Sunday, June 2, 2024

కదిరిలో లంబాడిల జీవన విధానం _ భిన్న సంస్కృతులు


కదిరిలో లంబాడిల జీవన విధానం _ భిన్న సంస్కృతులు
   ‌‌ ‌ ___పిళ్లా కుమారస్వామి           

       మనకు తెలియని మన పూర్వీకుల సంస్కృతి తెలియాలంటే ఆదివాసీల సంస్కృతిని అధ్యయనం చేయాల్సి వుంటుంది. ఆదిమానవులలో ఏర్పడిన భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు నేటి లంబాడీల లో వున్నాయి. వాటిని అధ్యయనం'చేయడం ద్వారా మన పూర్వీకుల సంస్కృతులు తెలుస్తాయి. అవి మెల్లగా పరిణామక్రమంలో ఎలా మార్పులు చెందాయో మనకు అర్ధమవుతుంది. గిరిజన సంస్కృతిలో గిరిజనుల ఆచార వ్యవహారాలు, వేషధారణ, ఆహారం, ఆహార సేకరణ విధానం, సంప్రదాయాలు, తెగలు, భాష మొదలైన విషయాలన్నీ వస్తాయి.      
      ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగాదావరి జిల్లాల్లో కోయలు, కొండరెడ్లు, కమ్మర, యానాదులు,ఎరుకలు వున్నారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో చెంచులు వున్నారు. అనంతపురం జిల్లాలో బంజారాలు,ఎరుకలు ఉన్నారు. సవరలు, జాతవులు, గోండులు, గదబలు, బగతలు శ్రీకాకుళం జిల్లాలో వున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాలలో ఎక్కువగా బగత, గదబ, మన్నె దొర, గౌడ, వాల్మీకి, గకలట్‌ కువి వంటితెగలు వున్నాయి.గిరిజన తెగల్లో చాలామంది వివిధ వృత్తుల్లో వున్నారు. వీరిలో 54శాతం మంది వ్యవసాయరంగంలో, 32% మంది వివిధ రంగాల కార్మికులుగా, మిగిలినవారు. గృహపరిశ్రమ వంటి పనుల్లో వున్నారు. వ్యవసాయంలో పోడు వ్యవసాయం వీరి ప్రధాన జీవన విధానం.

       లంబాడిలు లేదా సుగాలీలు మైదాన ప్రాంత గిరిజనులుగా పేరు పొందారు.వీరు గిరిజనులలో 28 వ తెగ. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూరిళ్ళపుడు దాన్యం కల్లాలు తొక్కించడానికి ఆవుల్ని తోలుకొచ్చే వాళ్ళు.లంబాడీ భాషకు లిపి లేదు. సవర భాష దీనికి దగ్గర ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలోప్రత్యేక తెగగా కనిపిస్తారు.
      తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. లంబాడీలు తండాలుగా ఏర్పడి తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ తండాలను జనవాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారు ఐనా ఎంత గొప్పవారు ఐనా, తండాలోకి వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు సిద్ధాంతాలు, లంబాడీలపై రుద్దడానికి వీలులేదు. కావున బయటి మనుషులను రాణించే వారు కాదు. తండా నాయక్ (తండా పెద్ద) ఏం చెప్తే అదే ప్రజలకు శిరోధార్యం. ఒక వ్యక్తి, లేదా ప్రజలు జనవాసానికి దూరంగా ఉంటున్నారంటే వారిలో ఏదో ప్రత్యేకం ఉందని అర్ధం. లంబాడీలలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పెళ్లి, చావు, అన్ని ప్రత్యేకమైనవే. వీరు గిరిజనులు కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి.
    ఇంకా నుగాలి తమ అమ్మవారి పూజ కోసం బయట సమాజంలోకి వచ్చి‌ బస్టాండ్లలో, రోడ్ల పైన మగవాళ్ల దగ్గర డబ్బులడుగుతారు. అలా అడిగిన తర్వాత వచ్చిన సొమ్ముతో పూజలు చేస్తారు. ఆ డబ్బుతో వారు ప్రజలు పూజలు చేయాలని వారి ఆచారంగా చెప్పుకుంటారు.

Friday, March 5, 2021

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు


సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు 

తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. కదిరి ప్రాంత ప్రజలు కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ.
సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు.

భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొంటారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలను, ఇంట్లో ఉండే పాత పొరకలు, తట్టలు , విరిగిపోయిన మంచాలు మొదలైన పాడైన పాత వస్తువులను మంటల్లో వేసి కాల్చివేస్తారు. వ్యవసాయంలో వాడి పాతబడి దెబ్బ తిన్నవాటిని భోగి మంటల్లో వేస్తారు. కొంత మంది సంప్రదాయం పేరుతో భోగి మంటలు వేయాలన్న తాపత్రయంతో రబ్బరు, టైర్లు, పెట్రోలు పోసి తగల పెడుతున్నారు. దాని వల్ల కాలుష్యం పెరిగి ఆరోగ్యం పాడవుతుంది. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు.
భోగి రోజు పట్టణాలలో బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుకుంటారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు.
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగిస్తారు. దాదాపుగా అందరిళ్ళలో అత్తిరాసలు, ఓళిగలు, చక్కిలాలు, పాయసం, పులిహౌర, వడలు మొదలయిన వంటకాలు చేసుకుంటారు. కొత్తబట్టలు ధరిస్తారు. కొంతమంది ఈ రోజున పెద్దల పండుగ జరుపుతారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు.ఎద్దు లేదా ఎనుము పేడతో ముద్దగా చేసి దానిపై గుమ్మడి పూవును పెడతారు. గతంలో గొబ్బియ్యాలో అంటూ అమ్మాయిలు పాటలు పాడేవారు. ఇప్పుడది కనుమరుగైంది. పట్టణాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు వివిధ సంఘాల వారు. కొంతమంది పిల్లలు గాలిపటాలను ఎగుర వేస్తారు.
సంక్రాంతి రోజు గంగిరెద్దులను ఆడించే వ త్తి గల గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత న త్యాలు చేయిస్తారు. ఇవి చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్లు మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టూ అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చి ఉంటుంది. అందుకనే వారికి ధాన్యం బిక్షగా ఇస్తారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెంతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ తలపాగా ధరించి దానిపై రాగి పాత్ర కదలకుండా ఉంచుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇదంతా పాత సంప్రదాయం. మారిన పరిస్థితుల్లో గంగిరెద్దుల వారు అలా తిరగాల్సిన అవసరం నేడు లేదు.
మూడోరోజు కనుమ. దీనినే పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశువులను రైతులు పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్ని తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, ఎనుములను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
రాయలసీమలో ముఖ్యంగా కదిరి పల్లెల్లో ఇంటి ముందరే పశువుల కొట్టం ఉంటుంది. దానికి దగ్గరే పొంగలి వండుతారు. పొంగలిని కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం, పెసలు, పాలు వేసి వండుతారు. దాన్ని పశువులకు నైవేద్యంగా తళిగ(పళ్లెం)లో సమర్పిస్తారు. కొంతమంది కాటమయ్య దేవునికి కోడిని కోసి నైవేద్యంగా పెడతారు.
మద్దిమాను, నేరేడి మానుచెక్క, మోదుగపూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పుచెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇదొక పెద్ద ప్రహాసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసెళ్ళు ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు, మేకలు ఐతే కొన్ని వాటంతటవే తింటాయి. లేకపోతే వాటికి కూడా తినిపిస్తారు. ఏడాది కొక్కసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారిణి అని వీరి నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకపోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునైన కత్తితో బాగా చెక్కి వాటికి రకరకాల రంగులు పూస్తారు. కొంతమంది వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో గజ్జల పట్టాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఎద్దుల బండిని కూడా అలంకరిస్తారు. కొన్ని చోట్ల ఎడ్లబండి పందేలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

Sunday, January 24, 2021

లేపాక్షి ఖ్యాతి ఫ్రభవిల్లిన కీర్తి



నాటి వైభవానికి గుర్తింపు • గణతంత్ర పరేడ్ లో శకటం ప్రదర్శన

విజయనగర రాజుల ప్రముఖ వాణిజ్య కేంద్రంగా.. చిత్ర, శిల్పకళా సౌందర్యానికి కాణాచిగా... లేపాక్షి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది.2021,జనవరి, 26న ఢిల్లీ రాజ్ పథ్ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మరోమారు విశ్వవ్యాప్తం కానుంది. మన రాష్ట్రం తర పున 'లేపాక్షి శకటాన్ని పరేడ్లో ప్రదర్శించనున్నారు. 

శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం ఏడు శిరస్సుల నాగేంద్రుడు

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర కాలంలో కోశాధికారిగా ఉన్న విరూపణ్ణ, వీరన్న అనే అన్నదమ్ములు 1522-1588 వరకు 16 సంవత్సరాల పాటు నిర్మిం చారు. ఆలయం మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ఉన్న కొండ పై పునాది లేకుండానే నిర్మించడం

ఎంతో ఘన చరిత్ర కలిగిన లేపాక్షి ఆలయ ఘనకీర్తి పర్యాటకశాల ఆధ్వర్యంలో  నిర్వహించిన ఉత్సవాలతో విశ్వవ్యాప్తమైంది  మొదట 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్సవాలు నిర్వహించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృ త్వంలో రెండుసార్లు ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించి లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలసోదరుడు అచ్యుతదేవరాయలు ఆస్థా 

  
 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్లో లేపాక్షి శకటంలో  
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది విగ్రహం శకటానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవ నుంది. ఆలయ అద్భుత నిర్మాణ శైలి, ముఖ మంటపం, అధ్యాంతరంగా ఆగిన కల్యాణ మంటప నమూనాను ప్రదర్శిం చనున్నారు. రాతితో చెక్కిన పెద్ద వినాయకుడు, ఏడు శివ స్సుల నాగేంద్రుని ప్రతిమ శకటంలో ఆకర్షణగా నిలవనుంది దక్ష యజ్ఞం లో వీరభద్రుడి ఉగ్రరూపాన్ని చాటేలా శకటం ముందుకు సాగే సమయంలో వీరకైవుల సంప్రదాయ కళ రూప నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు.




ఆలయంలోని నాట్యమంటపం, బతా

మంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటపం, వేలాడే స్తంభం ఏడు శిరస్సులు నాగేంద్రుడు, సీతమ్మ పాదం ఎటుచూసిన మనవైపే చూసే శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యమున్న ఇతిహాసాలు నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఆలయంలో మొత్తం 878 స్తంభాలు ఉండగా ఒక్కో స్తంభం ఒక్కో చరిత్రను ప్రస్పుటించేలా శిల్పులు చెక్కారు. ఆలయం గర్భగుడి పైకప్పుపై సహజ రంగులతో 24 అడు గుల పొడవు. 14 అడుగుల వెడల్పుతో గీచిన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం ఆసియాలోనే అతి పెద్ద చిత్రంగా ప్రఖ్యాతి చెందింది. ఆలయంలో వీరభ ద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లు ప్రధాన దేవ తలు.

విశేషం. ఈ ఆలయం కట్టక ముందే ఇక్కడ సీతాదేవి మోపిన పాదం, రాముడు ఆంజనేయుడు, చోళరాజు, ఆగస్త్య మహర్షి ప్రతిష్టించిన లింగాలతో పాటు వీరభద్రుడు స్వయంభు వుగా వెలసిన లింగం ఉంది. ఇలా బర్కడ ఐదు లింగాలు, సీత మ్మపాదం ఒకేచోట ఉండటం చూసిన విరూపణ్ణ అచ్యుతదేవరా యలు అనుమతితో ఆలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఆలయం మొత్తం ఏడు ప్రాకారాల్లో నిర్మించగా ప్రస్తుతం మూడు ప్రాకారాలు మాత్రమే

కనబడతాయి

ప్రపంచంలోనే పెద్ద ఏకశిలా నంది

విజయనగర రాజుల కాలంలో లేపాక్షిలో చెక్కిన ఏకశిలా రాతి నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నంది విగ్రహం 27అడుగుల పొడవు, 18అడు గుల వెడల్పు ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు మైసూరు చాముండి హిల్స్, బెంగళూరు నంది విగ్రహాలు ఉన్నాయి.

Date : 24/01/2021 EditionName : ANDHRA PRADESH( ANANTAPUR. ) Page

Sunday, December 20, 2020

మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామి



మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామి

దక్షిణ భారతదేశంలోని శివాలయాల్లో శివుడు లింగాకృతిలో ఉండగా అమరాపురం మండలం హేమావతి సిద్దేశ్వరాలయంలో మానవాక్ృతిలో (విగ్రహం రూపంలో) కొలువుదీరడం విశేషం క్రీ. శ. 730లో నోళంబ పల్లవులు హేమావతిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో హేమావతిని యెంజేరు పట్టణంగా అనంతరం హైమవతిగా కాలక్రమేణ హేమవతిగా పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయంలోని శిల్పాలు నల్లని రాతితో చూడచక్కగా మలిచారు. గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా నంది విగ్రహాలు, శివలింగాలు లభ్యమవుతుంటాయి. విలువైన శిల్పాలను 50 ఏళ్ల కిందట మద్రాసు మ్యూజియానికి తరలించారు. ప్రస్తుతం రూ.50 లక్షలతో నిర్మించిన భవనంలో శిల్పాలను భద్రపరిచారు. శివుడు సిద్ధాసనం భంగిమలో కూర్చొని ఉన్నందున సిద్ధేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఏటా మహాశి వరాత్రి నుంచి 9 రోజులపాటు శిరాత్రి మహోత్సవాలు ఆల యంలో ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు




నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి






       ప్రేమ శాంతి ధర్మం సహనం సమత మమత సేవాతత్పరతకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తి నాటి గొల్లపల్లే సత్యసాయి జన్మించిన గ్రామం. చిత్రావతి నది ఒడ్డున కొండకోనల్లోని గొల్లపల్లి లోని సామాన్య కుటుంబంలో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజు దంపతులకు సత్యసాయి 1926 నవంబర్ 23న జన్మించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్యుడిగా పూజలందు కుంటున్నారు. నాడు గొల్లపల్లిలో అధిక శాతం యాదవులు గోవులను పోషించేవారు. ఒక యాదవ యాజమానికి చెందిన ఆవు మేతకు వెళ్లి, ప్రతి రోజూ పుట్టలోని పాముకు పాలు ఇచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఆవులు పాలు ఇచ్చేవి. ఈ ఆవు పాలు ఇచ్చేది కాదు. ఆవు మధ్యాహ్న సమయంలో పుట్టవద్దకు వెళ్లి, పాముకు పాలు ఇస్తుండగా యజమాని గమనించి పామును రాయితో చంపాడు. పాము చనిపోతూ గొల్లపల్లి.. పుట్టలమయంగా మారాలని శపించిందట. పుట్టవద్ద ఉన్న రాతికి ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వేణు గోపాలస్వామి ఆలయం నిర్మించారు. అలా పుట్టపర్ధిని కాస్తా పుట్ట పర్తిగా ప్రసిద్ధికెక్కింది.

Thursday, October 22, 2020

పాపాగ్ని నది


చిన్నారులూ


       పాపాగ్ని నది  సత్యసాయి జిల్లా కు సుమారు 180కి.మీ దూరం నందికొండల్లో పుడుతుంది.ఈ నంది కొండలు కర్నాటక రాష్ట్రంలో  చిక్కబళ్లాపూర్ అనే జిల్లాలో ఉన్నాయి.
       వానలు బాగా పడితే ఈ నదిలో నీళ్లు బాగా పారి కర్నాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాలో ఉండే భూములకు నీళ్లిస్తుంది.అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కు వస్తుంది.మళ్లీ అక్కడి నుంచి సత్యసాయి జిల్లాలో అమడగూరు,తనకల్లు, నల్లచెరువు,కదిరి, ముదిగుబ్బ, తలుపుల,నంబులపూలికుంట మండలాల్లో పారుతుంది.తరువాత   అన్నమయ్య జిల్లాలోని గాలి‌వీడు మండలంలోకి పోతుంది.
      అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలో పాపాఘ్ని నదిపై  వెలిగల్లు రిజర్వాయర్‌కు నిర్మించారు. దీనికి ‘వైఎస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’గా పేరు పెట్టారు. 
     పాపాగ్ని నది అక్కడి నుండి వైఎస్సార్ జిల్లాలో గండి అనే ఊరు మీదుగా వెళుతుంది.ఈ నది ఒడ్డునే గండిలో   ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. ఇది మెల్లగా కమలాపురం మండలంలో పెన్నా నదిలో కలుస్తుంది.అంటే ఈ నది పెన్నానది కి ఉప నదన్నమాట.
     ఈ నది కి వానలు పడి నీళ్లు  వస్తే 8250ఎకరాల నేలలో పంటలు పండించుకోవచ్చు.

___ కుమారస్వామి,9490122229

Tuesday, September 29, 2020

అనంతపురం జిల్లాలో చారిత్రక సాహిత్యం


అనంతపురం జిల్లాలో చారిత్రక సాహిత్యం

        కల్లూరి వెంకటనారాయకవి 'శాంతి సామ్రాట్' పేర అశోకచక్రవర్తి చరిత్రను రచించాడు. కుంటి సుబ్రహ్మణ్యశర్మ 'విశ్వజ్యోతి' పేరుతో బుద్ధచరిత్రను రాశారు. 'లేపాక్షి' శిల్ప కావ్యాన్ని కిరికెర భీమారావు, చింకాయ గొందికి చెందిన జయరామిరెడ్డి 'కబీరు' కావ్యాన్ని రచించారు.
        విశ్రాంత ఉపాధ్యాయుదైన విద్వాన్ దస్తగిరి ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, స్వాతంత్ర్యపోరాట యోధుడు ఐదుకల్లు సదాశివన్' జీవిత చరిత్రనుఅక్షర బద్ధం చేశారు. అలాగే మరొక కమ్యూనిస్టు యోధులు వి.కె. ఆదినారాయణరెడ్డి, నీలం రాజశేఖర రెడ్డి, జీవిత చరిత్రలను విద్వాన్ దస్తగిరి గ్రంథస్తం చేశారు. బత్తిన వెంకటరామిరెడ్డి కూడా జిల్లాలో వున్న ప్రముఖ సాహితీ మూర్తులు,స్వాతంత్ర్య పోరాట యోధుల జీవిత చరిత్రలను గ్రంథస్తం చేశారు.