్ళు చెమర్చుతారు. అదే సందర్భంలో
సాహిత్య కారులకు ప్రత్యామ్నాయ పరిష్కారం లభించక పోవడం వల్ల, పరిష్కారమార్గాలను సరిగా సూచించలేక పోతున్నారు. దాంతో పాఠకులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. సాహిత్యకారులు ఎవరైతే ప్రజా జీవితాన్ని కేవలం వీక్షించకుండా పూర్తిగా తొంగిచూస్తున్నారో వారుప్రత్యమ్నాయాలను అన్వేషించ గలుగుతున్నారు.
        ఏది ఏమైనప్పటికీ ఇక్కడ భూస్వామిక సమాజ వాసన ఇంకా వేళ్ళూనుకొని వుండటం వల్ల ఇప్పటికీ అవధానం పట్ల ప్రజల్లో భ్రమలు బాగా ఉన్నాయి. అవధానాన్ని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ' దొమ్మరోల్ల ఆట' గా అభివర్ణించాడు. వ్యక్తి ఆరాధన విపరీతంగా ఉంది. మూఢ విశ్వాసాలు రాజ్యమేలు తున్నాయి. సామాజిక సంఘర్షణ కన్నా సర్దుబాటు ధోరణులే ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావం సాహిత్య కారులపై స్పష్టంగా ఉంది.
       సాహిత్యకారుల రచనల్లో ఉన్న స్పష్టత , వాస్తవ జీవితంలో  కొరవడడానికి ఇదే కారణం. అంటేనిబద్దత లేకపోవడం ఒక బలహీనతగా చెప్పవచ్చు.

___పిళ్లా కుమారస్వామి


Friday, September 11, 2020

మూఢ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్న రాయదుర్గం






          రాయదుర్గం పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా
పదేళ్ల బాలికతో వెంకటరమణుని కళ్యాణం నిర్వహించారు.
         రాయదుర్గం పట్టణంలోని పద్మశాలిసామాజిక వర్గం ఆరవ వంశానికి చెందిన శివ 10ఏళ్ల కుమార్తె లలితకళ  అనే బాలికను పెళ్లి కూతురుని చేసి
మేళతాళాలు భజంత్రీలతో భక్తమార్కండేయస్వామి ఆలయం నుంచి కోటలో ప్రసన్నవెంకటరమణస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.  
        ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
కళ్యాణ వేదిక పై స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి
ఎదురుగా పెళ్లికూతురు లలితకళ పద్మావతిని కూర్చోబెట్టి సంప్రదాయ బద్ధంగా వెంకటరమణ స్వామి కళ్యాణం జరిపించారు. పురోహితులు మంగళసూత్రాన్ని పద్మావతి ఉత్సవమూర్తి మెడకు తాకించి ఉప్పు పెళ్లి కుమార్తె మెడలో ఆమె తల్లి రేఖ మంగళ సూత్రం కట్టారు.
          దేవాదాయశాఖ సమూహ దేవాలయం
కార్యానిర్వహణాధికారి కె. శ్రీనివాసులు, మునిసిపల్
కమిషనర్ రామచంద్రారావు సమక్షంలో పెళ్లి తంతు
జరిగింది. రాయదుర్గం మాజీ శాసన సభ్యులు మెట్టు
గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం
పురపాలక సంఘ అధ్యక్షులు గొని ఉపేంద్రరెడ్డి
మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటేశులు, మునిసిపల్ వార్డు సభ్యులు భారతి, ప్రశాంతి, సుమలత అనేకమంది పట్టణ ప్రజల సమక్షంలో ఈ కళ్యాణం  జరిగింది. బాలికతోబాల్య వివాహం జరపడం నేరం. చట్టవిరుద్ధమని ప్రభుత్వం చెబుతోంది.
రాయదుర్గంలో దేవాలయ శాఖ ఆధ్వర్యంలోని వెంకట మరణస్వామి ఆలయంలో 40ఏళ్లుగా బాలికతో వెంకటరమణుని కళ్యాణం జరుగుతోంది.
రాయదుర్గంలో కూడా 1978వ సంవత్సరానికి ముందు లేదు. ఇది అశాస్త్రీయం, సాంప్రదాయ విరుద్ధమని తెలిసినా అధికారికంగా గత నాలుగు దశాబ్దాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ విషయమై రాయదుర్గం హెరిటేజ్ అసోషియేషన్ అధ్యక్షులు, రాయదుర్గం చరిత్ర గ్రంధ రచయిత హులికుంటు మూర్తి వెంకటేశ్వరునిబ్రహ్మోత్సవాలకు సంబంధించిన పాత రికార్డులను వెలికి తీశారు. 1978వ సంవత్సరానికి ముందు బాలికతో
వెంకటేశ్వరుని పెళ్లి జరిపిన దాఖలాలు లేవన్నారు. ఈ సంప్రదాయం విడనాడాలని తాము గత కొన్ని
సంవత్సరాలుగా దేవాదాయశాఖ  అధికారులకు
తెలుపుతూ వస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు, ముందు దేవాదాయ
కార్యానిర్వహణాధికారి, ఉన్నతాధికారులకు వినతి
పత్రాన్ని పంపగా బ్రహ్మోత్సవాల నిర్వహణ పై గత నెల 28న ఆలయంలో కార్యానిర్వహణాధికారి ఆద్వర్యంలో సమావేశం జరిపారు. హుళికుంటు మూర్తి మినహా తక్కిన వారు మూఢ విశ్వాసంతో కళ్యాణం జరిపించాలని కోరారు.

(ప్రజాశక్తి ,మంగళవారం 21 మే 2019)

Tuesday, September 8, 2020

దేశంలో ఒకే ఒక పశుపతి నాథుని‌ ఆలయం_ రాయదుర్గం లో



           మన దేశంలో శివాలయాలకు కొరత లేదు. అయితే ఒకే ఒక పశుపతి నాథుని‌ ఆలయం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని లింగాలబండపై ఉంది.మరొకటి నేపాల్ లో ఉంది.
        రాయదుర్గం - బళ్లారి రోడ్డు మార్గానికితూర్పున, పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో లింగాలబండ ఉంది. సుమారు 200 అడుగుల ఎత్తైన అతి పెద్ద బండపై పశుపతి ఆలయం ఉంది. 
సామాన్యంగా శివాలయాల్లో శివుడి లింగానికి ఎదురుగా కొద్ది దూరంలో శివుడి వాహనం నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడి మూలవిరాట్ విభిన్నమైనది, విశిష్టమైనది. 
          ఒకే రాతిపై మధ్య లింగం, నాల్గువైపులా నాలుగు నంది శిల్పాలు ఉండి అవి నాలుగు దిక్కులను చూస్తుంటాయి.  ఇది దేశంలో శైవమత సిద్ధాంతం ఆచరణలో ఒక విలక్షణ ప్రయోగంగా భావించవచ్చు.ఈశాన్య దిక్కున చూస్తున్నట్టుండే శివున్ని చతుర్ముఖుడు , పంచముఖండంటారు. భారత దేశంలో గల ఏకైక పశుపతి నాథుని 
ఆలయం ఇది. ఆలయ ద్వారానికి ఇరువైపులా శంకరాచార్యులుమరియు ఆయన శిశ్యుని చిత్రాలు ఉన్నాయి.శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెపుతారు. అయితే ఆలయ ఆవరణలో నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి శాసనాలు, ఆధారాలు లేవు. కర్ణాటక రాష్ట్రంలోని 'చింతిని' వద్ద గల విరకణత మఠంలో ఈ ఆలయానికి సంబంధించినసమాచారం ఉందని స్థానికులు చెపుతారు.
          ఆలయ నిర్మాణ శైలిని బట్టి క్రీ.శ 8-11
శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన
నోళంబ పల్లవ రాజులు దీన్ని నిర్మించియుండవచ్చు. వీరుశైవులు, శివభక్తులు. వీరి కాలంలో పశుపతిని పూజించే  శైవ మతం బహుళ ప్రచారంలో ఉండేది. కాలముఖ శైవులు, ఆచార్యులు ఉండేవారు. అప్పటికే రాయదుర్గం ప్రాంతంలో బౌద్ధ మరియు జైన మత ప్రభావం అధికంగా ఉండేది. ఇక్కడికి సమీపంలో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం సిద్ధాపుర గ్రామం వద్ద గల బ్రహ్మగిరికొండ వద్ద బౌద్ద మత
ప్రచారంలో భాగంగా ఆశోక చక్రవర్తి శాసనాలు
వేయించాడు.
          1984 సంవత్సరంలో లింగా లబండ పక్కన ఉన్న గట్టి మల్లప్ప కొండపై పశువుల కాపరికి మట్టి ముంతలో సుమారు 300 బంగారు నాణేలు దొరికాయి. లింగాల బండలో మూల విరాట్ అడుగు
భాగాన నిధులున్నాయని రెండు, మూడుసార్లు
దుండుగులు పశుపతి విగ్రహాన్ని పక్కకు జరిపి
తవ్వకాలు జరిపారు. పార్వతి, కాళీమాత
విగ్రహాలు ధ్వంసం చేశారు. విశిష్టమైన,
అరుదైన పశుపతి నాథుని ఆలయం గురించి
కేంద్ర రాష్ట్ర పురావస్తుశాఖ ఎటువంటి రక్షణ
చర్యలు తీసుకోక పోవడం విచారకరం.
కొండకు సమీపంలోని చదం గ్రామస్తులే
ఆలయ పోషణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అభివృద్ధి పనులు చేపట్టారు. పురావస్తు
శాస్త్రవేత్తల సూచనలు పాటించక శాస్త్రీయత
లోపించడంతో పూర్వం నిర్మించబడిన
ప్రాకారపు నలుదిక్కుల గల నంది మరియు
గోపుర కలశ భాగం నిర్మాణంలో ఆధునికత
చోటు చేసుకుంది. ఆలయ గోడలకు గల
శంకరచార్యుల చిత్రాలకు శాస్త్రీయ పద్ధతిలో
పెయింట్ చేయక పోవడంలో వాస్తవికత
కనుమరుగవుతోంది. ఆలయ ఆవరణ అంతటా
అడుగు భాగం బండపై సిమెంట్ ప్లాస్టరింగ్
చేయడానికి శివలింగం ఉన్న గుళ్లు
మూసుకుపోయాయి. ఆధునిక నిర్మాణాల వల్ల
ప్రాచీన చారిత్రక విలువలు, శిల్పాలు, చిత్రాలు
కనుమరుగవుతున్నాయి. ఆలయ ధ్వజస్తంభం
వద్ద నీటి ట్యాంకు ఏర్పాటు చేయడం వల్ల
ఆలయ సహజ సౌందర్యం కనుమరుగైంది.
ఆలయ అభివృద్ధిలో పురావస్తు జీర్ణోద్ధారణ,
శాస్త్రీయ పద్ధతులు పాటించక పోవడం వల్ల
విశిష్టమైన పశుపతినాథుని ఆలయం తన
పురావస్తు, చారిత్రక విలువలను కోల్పోతోంది.
            పశుపతినాధునిఆలయ సందర్శనకు తగిన రోడ్డు మార్గం లేదు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో విశేషపూజలు జరుగుతాయి. గత ఏడాది గర్భగుడికి నూతన గోపుర కలశం
ఏర్పాటుచేశారు. భారత ప్రధాని నరేంద్రమోడీ
నేపాల్ పర్యటనలో భాట్మండులోని పశు
పతినాథుని ఆలయాన్ని దర్శించినప్పుడు మన
దేశంలో కూడా రాయదుర్గం వద్ద ఏకైక పశుపతి
నాథుని ఆలయం ఉందని తెలుసుకుని
ఆశ్చర్యపోయారట. తాను ఆ ఆలయాన్ని
సందర్శించాలని ఉందని కోరికను ఆయన వ్యక్త
పరిచారని చెబుతారు. దేశంలో అరుదైన ఏకైక
పశుపతి నాథుని ఆలయాన్ని శాస్త్రీయ పద్ధతిలో
అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర
పురావస్తు శాఖలపై ఉంది. దీనిని పర్యాటక
దర్శనీయ క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం
దేవాదాయ, పర్యాటక శాఖలపై ఉంది.

అభివృద్ధికి నోచని రాయదుర్గం రైల్వే స్టేషన్‌


           అనంతపురం జిల్లా సరిహద్దున గల రాయదుర్గం రైల్వే స్టేషన్‌ కు 115 సంవత్సరాల చరిత్ర వుంది. కరువు ప్రాంతాల అభివృద్ధి, ఇనిజ వనరులు,వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ దృష్యా ఆంగ్లేయులు 1905 సంవత్సరంలో బళ్లారి, రాయదుర్గం నడుము మీటర్ గేజ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. అప్పుడు నిర్మించిన స్టేషన్ భవనం నేటికి చెక్కు చెదరలేదు. 130 సంవత్సరాల
క్రితం బర్మింగ్ హామ్ (ఇంగ్లాండ్)లో తయారైన సరుకులు తూచే యంత్రం నేటికి పనిచేస్తుంది. బళ్లారి రాయదుర్గం నడుమ తిరిగే ప్యాసింజర్ రైలు లాభదాయకంగా లేదని 1980 సంవత్సరంలో నిలిపి వేశారు. రైలు పట్టాలను తొలగించాలని రైల్వే బోర్డు నిర్ణయిస్తే స్థానికులు ఆందోళన చేపట్టారు. 1982 సంవత్సరంలో అప్పటి రైల్వే శాఖ సహాయ మంత్రి జాఫర్ షరీఫ్ పుణ్యాన‌రాయదుర్గం-చిత్రదుర్గం నడుమ కొత్త రైలు మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిత్రదుర్గం నుంచి చెల్లెకెర వరకు మీటర్ గేజ్ మార్గం ఏర్పాటు కాగా రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు యూనిగేజ్ విధానం వల్ల
మొత్తం రైలు మార్గం బ్రాడ్ గేజ్ గా రూపాంతరం చెందింది.
      1993-94లో నిర్మాణం పూర్తికాగా బెంగుళూరు -
హోస్పెట్, చిక్క జాజూరు-గుంతకల్లు నడుమ రాయదుర్గం మీదుగా రెండు ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టారు. 2011 సంవత్సరం అక్టోబర్ లో రాయదుర్గం నుంచి కర్నాటక రాష్ట్రంలోని తుముకూరు వరకు కళ్యాణదుర్గం, పావగడ,
మడకశిర, కొరటిగెర మీదుగా తుముకూరు వరకు కొత్త రైలు మార్గ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మాణం పనులు పూర్తయ్యే కదిరిదేవరపల్లి నుంచి రాయదుర్గం మీదుగా తిరుపతికి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టారు. కర్నాటక ప్రాంతంలో తుముకూరు వరకు రైలు మార్గం నిర్మాణం చేపట్టాల్సి వుంది. ఇది పూర్తయితే
పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఈ మార్గంలోకి మళ్లించడం కొత్త సర్వీసులు ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ప్రస్తుతం చిత్రదుర్గ రాయదుర్గం మార్గంలో 5
ఎక్స్ ప్రెస్ రైళ్ళ తిరుగుతున్నాయి. వీటిలో వారానికి రెండు సార్లు ప్రయాణించే ట్రైన్ నెంబర్ 06223-06224 శివమొగ్గ-రేణిగుంట_ శివమొగ్గ ఎక్స్ ప్రెస్ రైలు మాత్రం రాయదుర్గంలో ఆగుతుంది. అయితే యశ్వత పూర్ నుంచి జైపూర్, వారణాసి, కాట్రా, మైసూరు నుంచి కాట్రా నగర్ కు ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా రాయదుర్గం లో ఆగటం లేదు. రాయదుర్గం -చిత్రదుర్గం నడుమ, మరియు రాయదుర్గం నుంచి తుముకూరుకు రైలు
మార్గం నిర్మిస్తున్నప్పుడు కాని రైల్వే అధికారులు రాయదుర్గం జంక్షన్, రైల్వే స్టేషన్లో మౌలిక సౌకర్యాల కల్పనలో ఉదాసీన వైఖరి అవలంభించారు. పాత స్టేషన్ భవనాన్ని కదల్చకుండా ప్లాట్ ఫారం కొంత ఎత్తు చేసి పొడిగించారు. అయితే ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేంత పొడవుగా ప్లాట్ ఫారాలు లేవని రైల్వే అధికారులు ఇక్కడ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపడం
లేదు. రెండు సంవత్సరాల క్రితం రూ. 9.5 కోట్ల వ్యయంతో కొత్త స్టేషన్ భవనం అదనపు ప్లాట్ ఫారం రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. మట్టి పనులు మొదలు పెట్టినా సిగ్నలింగ్ వ్యవస్థ మార్చాలని పనులకు అడ్డుగా వుందని మరో కారణం సాకుతూ నిర్మాణం పనులు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు స్టేషన్ భవనం నిర్మాణం కాని, ఆధనపు ప్లాట్ ఫారం,
రైలు మార్గం నిర్మాణం పనులు కాని మొదలు పెట్టలేదు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ భవనం తొలగించి ఆ స్థలంలో మొత్తం 5 వరుసల రైలు మార్గాన్ని కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాధనలు చేశారు. అయితే ప్రస్తుతం స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సౌకర్యాల కొరత తీవ్రంగా వుంది. హోస్పేట-బెంగుళూరు నడుమప్రయాణించే ప్యాసింజర్ రైలు బెంగుళూరు నుంచి బయలు
దేరే వేళలను మార్చడంతో స్థానికంగా బక్షారి, హోస్పేట వెళ్ళే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ పట్టణాలకు ప్రతి రోజు సుమారు 300 మంది దాకా ప్రయాణించే వారు. అయితే గతంలో వున్న 8 గంటల స్థానంలో ఉదయం 4 గంటలకే రైలు రాయదుర్గం స్టేషన్
నుంచి బళ్లారికి వెళ్లడం వల్ల అక్కడికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సగటున 400 మంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ.60వేలు ఆదాయం వస్తుంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా రైల్వే శాఖ డీజల్ ఇంజన స్థానంలో విద్యుత్ నడిచే లైలు ఇంజన్లను ప్రవేశపెట్టింది. బళ్ళారి రాయదుర్గం రైలు మార్గం విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. చిత్రదుర్గం వరకు పూర్తయితే ఈ మార్గంలో విద్యుత్ ఇంజిన్ లో ప్రయాణించే రైళ్ళు తిరుగుతాయి.

పుట్ ఓవర్ అడ్డి నిర్మించాలి...

స్థానిక రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒక ప్లాట్
ఫారం నుంచి మరో ప్లాట్ ఫారంకు వెళ్లాలంటే రైలు
పట్టాలను దాటాల్సి వుంది. ఇది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాక ప్రమాదకరమైనది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు కోరు తున్నారు. ప్రస్తుతం రాయదుర్గం- అనంతపురం రోడ్డు మార్గంలో రైలు పట్టాలపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ దశలో వుంది. కణేకల్లు రోడ్డులో నిర్మించాల్సి వుంది. రాయదుర్గం నుంచి సగటున ప్రతి రోజు 8 ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు, 30 గూడ్స్ రైళ్లు
తిరుగుతున్నాయి. ప్యాసింజర్ రైళ్ల రద్దీ తక్కువగా
వుండటంతో గూడ్స్ రైళ్ల రవాణాకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. రైలు వచ్చిన ప్రతి సారి రోజుకు సుమారు 40 సార్లు రోడ్డు మార్గంలో రైల్వే గేటు వేయడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించు వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జిలను గేట్ల స్థానంలో నిర్మించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

స్టేషన్లో పలు రైళ్లారు ఆపాలి.

రాయదుర్గం గార్మెంట్ పరిశ్రమకు ప్రసిద్ధి గాంచగా ఇక్కడి నుంచి ఏటా వందలాది కోట్ల రూపాయల
గార్మెంట్ ఉత్పత్తులు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి, రవాణా అవుతాయి. నిత్యమూ ప్రజలు పరిపాలన, వ్యాపార, వ్యవహార, వైద్య, ఇతర పనుల విషయమై కర్నాటక రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలకు ప్రయాణిస్తుంటారు. వారి సౌకర్యార్థం దూర ప్రాంతాలకు వెళురైళ్లను ఇక్కడ ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాయదుర్గం-తుముకూరు రైలు మార్గాన్ని వెంటనే పూర్తి చేయడం వల్ల బెంగుళూరు గుంతకలు,
బెంగుళూరు-హుబ్బళ్లి నగరాల మధ్య తిరుగు రైళ్ల రద్దీని తగ్గించేందుకు తుముకూరు - రాయదుర్గం మార్గంలో పలు రైళ్లను మళ్లించవచ్చు. తద్వారా రాయదుర్గంలో, జిల్లాలోని పశ్చిమ ప్రాంత పట్టణాలు కళ్యాదుర్గం, కంబదూరు, మడకశిర మొదలైన పట్టణాల ప్రాంతాల ప్రజల సామాజిక,ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. వెనుకబడిన అనంతపురంజిల్లాను రైలు రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం ద్వారా
అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వాస్తవ పరిస్థితిని గ్రహించి జిల్లాలో రైలు రవాణా వ్యవస్థ అభివృద్ధికి రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

(శివకుమార్_ రాయదుర్గం)

భూకమతాలు







 
 

1995-96 గణాంకాల ప్రకారం1 నుంచి 5 హెక్టార్లు కమతాలున్న వారే ఎక్కువమంది రైతులు. ఒక హెక్టారుకు తక్కువ వున్న వారు రెండవ తరగతిలో నున్నారు. వీరి స్వాధీనంలో మొత్తం సాగుభూమి 11,88,821మంది చేతిలో 81640 హెక్టార్లున్నవి.
_______________________________________
కమతాల సైజు        వ్యవసాయదారుల సంఖ్య          హెక్టార్లలో
_______________________________________
0-50                      70,287              21,664

0.50-1.00             78,361              59,976

1.00-2.00          1,30,153          1,96, 191

2.00-3.00             88,388           2,04,526

3.00-4,00               31,981          1,09,503

4.00-5.00              22,226              99,407

5.00-7.50              25,345           1,53,972

7.50-10,00           12,078            1,03,806 

10.0-20.0              12,276            1,64,651

20.0-ఆపైన                2,268             75, 125
_________________________________________
మొత్తం                   4,73,763        11,88,821 
________________________________________

(ఆధారం: వ్యవసాయ గణాంకాలు(2002))

TBP.HLC. System (Stage-II)





YADIKI CANAL SYSTEM (P.A.B.R STAGE-II):

Yadiki Canal system is intended to provide Irrigation facilities to an ayacut of 50,000 acres I.D. during Rabi season by utilising 5 TMCft of water to be stored in P.A.B.R. to benefit arid areas of Yadiki, Peddavadugur, Peddapappuru and Tadipatri Mandals of Ananthapuramu district.

Mandals benefited : Peddavaduguru, Yadiki, Peddapappuru, Tadipatri.

Pendekallu Balancing Reservoir

Pendekallu Balancing Reservoir to a capacity of 0.65 TMC is constructed at Pendekallu village, Peddapappuru Mandal, Anantapur District.

Ayacut:Creates I.P. of 18500 acres Mandals Benefitted:Peddapappuru and Tadipatri

Chagallu Barrage

Chagallu Barrage is constructed to a capacity of 1.50 T.Mcft at Chagallu village, Peddapappuru Mandal, Ananthapuramu District.

Monday, September 7, 2020

తుంగభద్ర ఎగువకాలువ పేజీ-1(TB dam higher level canal)




 

         దీనిని 1967లో పూర్తి చేశారు. దీనిలోని నీరు, ముచ్చుకోట కనుమల ద్వారా జాజికొండలోయలో పడుతుంది. అక్కడి నుంచి రెగ్యులేటర్ ద్వారా తాడిపత్రి బ్రాంచి కాలువకు నీళ్లు చేరుతాయి. జాజికొండ వాగులో ప్రవహించడం వలన బ్రహ్మాండం గా భూమి నీటి ఊట కలిగి భూగర్భజలం పెరిగి బావులలో నీటి సామర్థ్యం మెరుగుపడింది. ముచ్చుకోట కొండల పరిధిలోని 29వ ఉపకాలువ ద్వారా చిన్న ఇతర నీటివనరుల వల్ల 3000 ఎకరాల తరి ,ఆరుతడి పైరు ఆయకట్టు సాధ్యమయ్యింది.
         దశాబ్ద కాలంగా నీటి సరఫరా సాగినా ఆయకట్టు అభివృద్ధి తగినంత లేదు. రైతులు మొదట్లో తడి భూములను ఆరుతడి క్రింద మార్చ మని కోరారు. తరువాత తమ భూములను లోకలైజేషన్ నుంచి తొలగించమని కోరారు. వారు భూగర్భ జలాలు పెరగడం వలన పండ్ల తోటలను పెంచడమే సులభమని భావించారు. 
         సుబ్బరాయ సాగర్ రిజర్వాయర్ నిర్మించిన తరువాత భూగర్భజలవూట పెరిగి స్థిరత్వం ఏర్పడింది. తరువాత సమీప లోయలో ముచ్చుకోట బ్యాలన్సింగ్ రిజర్వాయర్ చేపట్టి దానిని సుబ్బరాయ సాగర్ తో జోడించి మొత్తం రెండింటికి నీటి వసతి 1.0 టి.యం.సి.లు ఏర్పాటు చేశారు.

వేరుశనగ పంట( Groundnut)

              
అనంతపురం జిల్లాలో వ్యవసాయం విస్తారంగా వేరుశనగ పంట వలననే జరుగుతున్నది.
2000-01లో జిల్లాలో వేరుశనగపంట 20, 12,894 ఎకరాలలో పెట్టబడింది. వేరుశనగ ఉత్పత్తిలో 2000-01లో అనంతపురం జిల్లాలో మొత్తం రాష్ట్ర ఉత్పత్తితో 42.41% వుంది. ఈ వేరుశనగ పంట విస్తీర్ణం 17,70,842 ఎకరాలు 2,74,815 టన్నుల పంట సరాసరి ఎకరాకు 0.16టన్నులు పండింది. కాని 2000-01 సంవత్సరంలో ఉత్పత్తి 908795 టన్నులకు తగ్గి సరాసరి ఎకరాకు 0.45 టన్ను లయింది. దీనివలన జిల్లాలో వ్యవసాయంపై నమ్మకంగా రైతులు ఆధారపడలేక పోయారు. 

         దాంతో అనంతపురం జిల్లాలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గించి రైతులు   వ్యాపార పంటైన వేరుశనగను 1960-61 నుంచి పండించడం మొదలు పెట్టారు.
          జిల్లాలో ఆహార ధాన్యాల పంట విస్తీర్ణం రాష్ట్రంలోని విస్తీర్ణం క్రింద పేర్కొనబడింది.

 సం॥       అనంతపురం జిల్లా                    రాష్ట్రం
                  లక్షల ఎకరాలు              లక్షల ఎకరాలు
1960-61       18.21                         225.97


1970-71       15.05                         234.28 

1980-81        10.63                        216.36

1990_91         3.98                         191.80

1995-96          3.73                        170.35

2000-01          4.20                        189.60


        మొత్తం రాష్ట్రంతో పోలిస్తే అనంతపురం జిల్లాలో ఆహారధాన్యాల ఉత్పత్తి విస్తీర్ణం విపరీత మైన తగ్గుదల సూచిస్తోంది. పేదప్రజలు ఇతర జిల్లాల నుంచి ఎక్కువ ధరకు ఆహారధాన్యాల కొనడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితి పై ఎక్కువ భారం పడుతున్నది.

హంద్రీ నీవా(Hundri neeva)



 

ఈ ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో 602500 ఎకరాలకు సాగునీరు అందించటానికి రూపొందించిన పథకం. క్షామానికి గురౌతున్న ఈ నాలుగు జిల్లాలు ఈ ప్రాజెక్టు వల్ల కొంత సాగునీటి సౌకర్యం పొంది, కరువు కోరల నుంచి కొద్దిగా ఉపశమనంగా పొందగలవు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయరు నుంచి40టి.యం.సి ల నీరు ఎత్తిపోతల పథకంతో క్రిష్ణా బేసిన్లోని మిగులు నీటి నుంచి బచావత్ అవార్డు ప్రకారం శాశ్వత హక్కులేని విధంగా ఉపయోగించుకొనడానికి తయారు చేసిన పథకం. 
        ఆంధ్రప్రదేశ్ లో క్రిష్ణాబేసి లోని ప్రాజెక్టుల
ప్రతిపాదనలు అపరిష్కృతంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 5.5టి.యం.సిల నీళ్లతో త్రాగునీటి
పథకాన్ని కేంద్ర జలవనరుల సంఘం ఆమోదానికి పంపింది. ఈ నీరు ఆంధ్రప్రదేశ్ లో అవలంబించిన
పంటల మార్పిడి వలన ఆదా అయిన 19.33 టి.ఎం.సిల నుంచి వాడుకొంటామని నిర్ధారించింది.
ఇరిగేషన్ కమాండ్ ఏరియా డిపార్టుమెంటు చీఫ్ ఇంజినీయర్లు హంద్రీనీవా ప్రాజెక్టునురాయలసీమలో కరువుల నుండి రక్షంచుటకు అందులోనుముఖ్యంగా అనంతపురం జిల్లాను ఆదుకోవచ్చని గుర్తించారు. అందులో 88టి.యం.సిల నీరు అనంతపురం జిల్లాకు లభించేటట్లు చేయవచ్చునని క్రింద కనుబరచిన మేరకు సూచించినారు.
                                                టి.యం.సిలు
పూడిక వల్ల ఎగువకాలువలో        6.00
తగ్గిన నీరు

నాగార్జున సాగర్ ఆయకట్టులో     19.33
పంట మార్పిడి వల్ల ఆదా 
అయ్యేనీరు 

కె.సి.కెనాల్ నీరు పి.ఏబి.ఆర్.కు    10.00
మల్లింపు వల్ల వచ్చే నీరు


గోదావరి నుంచి క్రిష్ణాబేసిన్‌కు          20.00
మళ్లించడం వల్ల

పులిచింతల ప్రాజెక్టు వల్ల              10.00
 వచ్చే నీరు

తుంగభద్ర మరియు క్రిష్ణానదుల     23.00
నుంచి మిగులు నీరు

పెన్నఅహోబిలం రిజర్వాయర్(PABR)


                PABR dam, Anantapuram
     
ఎగువకాలువ స్టేజీ-2 క్రింద నిర్మించబడిన పిఎబిఆర్ వలన అదనంగా పది లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. పి.ఏ.బి. ఆర్, కుడికాల్వ ద్వారా 50వేల ఎకరాలు యాడికి కాలువ ద్వారా 50000 ఎకరాలకు మిడ్ పెన్నార్ ఉత్తర కాలువను పొడిగించడం వలన సాగవుతుంది. ఈ లక్ష ఎకరాలకు 10 టి.యం.సి.ల నీరు కావలసి ఉన్నది. ఈ 10 టి.యం.సిల నీరు కె.సి.కెనాల్ కు కేటాయించిన నీటిని తుంగభద్ర రిజర్వాయర్ ద్వారా మళ్లించవలెనని ప్రతిపాదింపబడింది,
        దీనికి బదులుగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 
10టి. యం. నీల నీరు కె.సి. కెనాలు కు సరఫరా చేయాలని ప్రతిపాదించబడింది. ఇది ఇంతవరకు అమలు జరుగలేదు.
       శ్రీశైలం కుడి కాలువనుంచి 1991-92 నుంచి కె.సి. కెనాలకు నీరు విడువబడుచున్నది.
1991-92 నుంచి 2001-02 వరకు శ్రీశైలం రిజర్వా యరు నుంచి కె.సి. కెనాలుకు 7.22.యం.సి.ల నుంచి 17.05టి.ఎం.సి.లు విడుదలవుతున్నది. అనగా సరాసరి సంవత్సరానికి 10.70 టి.యం.సి. ల నీరు విడువబడుతున్న. కె.సి. కెనాల్ లో ఆధునీకరణ పథకం క్రింద ఒక క్రొత్త ఆనకట్ట సుంకేశుల వద్ద తుంగభద్ర నదిపైన కట్టారు.

PENNA AHOBILAM BALANCING RESERVOIR (DR. KS. P.A.B.R)

Preamble

The Penna Ahobilam Balancing Reservoir is located across River Pennar near Korrakodu (v), Kuderu Mandal, Ananthapuramu District. It is intended to store 11.10 T.Mcft. to provide irrigation facilities to 1.00 lakh acres (50,000 Acres under P.A.B.R. Right Canal and 50,000 Acres under Yadiki Canal System). In addition, it is intended to feed tanks enrout P.A.B.R. Right Canal and driking water facility to the Chronically drought prone upland areas in Ananthapuramu District.

Salient Features
Location:
Latitude:14° 47' 26" N
Longitude:77° 17' 57" E
Catchment area:6165 Sq.Km(2420 Sq.Miles)
Deep river bed level:400.0 m
Deepest foundation level:399.5 m
Maximum Flood Discharge:4596 Cumecs
F.R.L.:443.000 m
Top Level of Dam:446.0 m
Gross capacity at F.R.L.:11.100 TMCft
Live storage at F.R.L:10.740 TMCft
Water spread area at F.R.L:27.56 M.Sq.m(296.5 M.Sq.ft)
Length of Spillway:101.44 m
Total length of dam:1920 m
Crest level of spillway:434.34 m(1424.6')
No. and size of spillway gates:101.44 m
Sill level:423.000 m
Power generation:2 Units of 10 MW each Kaplan Turbines 15400 B.H No.s 10 MW each
Irrigation potential:

It is intended to provide irrigation facilities to 1.01 lakh acres (50,000 Acres under P.A.B.R. Right Canal in addition to stabilization of ayacut 7,500 acres under tanks enroute and 51,600 Acres under Yadiki Canal System).

Mandals benefited:6 Nos. Kuderu, Atmakuru, Rapthadu, Dharmavaram, Bathalapalli, Tadimarri.
Components:
Main Canals:1 No.
Branch Canals:2 No.
(a) Dharmavaram Branch Canal (DBC)
(b) Pappuru Branch Canal (PBC)
Details Of The CanalsP.A.B.R Rt. CanalD.B.CP.B.C
Length112.00 Km.30.98 Km8.75 Km
Head Discharge821 Cusecs105 Cusecs50 Cusecs
Ayacut in Acres38,600 Acres6,400 Acres5,000 Acres
Cropping PatternRabi (I.D)Rabi (I.D)Rabi (I.D)
Status:

Dam : All the Dam works are almost completed except erecting of Gantry Crane and certain rehabilitation works (Drilling and Grouting to prevent leakages). An amount of Rs. 13.50 Crores is necessary to complete the above works.

PABR Right Canal :

The PABR Right Canal has been taken up in 1978 to provide irrigation facilities to an extent of 50,000 Acres to serve in Kuderu, Singanamala, Anantapur, Raptadu, Dharmavaram and Tadimarri Mandals of Ananthapuramu District in addition to stabilization of ayacut of 7,500 acres under tanks enroute.

Longitude : 77° 17' 57'' E

Latitude : 14° 47' 26'' E

Contemplates irrigation facilities to an extent of 5000 acres to serve 7 mandals in Ananthapuramu district in addition to stabilization of ayacut of 7500 acres under M.I tanks.

The works are almost completed except distributory network. It is estimated that Rs. 20.00 Crores is necessary for physical completion of all balance works to provide contemplated benefits.


అనంతపురం జిల్లాలో చెరువులు(Tanks)

చెరువుల సాగునీటి సౌకర్యం వల్ల ఈ జిల్లాలో చాలావరకు ప్రజాజీవనం కొనసాగేలా చేసింది.
చెరువుల పూడిక వలన, నీరు ఆవిరి కావడం, తరచుగా తెగిపోవడం, సరియైన నీటి పారుదల
నిర్వహణ లేకపోవడంవల్ల చెరువుల సార్థకత చాలా తగ్గిపోయింది. జిల్లాలో 2487 చెరువులున్నాయి. అందులో 100ఎకరాల ఆయకట్టుపైన ఉన్న చెరువులు305. ఇందులో క్రీ.శ. 14-17 శతాబ్దాలలో విజయనగర రాజులు చాలా వరకు కట్టినవే ఉన్నాయి ఈ చెరువుల క్రింద సాగయ్యే మొత్తం భూమి 54500 హెక్టార్లు.


జిల్లాలో ముఖ్యమైన చెరువులు (ఎకరాల సాగు)

1) బుక్క పట్నం చెరువు                 2972    
2)గుత్తి చెరువు          ‌  ‌‌                  1037
3) పరిగి చెరువు                             2851
4) వై.టి. చెరువు                              903
5) శింగనమల చెరువు                    2524 
6)కంబదూరు చెరువు                        963
7) ధర్మవరం చెరువు                        1922
8) హిందూపురం చెరువు                  1130
9) కొట్నూరు చెరువు                     ‌   1509
10) కుంటిమద్ది చెరువు                      490
11) అనంతపురం చెరువు                 2511

Sunday, September 6, 2020

గవి సిద్దేశ్వరుడు


అనంతపురం జిల్లాలో వాయువ్యంగా బళ్ళారికి
సమీపంలోని డి.హీరేహాల్ మండలంలో రాగి
పర్వతాల్లో సూగూలమ్మ గుట్టపై గవి  సిద్దేశ్వరుడు వెలిశాడు. 6 శతాబ్దాల చరిత్ర గలదీ ఆలయం. వృక్ష, జంతు జలాలను రక్షించేందుకు గవి సిద్దేశ్వరుని రూపంలో స్వయంగా శివుడే ఇక్కడ వెలిశాడని భక్తాదుల నమ్మకం.
          విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరా యల కాలంలో సుబేదారుగా పనిచేసిన మల్లప్ప ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. కర్నాటకలోని బళ్ళారి జిల్లా గుడేకోట సమీపంలో గల సోమవార దుర్గానికి చెందిన గవి మఠాధిపతి సిద్ధప్ప సూగాలమ్మ గుట్టకు వచ్చి స్థిరపడ్డాడు అంటారు. సుబేదారు మల్లప్ప, సిద్దప్పలు విజయనగర రాజులను ఒప్పించి ఆలయాన్ని నిర్మించి, కొన్ని గ్రామాలను మాన్యాలు గా ఇప్పించారని  బళ్ళారి జిల్లా గెజెట్ లో రాసినట్లు ఆలయ చరిత్ర  వ్రాసిన కీ.శే. వై.నాగేశశాస్త్రి పేర్కొన్నారు.
          ఆరు శతాబ్దాల చరిత్ర గల ఆలయం ఇటీవల అభివృద్ధి చెందుతోంది. ఆలయానికి మాన్యాలున్నా చాలా కాలంవరకు అభివృద్ధికి నోచుకోలేదు. స్థానికంగా హీరేహాలుకు చెందిన పార్లమెంట్ సభ్యుడు హెచ్.జి.రాయులు మరియుఇబ్రహీంసాబ్ చొరవ తీసుకోవడంతో ఆలయం అభివృద్ధి చెందుతోంది. 
       కంచికామకోటి పీఠాధిపతి   జయేంద్ర సరస్వతి ,  శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల ఆద్వర్యంలో  సహస్రచండీయాగం జరిపారు. 
             రాయదుర్గం సమీపంలో లింగాల బండ
వద్ద గల చతుర్ముఖ పశుపతి ఆలయంలో 101 శివలింగములు ఉండగా, గవిసిద్దేశ్వరుని ఆలయం లో 1982 సంవత్సరంలో 188 శివలింగములను ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో 1989 లో  గణపతి, గౌరీదేవి, రేణుకాచార్య విగ్రహాలు ప్రతిష్టించారు.
      గవిసిద్దేశ్వరుని ఆలయం గల సూగాలమ్మగుట్ట రాగి పర్వత శ్రేణులో ఒక భాగం పేరుకు రాగి పర్వతాలైనా ఇచ్చట ఇమము-ఉక్కు తయారీకి ఉపయోగపడే మేలు రకం మాంగనీస్, క్వార్ట్జ్ ఖనిజాలు లభ్యమవుతాయి.
         రాగిపర్వత ప్రాంతాల్లో సహజసిద్ధమైన చిట్ట డవులు ఉన్నాయి. ఈ పర్వతాలు పూర్వం దట్టమైన అడవులు, జంతు, వృక్ష సంపదచే అలరారు చుండేవి.

ఈ పర్వతాలపై కురిసే వర్షాలతో ఆలయసమీపంలో గల ఒక గుహ నుండిడి నీరునిరంతరం ప్రవహిస్తుండేది. గుహ(గవి) సమీపంలో  ఆలయం ఉన్నందున గవిసిద్దేశ్వరుడని  పిలిచేవారు.     
          ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజుల్లో
 బళ్ళారి కంటోన్మెంట్  సైనికులు, ఆంగ్లేయ అధికా రులు తరచూ ఆలయ ప్రాంతాన్ని సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవారు.

          రాగిపర్వాతాల్లో లభించే ఇనప ఖనిజతవ్వకం వల్ల ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు రాయల్టీ రూపంలో ఉండేది. ప్రభుత్వం హీరేహాలు నుండి ఆలయం వరకు రోడ్డు మార్గం భక్తుల సౌకర్యార్థంవేయించింది.
         ఆర్.టి.సి. రాయదుర్గం నుండి ఆలయానికి ప్రతిరోజు 6 సింగల్స్ సర్వీసును నడుపుతోంది. మంగళవారం రోజుల్లో బళ్ళారి వైపు మండి ఓ ప్రైవేటు బస్సు కూడా తిరుగుతోంది.

దేశస్వాతంత్ర్యం కోసం రాయదుర్గం ప్రాంత ప్రజలు‌చేసిన పోరాటాలు


            రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ప్రజలు స్వాతంత్ర్య సమరంలో మేము సైతం అంటూ ఎన్నో త్యాగాలు చేశారు. దేశస్వాతంత్ర్యం కోసం రాయదుర్గం ప్రాంత ప్రజలు‌చేసిన పోరాటాలు చరిత్ర లో నేటికీ సజీవంగానే ఉన్నాయి.జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి జైలు శిక్ష అనుభవించారు రాయదుర్గానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధులు.ఉప్పుసత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పేరుగాంచారు. పురుషులకు దీటుగా తామేమీ తీసిపోమంటూ అప్పట్లోనే పలువురు మహిళలుస్వాతంత్ర్య సమరంలో పాల్గొని ప్రశంసలు పొందారు. పట్టణానికి చెందిన సత్యభామాదేవి లాంటి మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో దూకి తమవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం నాటి సమరయోధులంతా కాలధర్మం చెందారు. కాని వారి త్యాగాలకు గుర్తుగా దేశస్వాతంత్ర్యానికి చిహ్నంగా 1972లో రాయదుర్గం మండలం లోని 71 ఉడేగోళం గ్రామం వద్ద ఒక చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున నియోజకవర్గంలో స్వాతంత్ర్య సమరయోధులకు అక్కడ నివాళులు నివాళులర్పిస్తున్నారు. 
పట్టణానికి చెందిన  స్వాతంత్ర్య సమర యోధుడు ఓబుళాచారి పేరును ఒక కాలనీకి పెట్టారు.ఆనాటి సమర యోధుల విశేషాలు 1980లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో రాయదుర్గం నుంచి వరదా చెన్నప్ప తిప్పయ్యలు గాంధీజీ వెంట నడిచి కర్ణాటకలోని కార్వారు జైలులో మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు రాయదుర్గానికి చెందిన ఆర్ నాగన్న గౌడ్ 1941లో వ్యక్తి సత్యాగ్రహం చేసినెల్లూరు, తమిళనాడులోని తిరుచునాపల్లిలో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించారు. అప్పట్లోనే బ్రిటీష్ ప్రభుత్వానికి రూ 400ల జరిమానా చెల్లించారు. అదే ఏడాది ప్రముఖ గాంధేయవాది రాయదుర్గం తొలి ఎమ్మెల్యే జి నాగభూషణం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బెంగళూరు కేంద్ర కారాగారంలో మూడు నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించారు. పట్టణానికి చెందిన హెచ్ సుబ్బారావు, మహిళల్లో సత్యభామా దేవి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఎన్ సి శేషాద్రి‌తొలి పాత్రికేయుడు నిప్పాణి రంగారావు,మోపూరి చంద్రకాంతం నాయుడు. శరణప్పలు ఉద్యమంలో పాల్గొన్నారు. రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన కట్టారావుప్ప కాశీపురానికిచెందిన ఎం వీరయ్య జగన్నాధ్ సింగ్ గుమ్మగట్ట మండలం లోని సిరిగే దొడ్డికి చెందిన దామోదర్ సింగ్ లు  స్వాతంత్ర్య సమరంలో పాల్గొని బ్రిటీష్ పోలీసుల చేతిలో ఎన్నో చిత్రహింసలు పొంది జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం తర్వాత వీరు పింఛన్లు పొందారు.


డి.హీరేహాల్


 
       మురడి అంజన్న ఆలయ చరిత్ర ప్రకారం 15వ శతాబ్దాంలోని అప్పటి శ్రీకృష్ణదేవరాయలు గురువు వ్యాసరాయలు ఆంజనేయ స్వామికి మహా భక్తుడు. దేవరాయ లును కుహూ అనే గండం నుంచి తొలగించేందుకు దక్షిణ భారతదేశంలో 732 ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించారని తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో  మురడి, నేమకల్లు, కసాపురం ఆంజనేయస్వామి ఆలయాలను మూడు ప్రాంతాల్లో ఒకే రోజు, ఒకే నక్షత్రంలో ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. 
     మురడిలో వెలసిన స్వామివారు 8 అడుగుల ఎత్తులో ఉండటంతో మురడి ఆంజన్నగా పేర్కొంటున్నట్లు ఆలయ పెద్దలు చెబుతున్నారు. ఆ
ఆలయంలో సీత సమేత కోదండరామస్వామి, వినాయక స్వామి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. 

              మండలంలో మరో ప్రసిద్ధిగాంచిన గవి సిద్దేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. సరిహద్దు దేవుడిగా పిలువబడే గవిసిద్దేశ్వర స్వామి ఆలయం సరిహద్దు ప్రాంతంలో హెచ్ సిద్దాపురంగ్రామంలో ఇనుపకొండల మధ్య వెలిశారు. ఇక్కడ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గవిసిద్ధేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.
 ఈ ఆలయంలో 101 లింగాలు, 7పడగలనాగులను దర్శించుకుంటే దోషాలు తొలగి శుభాలు కలుగు తాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలినడకన సొంత వాహనంలో వెళ్తుంటారు.


Saturday, September 5, 2020

భూ విభజన


జిల్లాలో పదింట ఒక భాగం అటవీ ప్రాంతం(10,30శాతం). సాగుకు వీలుడాని పర్వత
వలయము మరియు బీడు భూమి 9,045. వ్యవసాయేతరాలకు భవనాలు, రోడ్లు కాలువలు
మొదలైన వాటికి పన్నెండింట ఒకభాగం (8.47%) పోతుంది. అయినా పంటలు పెట్టే భూమి
పెరిగింది.

భూగర్భజలాలు

                 
అనంతపురం జిల్లాలో శాస్త్రీయంగా భూగర్భజలాల అధ్యయనం జరిగింది. 71100 మామూలు బావులు బోరుబావుల ద్వారా గృహాలకు వ్యవసాయ విని యోగానికి భూగర్భజలాలను వినియోగిస్తున్నారు. రాష్ట్ర గ్రౌండు వాటర్ డిపార్టుమెంటు అంచనా ప్రకారం 1197 మిల్లియన్ క్యూమెక్సు లేదా 42.2722.యం.సి. నీరు నిక్షిప్తంగా ఉన్నట్లు సూచించారు.
          ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నది 682 మిలియన్ క్యూసెక్కులు లేదా 24.085 బి.యం.సి.
అని అంచనా. 515 మిలియన్ క్యూసెక్సు లేదా 18.187 టి.యం.సి. జిల్లాలో ఉత్తరోత్తరఅభివృద్ధికి నిల్వ ఉన్నవని అంచనా. 
         ప్రస్తుతం భూగర్భజలాలతో సాగుతున్న భూమి 1,32,990 హెక్టార్లు లేదా 3,28,619 ఎకరాలు,
                 కమాండ్      నాన్-కమాండ్      మొత్తం
                   ఏరియా          ఏరియా    (టీయంసిలు)
               (టియంసిలు)  (టియంసిలు)

 ఏడాదికి      7.522          34.750        42.272
లభ్యమవుతున్న  
భూగర్భజలం

ప్రస్తుతం
వ్యవసాయానికి
వాడుతున్నది       0.989    23.096    24.085

భూగర్భజలంతో
సాగవుతున్న
మొత్తం ఎకరాలు                            3,28,618

నికర సాగు
భూగర్భజలంతో                           4,89,379



                

అనంతపురం జిల్లాలో సాధారణ వంకలు


            

1) తడకలేరు: ఆత్మకూరు, అనంతపురం,     
                     శింగనమల మండలాలు

2) సోమవతి: ఓ.డి. చెరువు, నల్లమాడ 
                    మండలాలు( సున్నంపల్లి నుండి 
                    నల్లమాడ(వయా) మిట్టపల్లి,    
                    ముత్యాల చెరువు)

3) వంజు వంక :ఆత్మకూరు, కూడేరు మండలాలు

4) బ్రాహ్మణపల్లి వంక :యాడికి, తాడిపత్రి 
                                 మండలాలు

5) చిక్కేపల్లి వంక : యాడికి మండలం

6) జిల్లేడిబండ వంక :బుక్కపట్నం, ముదిగుబ్బ 
                               మండలాలు

7) మద్దిలేరు: కదిరి, ముదిగుబ్బ మండలాలు

8) వంగపేరు: గోరంట్ల, పుట్టపర్తి, కొత్త చెరువు 
                     మండలాలు

9) కొలిగెర: గోరంట్ల మండలం

10) పుల్లేటివంక: దాదలూరు, కొణుతూరు,
                         గొట్లూరు గ్రామాలు

11) పరమేశప్పకుంట అప్పరాచెర్వు - ధర్మవరం 
                                                       మండలం

12) లోకల్ వంక: సంతేబిదనూర్ నుండి 
                          బేవనహల్లి (హిందూపురం    
                          మండలం)

13) బూతప్పకనుమవంక:మడకశిర - రాళ్లపల్లి నుండి గుడిబండ, మడకశిర మండలాలు

14) సి, ఆర్.పల్లి వంక: నల్లచెరువు మండలం

15) పలకమ్మ చెర్వు సప్లయ్ ఛానల్: నల్లచెరువు మండలం

16) గంగిశెట్టికుంట: నల్లచెరువు మండలం

17) జల్లిపల్లి దగ్గర లోకలవంక: కూడేరు మండలం

18) రామదుర్గం వంక: ఆత్మకూరు మండలం నుండి ఆత్మకూర్ ట్యాంక్

19) బల్లేబాయ్ వంక నుండి - రాజులగుడి వంక:
     గుంతకల్ మండలం

20) డి. కొండాపురం వంక :  రాయదుర్గం మండలం
(ధర్మపురి నుండి వేపరాల
నాగిరెడ్డి పల్లి ట్యాంక్)

కరువు జిల్లాకు సేద్యపు నీటి పథకాలు సాధ్యమే






       ఆనంతపురం జిల్లా 1050-1100 మీ.సముద్రమట్టం కన్నా  ఎత్తైన ప్రాంతంలో ఉంది. మనకన్నా కృష్ణానది లోతట్టులో పారుతోంది. కృష్ణానీటిని మళ్ళించుకోవాలంటే ఎత్తిపోతల పథకాలు అమలు చేయాలి. కానీ తుంగభద్ర జలాశయం మనకన్నా ఎత్తులో ఉంది. దాదాపు 500 ఎం.ఎస్.ఎల్. తేడా వుంది. ఆ ప్రాంతం 633ఎం.ఎస్.ఎల్ లో వుంది. నీటిని గురుత్వాకర్షణ ద్వారా మనం సులభంగా పొందవచ్చు. తుంగభద్ర, భీమా, హంద్రి, దిండి, మూసి ఉపనదులు ఉన్నాయి. కృష్ణాకు అధిక నీరందించే ఉపనది తుంగభద్ర మాత్రమే. కృష్ణానదికి 2390టి.ఎం.సి అడుగుల నీరులభిస్తున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ లెక్కవేసింది. మూడు రాష్ట్రాలకూ కృష్ణానది నీటిని కేటాయించేందుకు బచావత్ నేతృత్వంలో కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటైంది. లభిస్తున్న నీటిలో 75శాతం విశ్వసనీయత ఆధారంగా 2060టి.ఎం.సి. అడుగుల నీరు నికరంగా లభిస్తున్నట్లు లెక్కకట్టారు. ఇందులో తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్న 212టి.ఎం.సి.,ల నీరు కూడా ఇందులో ఉంది. మిగులు జలాల కింద 330టీ.ఎం.సి.ల నీటిని అంచనా వేశారు. ఈ నీటికి 25 శాతం విశ్వసనీయత ఉంటుంది. ఈ నీరు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మిగులు జలాలను ఏ ప్రాజెక్టుకూ కేటాయించలేదు. అందువల్ల మిగులు జలాలు ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు లభించింది. అయితే ఇంతవరకు మిగులు జలాలను ఉపయోగించు కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 30 ఎళ్ళు గడిచిపోతున్నా, బచావత్ గడువు మీరిపోయినా ఆనీటిని ఇప్పటికీ సద్విని యోగం చేసుకోలేక పోయాము. ఆ నీటిని వినియోగించుకొని సాగునీటి పథకాలను సాగునీటి పథకాలను చేపట్టివుంటే నీటిపై హక్కు లభించేది. మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటైతే సమీక్ష చేసినప్పుడు ఆ ప్రాజెక్టులకు నీటికేటాయింపు లభించేది. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను ఉపయోగించుకుని గాలేరు - నగరి, హంద్రీ-నీవా,ఎస్.ఎల్.బి.సి., నెట్టెంపాడు, భీమా తదితర సాగునీటి పథకాలను రూపొందించింది. ఈ పథకాలన్నీ అమలు చేసినా కేవలం 240 టి.ఎంసి.ల మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవటంసాధ్యమయ్యేది. కానీ ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడడానికిమన ప్రజా ప్రతినిధులే కారణం. ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెచ్చివుంటే అమలు జరిగేది. ఆ పథకాల కోసం ఒత్తిడి తెచ్చేవారే కనుమరుగయ్యారు. వాస్తవాలను పత్రికలు ఇంకా బాగా తెలియజేస్తేనమ్మకం, గౌరవం పెరుగుతుంది. కృష్ణానది నుంచి ఆంధ్రప్రదేశ్ కు 800టి.ఎం.సి.లు, కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560టి.ఎం.సి.ల చొప్పున కేటాయించారు. తుంగభద్ర జలాశయం నుంచి 2124.ఎం.సి.లు నీరు కూడా రాష్ట్రానికి కేటాయించిన కృష్ణాజలాలలో ఇమిడి ఉంది. అందులో 73టి.ఎం.సి.లు ఆంధ్రప్రదేశ్ కు, 139 కర్నాటకకు కేటాయించారు. 1950లో ఈ పథకం ప్రారంభించి నాలుగేళ్ళలో పూర్తి చేశారు. అప్పట్లో మన ప్రభుత్వం, కర్నాటకతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మనకు అన్యాయం జరిగింది. మనకు ఎక్కువ విద్యుత్ కావాలని కోరాము. తక్కువ నీటిని తీసుకునేందుకు అంగీక రించాము. అప్పటి పరిస్థితులకు అది సరియైనదే కావచ్చు. అప్పట్లో మనం విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చాము. విద్యుత్ ఉత్పత్తికి తర్వాత కాలంలో చాలా ప్రాజెక్టులు నెలకొల్పాము.ఇప్పుడు ఎక్కడ చూసినా నీటికి తీవ్ర ఒత్తిడి ఉంది. నీరు అదనంగా పొంది వుంటే మనపరిస్థితి ఇప్పుడు బాగుండేది. ముందుచూపుతో ఆలోచించకపోవడం వల్ల అప్పుడు అన్యాయం జరిగింది. అందువల్ల మనం తక్కువ నీటిని పొందుతున్నాము.

        కృష్ణా నదినుంచి రాష్ట్రానికి 800టి.ఎం.సి.లు కేటాయిస్తే అందులో హెచ్.ఎల్.సి. 32.5 టి.ఎం.సి.లు మూడు జిల్లాలకు కేటాయించారు. అందులో 22టి.ఎం.సి.లు అనంతపురం జిల్లాకు లభించింది. అంటే రాష్ట్రానికి లభిస్తున్న 800టి.ఎం.సి.లలో అనంతపురం జిల్లాకు ఇస్తున్నది కేవలం 22టి.ఎం.సి.లు మాత్రమే. దీనినిబట్టి 2.3 శాతం మాత్రమే నీరు మనకు లభిస్తోంది.హెచ్.ఎల్.సి.కి 32.5టి.ఎం.సి.లు కేటాయించినా జలాశయం సామర్థ్యం పూడికతో తగ్గినందున 26టి.ఎం.సి.లు మాత్రమే లభిస్తోంది. అందులో కర్నూలు, కడప జిల్లాల్లోని ఆలూరు, పులివెందుల కాలువలు మైలవరం జలాశయానికి పోనూ అనంతపురం జిల్లాకు లభించింది 16 నుండి 20 టి.ఎం.సిలోపే. జిల్లాలో, చెరువులన్నీ నిండితే కూడా అంతమొత్తం నీరు లభిస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి రెండు రాష్ట్రాల్లోని సాగునీటి వ్యవస్థలకు 2124.ఎం.సి.ల నీటిని కేటాయించాలి. రిజర్వాయర్ సామర్థ్యం 133టి.ఎం.సిల అడుగులు కాగా పూడికవల్ల సామర్థ్యం తగ్గిపోయింది. 1993లో జరిపిన సర్వే ప్రకారం 111.5టి.ఎం.సి.ల సామర్థ్యం ఉంది. అంటే 21.5టి.ఎం.సి.ల మేర పూడిక ఏర్పడింది. ఇప్పటికి పూడిక పెరిగి సామర్థ్యం 25-26టి.ఎం.సిలకు తగ్గివుంటుంది. తుంగభద్ర జలాశయం కర్నాటకలో ఉన్నందున సహజంగానే అక్కడివారు అదనంగా నీటిని తీసుకొనే అవకాశంవుంది. అయితే దానికి మనకు నీటి రవాణా నష్టాలకింద చూపిస్తున్నారు,
నీటి విషయంలో మనకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే కదా!

అనంతపురం జిల్లాలోని నదులు - అవి ప్రవహించే మండలాలు

1) పెన్నానదీ (పరివాహక ప్రాంతం 8869చ.కి.మీ) హిందూపురం,రొద్దం,రామగిరి,కంబదూరు కనగానిపల్లి, వజ్రకరూరు,కళ్యాణదుర్గం, బెళుగుప్ప కూడేరు, ఉరవకొండ ,పామిడి,గార్లదిన్నె,శింగనమల పెద్దపప్పూరు,తాడిపత్రి

2) చిత్రావతి (పరివాహక ప్రాంతం 6031చ.కి.మీ)
చిలమత్తూరు గోరంట్ల పుట్టపర్తి చెన్నేకొత్తపల్లి ధర్మవరం,బత్తలపల్లి తాడిమర్రి ముదిగుబ్బ యల్లనూరు

3) వేదవతి (పరివాహక ప్రాంతం 2354చ.కి.మీ)
గుమ్మగట్ట ,బ్రహ్మసముద్రం ,రాయదుర్గం ,బెళుగుప్ప కణేకల్,బొమ్మనహాల్

4) పాపాఘ్ని (పరివాహక ప్రాంతం 1187 చ.కి.మీ)
తనకల్లు ,ఎస్.పి. కుంట,పరిగి,పెద్దవడుగూరు