Monday, August 31, 2020

ఆ పేరెలా వచ్చింది?


‌   
         

         రాయలసీమలో ప్రతి పల్లెకు, చెరువుకు, నదికి, కొండకు, కోనకు, గుహకు, బండకు, కోటకు, గ్రామ దేవతకు,శిష్టదేవతకు, ఒక్కొక్క పేరు వుంటుంది. ఆ పేరెలా వచ్చిందని   ఆ ప్రాంత వాసుల్ని కదిపితే  ఆసక్తి కరమైన ఒక కథ చెబుతారు.సాధారణంగా వ్యక్తుల పేర్లను బట్టి, ఇంటి పేర్లను బట్టి, కులం పేర్లను బట్టి, మిట్ట పల్లాలను బట్టి, పరిమాణాన్నిబట్టి ఊర్ల  పేర్లు ఏర్పడ్డాయి.

అనంతపురం 

            ఈ నగరాన్ని కర్ణాటకకు చెందిన నడియార్ వంశానికి చెందిన అనంతరసు అనే రాజు పాలించాడు.ఆయన పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది.

బుక్కరాయసముద్రం

          విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు,బుక్కరాయలలో బుక్కరాయలు అనంత పురానికి దగ్గరలో ఒక చెరువు త్రవ్వించినారు.ఆయన పేరు మీద  బుక్కరాయ సముద్రం అనే వూరు ఏర్పడింది.ఇప్పుడది అనంతపురం జిల్లాలో ఒక మండలం.

పుంగనూరు 

              రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో లో పుంగనూరు అనే ఊరు ఉంది. పుంగనూరు అసలు పేరు పుంగ పురి. ఈ ఊరు పూర్వం పరుశురామ క్షేత్రం గా పేరుగాంచింది. చోళుల కాలంలో దీనిని పులనాడు అనేవారు.
            పుంగన్ లేదా పుంగవన్ అంటే తమిళంలో
మునిశ్రేష్టుడని అర్థం. ముని పుంగవుడైన వాల్మీకి ఈప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్నారని ప్రతీతి. అందుకే ఆయన పేరుతో పుంగన్ +ఊరు = పుంగనూరు అయిందని చెపుతారు. పుంగనూరు ప్రాంతంలో పుంగ(కానుగ) వృక్షాలు ఎక్కువగా వుండడం వల్ల 'పుంగనూరు' అనే పేరు వచ్చివుండవచ్చని మరి కొందరి వాదం. పుంగం అంటే ఎద్దు. ముందునుంచి పుంగనూరు ఒక ప్రత్యేకమైన జాతి ఆవులకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ఊరికి పుంగనూరు అనే పేరు వచ్చిందంటారు.
               ఇంకా కొంతమంది. 'వలవనారాయణ చతుర్వేది
మంగళం' అనే పేరుగల ఊరిని పుంగమ్మ అనే రాణి ఏలినందు వల్ల ఆమె పేరుతో పుంగమ్మ ఊరు పుంగనూరుగా మారిందని చెపుతారు. పుంగమ్మ పేరు మీద ఈ ప్రాంతంలో అత్యంత
ప్రచారంలో వున్న కోలాట పదం చూడవచ్చు.
         ఏమే భామా! భామా నీ పేరేమి?
         నీ ఊరు పేరేమి? నిలిచి మాట్లాడు! అని అడిగితే
         ఊరు గొప్పదిరా! ఉగ్రచందికరా
        పుంగమ్మ ఏలేటి పుంగనూరు మాదిరా! అని
సమాధానం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే వలవనారాయణ
చతుర్వేది మంగళాన్ని ధైర్య సాహసాలకు మారుపేరైన
పుంగమ్మ అనే రాణి ఏలిందని, ఆమె పేరుతోనే 'పుంగనూరు' ఏర్పడిందని తెలుస్తోంది.
          పుంగనూరులో చారిత్రాత్మకమైన ఒక చెరువు వుంది. ఈ చెరువు పేరు పూర్వం 'రాజేంద్ర సోళపేరేరి' వర్షాలు ఎక్కువై చెరువుకు గండి పడింది. చెరువు తెగితే ఊరు ఊరే కొట్టుకుపోతుంది. ప్రజలు ఎంత కష్టం పడ్డా గండిని పూడ్చ లేకపోయారు. చివరకు పుంగమ్మ తను పరిపాలిస్తున్న ప్రజల కోసం గండికి అడ్డుపడి, తనపై కట్ట కట్టమంది. ప్రజలు విధిలేక ఆమెపై మట్టితో గండిని పూడ్చారు.  తమకోసం పుంగమ్మ తన ప్రాణాలను త్యాగం చేసినందువల్ల  అక్కడే నది కట్టమీద  ఆమె శిలా విగ్రహాన్ని పెట్టి, చిన్న గుడిని కట్టించి పూజిస్తున్నారు. పుంగమ్మ సత్యంవున్నంతకాలం ఈ కట్ట తెగదని ఆ ఊరి ప్రజల నమ్మకం. ఆనాటి నుంచి రాజేంద్ర సోళ పేరేరి పుంగమ్మ చెరువు గా పేరు మారింది.


___ పిళ్లా కుమారస్వామి
               9490122229



Saturday, August 29, 2020

అనంతపురం అభివృద్ధికి అడుగడుగునా అవరోధాలు




           1955-56 సం||లో అనంతపురం జిల్లా తలసరి ఆదాయం విషయంలో రాష్ట్ర సగటుకంటే
ఒక మెట్టుపైనే ఉంది. అప్పట్లో రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయంలో వ్యవసాయరంగం 57 శాతం,
పరిశ్రమలు 8శాతం, సేవల రంగం 53శాతాన్ని సమకూర్చాయి. 22సం||ల తర్వాత 1977-78లో
రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం 1,018 రూపాయలు మాత్రమే వుంది. అంటే రాష్ట్ర తలసరి
ఆదాయంతో పోలిస్తే జిల్లా వెనుకబడి ఉంది. 2001 నాటికి ఈ అంతరం మరింత పెరిగింది.
1993-94 నుంచి 2000-01 సంవత్సరాల మధ్య రాష్ట్ర సగటు తలసరి ఆదాయం ఆరు శాతం
చొప్పున పెరిగింది.అనంతపురం జిల్లా విషయంలో ఇది కేవలం నాలుగుశాతం ఉంది.1955-56లో రాష్ట్ర సగటు కంటే ముందున్న అనంతపురం జిల్లా 1977-78నాటికి 98శాతానికి, 1990 దశకంలో 92 శాతానికి పడిపోయింది. అంటే ఆర్థికాభివృద్ధి పరుగు పందెంలో జిల్లా తలసరి వెనకబడుతున్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అనంతపురం జిల్లాను ఆదుకునేందుకు చర్యలు :

జై సల్మీర్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలి.

డి.డి.పి.కి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించి ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారిని నియమిస్తే పరిస్థితి మెరుగు
పడవచ్చు అంతేకాక ప్రతియేటా కనీసం 300 కోట్లు రూపాయలు కేంద్రం గ్రాంటుగా మంజూరు
చేయాలి.

పంటల బీమా పథకం మార్చాలి. ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అవసరమైతే
నేషనల్ లిమిట్ రిలీఫ్ ఫండ్ నుంచి ప్రీమియం చెల్లించాలి.


అనంతలో నీటిపారుదల రంగం



రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అనంతపురం జిల్లా, 19130 చదరపు కిలోమీటర్లు వైశాల్యం
కలిగింది. 27 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. మూడున్నర లక్షల ఎకరాలకు మాత్రమే
సాగునీటి వసతి ఉంది. అందులోనూ గాలిలో దీపంలాంటి భూగర్భ జలాల మీద ఆధారపడి
వుంది. అంటే 24లక్షల ఎకరాల్లో వర్షాధారం మీద ఆధారపడే రైతులు పంటలు సాగుచేస్తున్నారు.
జిల్లాలో సగటున పడే 550మిల్లీమీటర్ల వర్షపాతం కూడా సక్రమంగా నమోదవడం లేదు. దీంతో
తరచూ కరువులు ఏర్పడుతున్నాయి. గడిచిన 17 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు కరువొచ్చింది.
దాదాపు ప్రతి ఏటా  కరువే.
        అనంతపురం జిల్లాలో పెన్నార్ పరివాహక ప్రాంతంలో అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్,పాపాగ్ని,
చిత్రావతి, తడకలేరు, కుందేరు, , సగిలేరు,చెయ్యేరు, లోయర్ పెన్నారు అని పదినదులున్నాయి.అయితే గడిచిన దశాబ్దకాలంలో చూస్తే వీటిల్లో నీరు ప్రవహించిన దాఖలాల్లేవు. 
          తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా వచ్చే 22 టిఎంసిలే జిల్లాకు ఏకైకా జలాధారంగా ఉంటోంది. అరకొరగా కురిసిన వర్షాలతో నిండే చెరువులు, కుంటలు, భూగర్భజలాలే జిల్లాకు సాగునీటి వనరుగా ఉంటున్నాయి.1972లో ఇరిగేషన్ కమీషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం 1000 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ భూమిలో కనీసం 30 శాతం భూమికి నమ్మకమైన సాగునీటిసౌకర్యం కల్పిస్తే తప్ప దుర్భిక్ష ప్రాంతాలకు మనుగడ లేదని స్పష్టంగా పేర్కొంది. అయితే అనంతపురం జిల్లాలో ఏటా కురిసే సగటు వర్షపాతం 550 మిల్లిమీటర్లు కూడా ఉండటం లేదు. ఈ అత్యల్ప
వర్షపాతం కూడా అపనమ్మకమైనదని ప్రతి ఏటా కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
ఇక సాగునీటి వసతి అయినా ఉందా అంటే అదీ లేదు. మూడు లక్షల ఎకరాల్లోపే సాగునీటి
వసతి ఉంటోంది. జిల్లా మొత్తంగా 27 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే కేవలం మూడు లక్షలఎకరాల్లోపు భూమికే సాగునీటి వసతి ఉంది. అంటే పది శాతం లోపే సాగునీటి వసతి ఉందన్నదిస్పష్టమవుతోంది.

అనంతపురం జిల్లాలో ఆనకట్టలు


తుంగభద్ర ఎగువకాలువ

         25 లక్షల ఎకరాల వర్షాధార సాగుభూమి 
ఉన్న ఈ జిల్లాలో ఒక లక్షా నలభైవేల ఎకరాలకు 
ఈ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి రూపొందించారు.
         ఏవిధంగా అయితే కోస్తా ప్రాంతంలో నీటి వనరులు కల్పించి కరువులను పారదోలినారో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి వనరులను కల్పించి కరువులను పారదోలాలని బ్రిటిష్ వారు ఆలోచించారు. ఆ రోజుల్లో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాలు బళ్లారి జిల్లాలో వుండేవి. అవన్నీ తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతాలే. అనంతపురం, కడప జిల్లాలలో ప్రవహించే పెన్నా బేసిన్లో నీళ్ళు లేవు. కనుక పెన్నా బేసిన్ కు నీరు మళ్లించాలని మద్రాసు ప్రభుత్వం 1901లో సర్ కాలిన్ సి. స్కాట్ అధ్యక్షతన ఇరిగేషన్ కమిషన్ నియమించింది. ఈ
కమిషన్ మల్లేశ్వరం వద్ద తుంగభద్రనది మీదుగా ఒక పెద్ద ఆనకట్ట కట్టి కృష్ణా, పెన్నా బేసిన్లు కలపాలని, సమగ్రమైన కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిమీద కల్నల్ కాలిన్ మెకంజీ 300 టిఎంసిల సామర్థ్యంతో మల్లేశ్వరం వద్ద,60టిఎంసిల సామర్థ్యంతో గండికోట(పెన్నానది) వద్ద రిజర్వా యర్లు నిర్మించాలని పథకం రూపొందించాడు.   
          1905-06లో కర్నూలు జిల్లాలోని సిద్దేశ్వరం వద్ద ఒక ఆనకట్ట (కృష్ణా నదిమీద) నిర్మించాలని కూడా మెకంజీ ప్రతిపాదించాడు. ఇప్పుడు సీడెడ్ జిల్లాలు (రాయలసీమ, బళ్లారి) నిజాం ఆధీనంలో వున్నందున 28.02.1845లో ప్రిన్స్ ఆఫ్ బేరార్ ఎడమగట్టు వైపున, మద్రాసు ప్రభుత్వం తరపున సర్ ఆర్థర్ హాప్ కుడిగుట్టు వైపున శంకుస్థాపన చేశారు. అనేక సామాజిక, రాజకీయ, సాంకేతిక కారణాలవల్ల పథకం ముందుకు సాగలేదు. స్వాతంత్రం వచ్చిన తరువాత మైసూరు, మదరాసు రాష్ట్ర ప్రభుత్వాలఉమ్మడి ప్రాజెక్టుగా కొనసాగిన తుంగభద్ర ప్రాజెక్టు 1969కిగానీ పూర్తికాలేదు. 230 టిఎంసిల సామర్థ్యానికి కుదించిన ప్రాజెక్టు ద్వారా తుంగభద్ర ఎడమ కాలువద్వారా కర్నాటక రాష్ట్రంలో
10కిలోమీటర్ల పొడవు సాగే కాలువతో 17.5 టిఎంసిలు కర్నాటకకు, 32.50 టిఎంసిలు
ఆంధ్రరాష్ట్రానికి కేటాయించారు. 

32.50టిఎంసిలకు గానూ అనంతపురం జిల్లాలకు నికరంగా
కేటాయింపులు 21.40టిఎంసీలు మాత్రమే. మిగతా నీరు  కడప, కర్నూలు జిల్లాలకు అయితే రిజార్వాయరు పూడికవల్ల కేటాయింపుల నీరు రావడంలేదు.
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%97%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%86%E0%B0%A8%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F
పి.ఎ.బి.ఆర్ (పెన్న అహోబిలం బాలెన్సింగ్ రిజర్వాయర్)

దీనిని పెన్నానదిమీద కొర్రకోడు వద్ద 11 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. దీనికి ప్రత్యేక నీటి కేటాయింపులు లేవు. హెచ్ఎల్ సి నీటిని దీనిలో నిల్వచేసి వాడుతారు. తుంగభద్ర డ్యాము ద్వారా కెసి కెనాల్ కు కేటాయింపులున్న 10టిఎంసిలు దీనికి కేటాయించారు. వాస్తవానికి అవి రావడం లేదు.

PABR Dam

Penna Ahobilam Balancing Reservoir (PABR)is an irrigation project located across Penner River in Anantapur district of Andhra Pradesh state in India. Anantapur city gets its drinkingwater from the PABR. The reservoir with live storage capacity of 305 million cubic metres is mainly fed by Tungabhdra high level canal originating from the Tungabhdra Dam to the extent of 10 Tmcft water. A 20 MW hydro electric power station is also constructed at the dam site. After the death of eminent irrigation engineer K. Sriramakrishnaiah in the year 2002, the Penna Ahobilam balancing reservoir is renamed in memory of him as sriramakrishnaiah dam

భైరవాని తిప్ప ప్రాజెక్టు

జిల్లాలో ఎగువ కాలువ తర్వాత రెండవ నికర జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టు ఇది.
గుమ్మగట్ట మండలంలో వేదవతి (హగరినది కృష్ణాకు ఉపనది) నది మీద ఈ ప్రాజెక్టును 1961లో
నిర్మించారు. దీనికి 4.90 టిఎంసిల నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు క్రింద
12,880ఎకరాల భూమి ఉంది. కానీ ఈ ప్రాజెక్టుకు 1962 నుండి ఒక్కసారి తప్ప ఎప్పుడూ నీరు
వచ్చిన పాపానపోలేదు. దీనికి హంద్రీనీవా ద్వారా నీరు నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి
డి.పి.ఆర్ కూడా నిర్మించారు.

The Bhairavanithippa project was constructed across Pedda hagari (Vedavathi) river at Bhairavanithippa (V) in Gummagatta (M) in the year 1961 at an estimated cost of Rs.1,43,75,000/- The hagari river which is a tributary of Tungabhadra river takes its origin in the Baba budamagiri range hills of the western ghats in Karnataka state and flows in the territory for a length of 138 miles and enters into Andhra Pradesh state. This project is located at 1.50 km below Andhra Pradesh border.

The Karnataka state Government constructed a dam called Vani vilas sagar project at about 68 miles upstream of B T Project with a storage capacity of 850 M cum(30.025 TMC). The B T Project was designed taking in to consideration of yield from catchment area of 14,386 sq kms located in between vani vilas sagar project and B T Project. The river hagari runs for another 170 kms below the project and joins the Tungabhadra river at Siriguppa village in Karnataka State.

The B T Project was designed to irrigate 12,000 acres (4856 Ha) through two canals located on either side of reservoir. The left flank main canal (LFMC) is designed for a discharging capacity of 5.125 cumecs (181 cusecs) and the canal runs 25 kms length to serve an ayacut of 8240 acres (3334 Ha) through 22 sluices and feeds three tanks namely 1. K V Tank 2. Kalugodu tank 3 Basetty tank. The right flank main canal (RFMC) is designed for a discharging capacity of 2.35 cumecs (83 cusecs) and the canal runs for a length of 13.80 kms to serve an ayacut of 3760 acres(1522 ha) spread over in 14 villages in Brahmasamudram mandal through 16 sluices and 8 direct pipes having an ayacut less than 40 ha under each of them.

The modernization of Bhairavanithippa project was proposed with financial assistance of Japan International Co Operatiion Agency (JICA) Phase II Programme to take necessary steps for improving the canals and distributory system by doing lining and restoration. The estimate for the above work was technically sanctioned by the Engineeer-in Chief, medium Irrigation, Hyderabad vide CE(I) No 02/2011-12 dated 02-05-2011 for Rs 1482.47 lakhs. Tenders were invited and C O T was also approved in favour of M/S H.E.S infra Pvt. Ltd., Hyderabad who has quoted at 2.79% excess over the ECV of Rs 13,80,69,527/- and TCV of Rs 14,19,21,666/- . The agreement was concluded on 16-02-2012, vide agt. No 24 SEA/2011-12.

Approximately 60% of work is completed and now the work is in 3rd extention of time and is scheduled to be completed by December 2015.


ఎం.వి.ఆర్ ప్రాజెక్టు 

ఎగువకాలువ స్టేజీలో భాగంగా పెన్నానది మీద 5.17 టిఎంసిల సామర్థ్యంతో దీనిని
నిర్మించారు. సుబ్బరాయసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు. హెచ్ఎల్ సి స్టేజీలో భాగంగా  42టిఎంసిల సార్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ఇది.

ముచ్చుకోట బ్యాలెన్సింగ్ రిజర్వాయరు.

హెచ్ఎ సి స్టేజీలో భాగంగానే , 65 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన మరొక బ్యాలెన్సింగ్
రిజర్వాయరు ఇది.
2018 లో మొదటి సారి గేేట్్ల ఎత్తి న దృశ్యం చేే

యోగివేమన ప్రాజెక్టు

ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణపల్లి దగ్గర మద్దిలేరు నదిపై 0.600టిఎంసిలసామర్థ్యంతో 12,880ఎకరాల సాగుకోసం దీనిని నిర్మించారు. 2001లో పూర్తయినప్పటి నుండి ఒక్క సంవత్సరం కూడా ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు. ఇది కేవలం చేపల పెంపకానికి మాత్రమే పనికి వస్తుందని స్థానికులు అభిప్రాయ పడు తున్నారు.

పెన్నా - కుముద్వతి ప్రాజెక్టు :

హిందూపురం ప్రాంతంలో హిందూపురం, పరిగి మండలాల్లో ఆరు వేల ఎకరాలకు సాగునీటిని
అందించే లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టారు. పెన్నానదిలో దాని ఉపనది అయిన కుముద్వతి నదికలిసే చోటున 7 చెరువుల ద్వారా 6126 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి
1948-56లో నిర్మించిన ప్రాజెక్టు ఇది. ఇది కూడా చారిత్రక కట్టడంగానే మిగిలిపోయింది.

అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు:

రామగిరి మండలంలో పెన్నానది మీద పేరూరు వద్ద 1956లో 10,048 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి 1,574 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఇది. ఎనిమిది మండలాలకు ప్రయోజనం చేకూర్చగలిగే ఈ ప్రాజెక్టుకు ఒక్కసారి మాత్రమే నీరు వచ్చినట్లు రైతులు జ్ఞాపకం చేసుకుంటారు. హంద్రీనీవా ద్వారా నీటిని ఈ ప్రాజెక్టుకు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

చెన్ననారాయణస్వామి గుడి ప్రాజెక్టు (సి.జి.ఆర్. ప్రాజెక్టు):
తనకల్లు మండలంలో పాపాఘ్ని నదిమీద 1960లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 900 ఎకరాలకు నీరు అందాలి. అయితే ఇది కూడా చారిత్రక కట్టడమే.

పెండేకళ్లు, చాగళ్లు రిజర్వాయరు :

పెన్నానదిపై 1,50టిఎంసిల సామర్థ్యంతో పెండేకల్లు రిజర్వాయరు నిర్మాణం జరిగింది.ఈ ప్రాజెక్టుకు నీరు చేరింది లేదు. ఎంపిఆర్ ద్వారా నీటిని విడుదల చేయాలని చూసినా విడుదలచేయలేదు. పెండేకల్లు బ్యాలెన్సింగు రిజార్వయరును పిఎబిఆర్ రెండో దశ కింద చేపట్టారు.దీనికి నీరు ఇచ్చే పరిస్థితి లేదు.


అనంత కరువుల చరిత్ర





           అనంతపురం జిల్లాలో ఏర్పడుతున్న   కరువులన్నీ నీరు లేక ఏర్పడుతున్నవే. గ్రామీణ ప్రాంతాలలో ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడినా వర్షం గురించిన ప్రస్తావన వస్తుంది. నీటి కరువు ఈనాటిదేం
కాదు. కరువులు జిల్లా ప్రజలకు వారసత్వ సంపదగా ఉన్నాయి. కరువు ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో విడదీయరాని భాగంగా మారిపోయింది. అందుకే కరువుల ప్రసక్తి లేకుండా అనంతపురం జిల్లా చరిత్ర ఉండదు. 
          చరిత్ర తెలిసినప్పటి నుంచి  నీటికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడి ఉంది. అందుకే నీటి కరువు నుంచి ఉపశమనం కలిగించడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.
           వీలయినచోటల్లా చెరువులు, కుంటలు తవ్వించారు. వర్షాలు ముఖం చాటేసినప్పుడు ఈ చెరువులు, కుంటలు కూడా ఎండిపోయేవి. మనకు తెలిసినంత వరకూ 1792-93 నుంచి 1942-43
వరకూ 18 తీవ్రమైన కరువులు ఈ ప్రాంతాన్ని పీడించాయి. 1833లో వచ్చిన కరువులో ప్రజలు
తిండి దొరకక చింత గింజల, కలబంద గుజ్జును తినేవారని అనంతపురం జిల్లా 1970-253
గెజిట్ లో పేర్కొన్నారు.
         1876లో దక్షిణ భారత దేశమంతా కరువు విస్తరించింది. దానినే ధాతుకరుపు లేదా, డొక్కల కరువు అని అంటారు. తిండి లేక ప్రజలు, గడ్డి లేక పశువులు మృతిచెందితే వాటి శవాలు ఎక్కడ చూసినా కనపడేవంటారు. బ్రిటిష్ ప్రభుత్వం అన్నార్తుల కోసం కదిరి నరసింహస్వామి
దేవాలయంలో గంజి కేంద్రం ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కాలినడకన బారులు
కట్టిన వృద్ధులు, పసిపిల్లలు దారిలోనే పిట్టల్లాగా రాలిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఇంత తీవ్రమైన
పరిస్థితుల నుంచి సహాయక చర్యలు తీసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల స్థితిగతులు పరిశీలించడానికి 1898లో ఒకటి, 1901లో మరొకటి ఫ్యామిన్ కమిషన్లను ఏర్పాటు చేసింది.
        అనంతపురం జిల్లాలో కూడా పర్యటించిన కమీషన్  సహాయక చర్యలతో పాటు అనంతపురం జిల్లాలో తుంగభద్ర కాలువలను పొడిగించాలని సిఫారసు చేయడం జరిగింది. ఆనాటికి తుంగభద్ర ప్రాజెక్టు లేదు. నది మీద చిన్న చిన్న ఆనకట్టల ద్వారా బళ్ళారి, రాయచూరు ప్రాంతాలకు కాలువల ద్వారా నీటిని మళ్లించేవారు. అట్లాగే ఈ ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యల స్థాయిని కూడా పరిశీలించి తమ అసంతృప్తిని వెల్లడించారు. మరింతగా సహాయక చర్యల్ని విస్తరించాలని నివేదికల ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ప్రాంతాల కంటే అనంతపురం జిల్లాలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
           జిల్లా  రైతాంగాన్ని పీడిస్తున్న కరువు బారి నుంచి రక్షించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో పెద్ద ప్రయత్నాలే జరిగాయి. సాగునీటి పితామహుడు అయిన సర్ అర్ధర్ కాటన్ తుంగ్రభద్ర నది మీద ఒక ఆనకట్ట కట్టి ఈ ప్రాంతానికినీరందించా లని 1860లోనే ప్రణాళికల్ని రూపొందించారు.
గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి ఉభయగోదావరి జిల్లాను సస్య శ్యామలంచేయాలని భావించిన మహాశయుడే ఈ కాటన్. ఈ ప్రాంతాన్ని కరువుల బారి నుంచి శాశ్వత విముక్తి కలిగించడానికి బ్రిటిష్ ప్రభుత్వపు ఆలోచనల నుంచి ఉద్భవించినదే ఈ తుంగభద్ర ప్రాజెక్టు. అందుకే కాటన్ 1864లో రాసిన "పబ్లిక్ వర్క్స్ ఇన్ ఇండియా"లో పలు విషయాలను వెల్లడించారు.
        బంగారం కంటే ఇండియాలో నీరు చాలా విలువైనవనంటాడు. నీటి విలువ తెలిసిన వారుకావడం చేతనే సాగునీటి వనరుల కల్పనకై పరితపించారు. నీరు ప్రకృతి సంపద. ఈ ప్రకృతి సంపదకు సరిహద్దులు లేవు. ఏ ప్రాంతపు ప్రజలకు నీరు అత్యంత అవసరం ఉంటుందో వారికిప్రాధాన్యతా క్రమంలో మొదటగా నీటిని అందించాల్సి ఉంటుంది. ఆ కారణంగానే తుంగభద్ర నది ద్వారా కరువు ప్రాంతాలకు నీటి వసతిని కల్పించారు. దాని తర్వాత జిల్లాలో 37 మండలాల ద్వారా సాగే పెన్నా నది దాని ఉపనదుల మీద చిన్నా చితకా ఆనకట్టలుగానే ఈ నాడు మిగిలిపోయి ఉన్నాయి.

Friday, August 28, 2020

అనంతపురం జిల్లా లో కరువు,వెనుక బాటుతనం_ పరిష్కారాలు


అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు  చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ. మాత్రమే. జిల్లాలో సగటు ఆవిరి నష్టం 1850 మిల్లీమీటర్లు.
భూమి మీద పడిన నీరు ఆవిరై పోతుంది. జిల్లాలో ఏ మండలంలో కూడా సహజమైన నీటివనరులు లేవు.మొత్తం గ్రామాలన్నీ తాగునీటి కోసం బయటి నుంచి వచ్చే నీటి మీద ఆధారపడా ల్సిందే.జిల్లాలోని రిజర్వాయర్ల సామర్థ్యం 24 టీఎంసీలు మాత్రమే. చెరువులు కుంటలది 16టిఎంసిలు.   అంటే 25 లక్షల ఎకరాల్లో వర్షాధారం మీద ఆధారపడే రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఈ సాగుభూమికి ఆరుతడి కింద ఒక పంటకు నీళ్లు ఇవ్వాలంటే 250 టిఎంసిల నీళ్లు కావాలి. తాగునీటి కోసం కనీసం 30 టీఎంసీల నీరు కావాలి .ఇది ఈ జిల్లా అవసరం.
               అనంతపురం జిల్లాలోని పెన్నార్ పరివాహక ప్రాంతంలో అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్, చిత్రావతి, తడకలేరు, కుందేరు, పాపాగ్ని, సగిలేరు, చెయ్యేరు, లోయర్ పెన్నేరు అని పది నదులున్నాయి. అయితే గడిచిన దశాబ్దకాలంలో చూస్తే నీరు ప్రవహించిన దాఖలాల్లేవు.
పేరుకు నదులే గాని ఇందులో నీళ్లుండవు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా వచ్చే 22 టిఎంసిలే జిల్లాకు ఏకైకా జలాధారంగా ఉంటోంది. అరకొరగా కురిసిన
వర్షాలతో నిండే చెరువులు, కుంటలు, భూగర్భజలాలే జిల్లాకు సాగునీటి వనరుగా ఉంటున్నాయి. అందుకే జిల్లా అంతా అడుగంటిన భూగర్భ జలాలు పచ్చదనం కానరాని కొండలు మనకి కనిపిస్తూ ఉంటాయి.
       జిల్లాలో సగటున పడే వర్షపాతం  550 మి.మీ. ఇది     కూడా సక్రమంగా పడడం లేదు. వాగులు వంకలు పారవు.
దీంతోతరచూ కరువులు ఏర్పడుతున్నాయి. గడిచిన 17 సంవత్సరాల్లో 14 సం.లు కరువొచ్చింది.గత నాలుగు సంవత్సరాలుగా కరువే.

     కరువుతో కేవలం తిండి కొరత,నీటి కొరత మాత్రమే ఏర్పడవు.అది జీవించేందుకు అనేక అమానవీయ పరిస్థితులు ఉత్పన్నం చేస్తుంది.దీని వలన జిల్లాలో రెండు సామాజిక సమస్యలు ముందుకు వచ్చాయి. ఒకటి వలసలు. రెండు మహిళల అక్రమ తరలింపు. వ్యవసాయం తిరోగమనం చెందడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో దళిత బలహీన వర్గాలకు జీవనోపాధి కరువైంది. దాంతో వలస మార్గం చేపట్టారు.కొంతమంది కేరళకు అడుక్కోవడానికి వెళ్లారు.మరికొంతమంది బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ లాంటి నగరాలకు పనులకోసం వెళ్లారు. ముస్లిం కుటుంబాల నుంచి ఆ తర్వాత వెనుకబడిన కులాల నుంచిపూనే,ముంబయి నగరాలకు  అమ్మాయిల    తరలింపు మొదలైంది. ఆర్థిక సంక్షోభాలను నివారించవచ్చు లేదా రూపుమాపవచ్చు కానీ దిగజారిపోయిన సాంఘిక విలువలను, జీవన పరిస్థితులను మెరుగు పరచడం సులభమైన విషయం కాదు.
  ప్రతి ఏటా వచ్చే కరువులను పారద్రోలడానికి బ్రిటీష్ వారు ప్రయత్నంచేశారు.అనంతపురం, కడపజిల్లాలలో ప్రవహించే పెన్నా బేసిన్ లో నీళ్ళు లేవు కనుక పెన్నా బేసిన్కు నీరు మళ్ళించాలని మద్రాసు ప్రభుత్వం 1901లో సర్ కాలిన్. సి. స్కాట్ అధ్యక్షతన ఇరిగేషన్ కమిషన్ ను నియమించింది.ఈ కమిషన్ మల్లేశ్వరం వద్ద తుంగభద్ర నది మీదుగా ఓ పెద్ద ఆనకట్ట కట్టి కృష్ణా పెన్నా బేసిన్లు కలపాలని సమగ్రమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది.
దీంతో కల్నల్ మెకంజీ  300 టీఎంసీల సామర్థ్యంతో మల్లేశ్వరం వద్ధనూ, 60టిఎంసిలతో కడప జిల్లాలోని గండికోట వద్దనూ రిజర్వాయర్లను నిర్మించి
కృష్ణా నీటిని తరలించాలని ప్రణాళిక రచించారు. 1905_06 లో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నది మీద ఆనకట్ట నిర్మించాలని కూడా ఆయన ప్రతిపాదించాడు. ఇవి అమలై ఉంటే జిల్లాకు 60 నుంచి 70 టీఎంసీలు  నమ్మకంగా వచ్చేవి.
        తుంగభద్ర జలాశయాన్ని  1951 లో నిర్మించిననాటినుండి 1993 వరకు ప్రవాహములో కొట్టుకొని వచ్చిన ఒండ్రు మట్టి పూడిక వల్ల దాని నిల్వ సామర్థ్యం133 టి.యం.సి. నుంచి 119 టి.ఎం.సిలకి తగ్గింది. 1993 లో జరిపిన సర్వేలో దాని సామర్థ్యం 111.5 టి.ఎం.సి.లు.అందువల్ల దానిలో నీటి లభ్యత 212 టి.యం.సి.ల నుండి 170 టి.యం.సి.లకు తగ్గిపోయింది. ఈ ఒండ్రుమట్టి పేరుకొనడం నిరంతరం కొనసాగడం వలన ప్రతి సంవత్సరం రిజర్వాయర్ పరిమాణం 0.50 టి.ఎం.సి.లు తగ్గుతూ వస్తున్నది. నీటి లభ్యత తగ్గుతుండటం వలన జిల్లా కు రావలసిన నీటి కోటా తగ్గి ప్రస్తుతం ఎగువకాలువకు రావలసిన 32.50 టి.ఎం.సి.ల
నుంచి 26. 50 టి.ఎం.సి.కి తగ్గించబడింది.      
         తుంగభద్ర జలాశయం నుంచి 212 టి.ఎం.సి.లు నీరు కూడా రాష్ట్రానికి కేటాయించిన కృష్ణాజలాలలో ఇమిడి ఉంది. అందులో 73 టి.ఎం.సి.లు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు,  139 కర్నాటక కు   కేటాయించారు.
తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 32 టీఎంసీలు ఈ జిల్లాకు కేటా యించామని చెప్తున్నారు. కానీ ఇందులో వచ్చేది మాత్రం 20టి ఎంసి లు మాత్రమే. దాంట్లో కూడా ఆరు టిఎంసిలు కడప కర్నూలు కు పోతాయి. అంటే 14 టిఎంసిలే
అనంతపురానికి మిగిలేది.1950 లో ఈ పథకం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేశారు.అప్పట్లో మన ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కి ప్రాధాన్యత నిచ్చి ఎక్కువ విద్యుత్ ను తీసుకుని,దానికి బదులుగా తక్కువ నీటికి అంగీకరించింది.అది కూడా మనకు నీటి లభ్యత తగ్గి పోవడానికి కారణం.
         అనంతపురం జిల్లా 1050-1100 ఎం.ఎస్.ఎల్ ఎత్తైన ప్రాంతంలో ఉంది. మనకన్నా కృష్ణానది లోతట్టులో పారుతోంది. కృష్ణానీటిని మళ్ళించుకోవాలంటే ఎత్తిపోతల పథకాలు అమలు చేయాలి. కానీ తుంగభద్ర జలాశయం మనకన్నా ఎత్తులో ఉంది. దాదాపు 500 ఎం.ఎస్.ఎల్. తేడా వుంది. ఆ ప్రాంతం 633 ఎం.ఎస్.ఎల్ లో వుంది. నీటిని గురుత్వాకర్షణ ద్వారా మనం సులభంగా పొందవచ్చు. తుంగభద్ర, భీమా, హంద్రి, దిండి, మూసి ఉపనదులు ఉన్నాయి. కృష్ణాకు అధిక నీరందించే ఉపనది తుంగభద్ర మాత్రమే. కృష్ణానదికి 2390 టి.ఎం.సి అడుగుల నీరు లభిస్తున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ లెక్కవేసింది. నాలుగు రాష్ట్రాలకూ కృష్ణానది నీటిని కేటాయించేందుకు బచావత్ నేతృత్వంలో కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఉంది. లభిస్తున్న నీటిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 2060 టి.ఎం.సి. అడుగుల నీరు నికరంగా లభిస్తున్నట్లు లెక్కకట్టారు. ఇందులో తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్న 212 టి.ఎం.సి.లనీరు కూడా ఇందులో ఉంది. మిగులు జలాల కింద 330 టీ.ఎం.సి.ల నీటిని అంచనా వేశారు. ఈ నీటికి 25 శాతం విశ్వసనీయత ఉంటుంది. ఈ నీరు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మిగులు జలాలను ఏ ప్రాజెక్టుకు కేటాయించలేదు. అందువల్ల మిగులు జలాలు ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు లభించింది.
కృష్ణానది నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టి.ఎం.సి.లు, కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560 టి.ఎం.సి.ల చొప్పున కేటాయించారు. 
విభజన ఒప్పందం ప్రకారం 66:34నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు 512టిఎంసిలు, తెలంగాణ కు 299టిఎంసిలు పంచాలి.   
అయితే ఇంతవరకు మిగులు జలాలను ఉపయోగించు కోవటంలో మన రాష్ట్ర గత ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. 30 ఎళ్ళు గడిచిపోతున్నా, బచావత్ గడువు మీరిపోయినా ఆనీటిని ఇప్పటికీ సద్వినియోగం చేసుకోలేక పోయాము. ఆ నీటిని వినియోగించుకొని సాగునీటి పథకాలను సాగునీటి పథకాలను చేపట్టివుంటే నీటిపై హక్కు లభించేది. మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటైతే సమీక్ష చేసినప్పుడు ఆ ప్రాజెక్టులకు నీటికేటాయింపు లభించేది.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను ఉపయో గించుకుని గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఎస్.ఎల్.బి.సి., నెట్టెంపాడు, భీమా తదితర సాగునీటి పథకాలను రూపొందించింది. ఈ పథకాలన్నీ అమలు చేసినా కేవలం 240 టి.ఎంసి.ల మిగులు జలాలను మాత్రమేవినియోగించుకోవటం
సాధ్యమయ్యేది. కానీ ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడడానికి  కారణం ఇక్కడి ప్రజా ప్రతినిధులు అసలు  పట్టించుకోకపోవడమే.
హంద్రీనీవా పథకం ఈ జిల్లాలో సాగుతోంది. రాయలసీమ జిల్లాలకు 40 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం డ్యాంలో చేరిన వరద నీటిని లిఫ్ట్ ద్వారా ఈ నీళ్ళు ఇవ్వాలన్నారు. కానీ రాయలసీమకు వరద  నీరు ఒక టీఎంసీ నీరు కూడా   రావట్లేదు.ఈజిల్లాకు  కనీసం 250 టీఎంసీల నీరు వస్తే ఒక పంటైనా రైతులు పండించు కుంటారు.   దీనికోసం కృష్ణా నది నీటి కేటాయింపు పునః పంపిణీ చేయాలి.  సర్కారు వారు మూడు పంటలకు సరిపడా నీళ్లు తీసుకుంటు న్నారు.రెండు పంటలు కూడా నోచుకోని ఈ జిల్లాకు 100 టీఎంసీల నికర జలాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. తుంగభద్ర డ్యాం నుండి 50 టీఎంసీల నీరు జిల్లాకు మళ్ళించే ప్రణాళిక అమలు చేయాలి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు అడిగి తీసుకోవాలి. చెరువులు కుంటల్లో పూడికలు తీయాలి.
అప్పుడు కొంతలో కొంత బాగుపడే అవకాశం ఉంది.

(వైజాగ్ ఎక్స్ప్రెస్,29.5.2020)
__పిళ్లా విజయ్
   9490122229

Thursday, August 27, 2020

అనంతపురం జిల్లాలో ఆసుపత్రులు



*ఆశా ఆసుపత్రి , కోర్టురోడ్డు. 9440285832

*డాక్టర్ అక్బర్ ఆసుపత్రి, సాయినగర్,  08554-235009

*స్నేహాలత నర్శింగ్ హోం, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, 08554-277077

*జయం సూపర్ స్పెషాల్టీ డెంటల్ హాస్పిటల్, మున్సిపల్ కాంప్లెక్సు, క్లాక్టవర్, 9490179669

*డెంటోకేర్ సూపర్ స్పెషాల్టీ హాస్పెటల్, సాయినగర్, 08554-240346

*బాలాజీ డెంటల్ ఆసుపత్రి, కేఎస్ఆర్ కాలేజీ ఎదురుగా, సాయినగర్,  99082 40900

*హరిప్రసాద్ ఈఎన్టీ ఆసుపత్రి, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, ఖాజానగర్, 08554 699632

*ప్రశాంతి నర్శింగ్ హోం, కోర్టురోడ్డు, 08554 241529

*శ్రీనివాస చిల్డ్రెన్ హాస్పెటల్, ఖాజానగర్,  08554 241104

*మేడా నర్శింగ్ హోం, రామచంద్రనగర్, 08554 233564

*శ్రీసాయికృప నర్శింగ్ హోం, సరోజినిరోడ్డు,

*శ్వేత ఈఎన్టీ ఆసుపత్రి, సాయినగర్ మొదటి క్రాస్, 08554 275152

*మమత నర్శింగ్ హోం, సాయినగర్, మొదటి క్రాస్, 08554 241152

*శ్రీధర్ సర్జికల్ క్లినిక్, సప్తగిరి సర్కిల్, 08554 220092

*విజయ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి, నవోదయకాలనీ, 9440663157

*పావనీ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్, సాయినగర్, మూడో క్రాస్,  08554 240024,246060

*మైత్రీ ఆసుపత్రి , కమలానగర్, 08554 274630, 240011

*బేబీ ఆసుపత్రి , సాయినగర్, 9440566411

*శ్రీసాయిబాలాజీ ఆసుపత్రి, కమలానగర్,  08554 247797

*హరిశ్రీ హాస్పిటల్ , మూడో రోడ్డు,  08554243633

*రవితేజ నర్శింగ్ హోం, కమలానగర్,  9440285411

*రూపా డెంటల్కేర్, విటిల్ బిల్డింగ్, క్లాక్టవర్, 8099904734

*అనంతపుర్ ఆర్థోపెడిక్ సెంటర్, అరవింద్నగర్, 08554 222022

*హృదయ చిల్డ్రెన్ హాస్పిటల్ , సాయినగర్, రెండోక్రాస్, 9440285355

*అభయ కిడ్నీకేర్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ , ఆదిమూర్తినగర్, 08554 277444

*డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ హాస్పిటల్ , సాయినగర్, మొదటి క్రాస్, 08554 247155

*శ్రీవరలక్ష్మి ఐ హాస్పిటల్ , అనంతపురం క్లబ్ ఎదరుగా, 08554 270975

*సుదర్శన్ హాస్పిటల్ , సాయినగర్, మొదటి క్రాస్, 08554 228567

*న్యూ లైఫ్లైన్ హాస్పిటల్ , శ్రీనివాసనగర్, ఆర్టీసీ బస్టాండు సమీపంలో,  08554 245545

*సాయిరత్న ఆసుపత్రి , సాయినగర్,  08554 229900

*వరుణ్ చిల్డ్రెన్ ఆసుపత్రి , కమలానగర్,  08554 241886

*కెఎం హాస్పిటల్స్ , ఖాజానగర్, 08554 222305

*బాలాజీ ఆర్థోపెడిక్ సెంటర్, సాయినగర్,  08554 244443

*శిశుకేర్ హాస్పిటల్ , శ్రీనివాసనగర్,  08554 221222

*అనంతపురం ప్రజావైద్యశాల, సంగమేష్నగర్,  08554 233721

*శ్రీచేతన్ హాస్పిటల్ , మూడోరోడ్డు,  9246089081

*దివ్యశ్రీ హాస్పిటల్స్ ,
డా. బత్త రామ్మోహన్కార్డియాలజిస్ట్ ఆదిమూర్తినగర్,  ఫోన్ నెం: 08554- 274322.

*రక్తనిధికేంద్రాలు*

*అనంతపురం జనరల్ ఆస్పత్రి- 275024
*హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి- 220555
*అనంతపురం రెడ్క్రాస్- 944004490
*ఆర్డీటీ బత్తలపల్లి- 242029
*గుంతకల్లు రైల్వే ఆస్పత్రి- 226893
*సత్యసాయి పుట్టపర్తి- 287388
*కదిరి రెడ్క్రాస్.
ఫార్మాస్యూటికల్స్
వాక్స్మెన్ సెల్మెన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్- 274103
*అనంతయ్య ఫార్మా కంపెనీ, అనంతపురం రూరల్, రాచానాపల్లి

*24 గంటల మందుల దుకాణాలు*

*దేవిమెడికల్స్ సప్తగిరి సర్కిల్  08554-325859

*అపోలోఫార్మసీ 08554-241419

అపోలోఫార్మసీ హిందూపురం 08556-223811

అపోలోఫార్మసీ గుంతకల్లు 08552-221259

అపోలోఫార్మసీ కదిరి 08494-223960,221199

అపోలోఫార్మసీ తాడిపత్రి 08558-223600

*అనంతపురం అంబులెన్స్*

*ప్రభుత్వ అంబులెన్స్ 108
సర్కార్ అంబులెన్స్ అనంతపురం 9966225858
ఇండియన్ అంబులెన్స్ 9618882225, 9000092700.

భారత్ అంబులెన్స్ 9177771773

పావని అంబులెన్స్ 9533533393

ఆశా హాస్పిటల్స్- 227194

అంబులెన్స్- 274539

భవానీ అంబులెన్స్ - 249086

ఆర్డీటీ అంబులెన్స్ - 275627

*పశువైద్యశాలలు*

రైతులు పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పశువులను పోషిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 45 పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని కేంద్రాలకు రైతులు పాలను పోస్తారు. వీటన్నింటిని జిల్లా కేంద్రంలోని డెయిరీకి తరలిస్తున్నారు. రోజుకు లక్ష లీటర్ల పాలు డెయిరీకి వస్తున్నాయి. జిల్లాలోని 188 పశు వైద్యశాలల ద్వారా పశువులకు వైద్య సేవలు అందుతున్నాయి.
తాలుకా స్థాయి పశువైద్యశాలలు- 16
మండల స్థాయి- 96
గ్రామీణ స్థాయి- 75
బహుళార్థక పశువైద్యశాల-1
మొత్తం పశువైద్య శాలలు-188
ఆసుపత్రిల్లో వైద్యులు
ఉప సంచాలకులు-1
సహాయ సంచాలకులు-18
*డయాగ్నస్టిక్ కేంద్రాలు అనంతపురం*

సత్యం డయాగ్నస్టిక్, గంగాగౌరీ థియేటర్ ఎదరుగా,

ఓఎంసీఐ స్కాన్, మెడినోవా డయాగ్నస్టిక్ సెంటర్, రాజురోడ్డు,  08554 221150, 221160

స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్, సూర్యానగర్రోడ్డు, 08554 241709

స్టార్ డయాలసిస్, కిడ్నీ కేర్ సెంటర్, బాలాజీ టవర్, 08554 241709

వెంకట్ డయాగ్నస్టిక్ ల్యాబ్, ఇండియన్బ్యాంకు పక్కన, శ్రీనివాసనగర్,  08554 249930

ఓవీఆర్ డయాగ్నస్టిక్ సెంటర్, మునిరత్నం ట్రావెల్స్ పక్కన, 08554 234108

అమృత సాయి డయాగ్నస్టిక్ సెంటర్, స్వాగత్ లాడ్జ్, రైల్వే స్టేషన్రోడ్డు,  9440204624

శ్రీరాయలసీమ డయాగ్నస్టిక్ సెంటర్, మున్సిపల్ కాంప్లెక్సు, సాయినగర్,  08554 224197

అనంతపురం డయాబెటిక్ సెంటర్, రఘువీరా టవర్స్, కమలానగర్,  08554244455

కేఎంకే డయాగ్నస్టిక్ సెంటర్, డీసీఎంఎస్ రోడ్డు, కమలానగర్, 08554 223038.

*ధర్మవరం*

దేవి డయోగ్నొస్టిక్

స్పందన డయోగ్నొస్టిక్ సెంటర్

రిప్లక్ డయోగ్నొస్టిక్

శ్వేత డయోగ్నొస్టిక్ సెంటర్

ఆశా డయోగ్నొస్టిక్ సెంటర్

ఎంఎస్ డయోగ్నొస్టిక్ సెంటర్

శ్రీశ్రీనివాస్ డయోగ్నొస్టిక్ సెంటర్

శ్రీసాయిబాబా డయోగ్నొస్టిక్
సెంటర్

అఖిల డయోగ్నొస్టిక్ సెంటర్

*గుంతకల్లు*

పద్మావతి డయోగ్నొస్టిక్

చైతన్య డయోగ్నొస్టిక్

ప్రీతి డయోగ్నొస్టిక్ సెంటర్

స్వప్న డయోగ్నొస్టిక్

సాయకృప డయోగ్నొస్టిక్

*తాడిపత్రి*

ఓవీఆర్ డయోగ్నొస్టిక్ సెంటర్

శ్రీవేజ డయోగ్నొస్టిక్ సెంటర్

ప్రజ డయోగ్నొస్టిక్

వీసీఆర్ సెంటర్

అరవింద డయోగ్నొస్టిక్ సెంటర్

*హిందూపురం*

అరవింద డయోగ్నొస్టిక్

శ్రీయ డయోగ్నొస్టిక్ సెంటర్

అఖిల డయోగ్నొస్టిక్ సెంటర్

శ్రీహరిహర డయగ్నొస్టిక్

పీపుల్స్ డయోగ్నొస్టిక్

శ్రీవెంకటేశ్వర్ హోమియో స్టోర్

శిల్పా డయోగ్నొస్టిక్

కణేకల్ మండలం



                   

        ఇక్కడ 36 పడకలతో ఒక ఆసుపత్రి వుంది. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఈ మండలం లోనే వుంది. నలుగురు డాక్టర్లు వున్నారు. అయిన ప్పటికీ 5కి.మీ. కన్నా ఎక్కువ దూరంలోవున్న గ్రామాలకు వైద్య సౌకర్యం లభించడం లేదు. సంచార వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలి. నెలకోసారి హెల్త్ క్యాంపులు ప్రధాన గ్రామాల్లో ఏర్పాటు చేయాలి.

          గంగాలపురం గ్రామం ప్రభుత్వం గుర్తించిన సమస్యాత్మక గ్రామం. ఈ గ్రామంలో బోరుబావుల
ద్వారా త్రాగునీరు సరఫరాచేస్తున్నారు.
         ఈ మండలంలో అక్షరాస్యత 47% (జిల్లాది 56%) జిల్లాలో అతితక్కువ అక్షరాస్యత వున్న
5 మండలాలల్లో (బొమ్మనహాల్-41, గుమ్మగట్ట- 43, డి. హీరేహాల్-43, బ్రహ్మసముద్రం-45,
కణేకల్-47) ఈ మండలం ఒకటి. డ్రాపౌట్లు 986 మంది - బాలికలు- 446 జిల్లాలోని డ్రాపౌట్లు అధికంగా గల 10 మండలాల్లో కణేకల్లు ఎనిమిదవది.
           13 గ్రామాలకు ఉన్నత పాఠశాల 5కి. మీ. పరిధిలోపల అందుబాటులో లేదు. మహిళల్లో
అక్షరాస్యత - 34% వుంది. ఒక జూనియర్ కాలేజ్ మాత్రం ఉంది. బి.సి. బాలికలకు, యస్.సి
బాలురకు హాస్టల్ వసతి లేదు
          425.2 చ.కి.మీ. గల మండలం జనాభా 57,599 ఉంది. జనసాంద్రత 135 (జిల్లా190) లింగనిష్పత్తి 961(జిల్లా 958). దళితులు - 15% ఉన్నారు. గిరిజనులు లేరు.

            7.7% అడవుల విస్తీర్ణముతో 49% మొత్తం సాగువిస్తీర్ణంతో వున్నమండలం. తక్కినదంతా
బీడుభూములే. కాలువల కింద సాగు విస్తీర్ణం - 3393 హె|లు. 12321 కుటుంబాల్లో 43.50%
నిరు పేదల కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 50% మందికి ఉపాధి కరువు.
           మండలంలో 500 కంబళ్ళు నేసే మగ్గాలు ఉన్నాయి. ప్రక్కనే రాయదుర్గంలో అభివృద్ధి
చెందిన గార్మెంట్స్ ఈ మండలంలో అభివృద్ధి కాకపోవడం ఆశ్చర్యకరం.
       సగటు వర్షం 458మి.మీ. (జిల్లా 552 మి.మీ) అతి తక్కువ కురిసే 10 మండలాల్లో ఎనిమిదవది కణేకల్లు మండలం. ఈ మండలం మీదుగా వేదవతి (హగరి) ప్రవహిస్తున్నది.

రాయదుర్గం



     ఒకప్పుడు చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన కాలంలో 1980 ,90 వ దశకంలో రాయదుర్గంలో సిల్క్ ట్విస్టింగ్ మరియు రీలింగ్ ఫ్యాక్టరీలు సుమారు 45 దాకా ఉండేవి. ప్రస్తుతం 5 నుండి 10 ట్విస్ట్టింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికుల సంఖ్య వందకు లోపే. 
            రాయదుర్గం  లో 2002-03లో 37 సిల్క్    ఫ్యాక్టరీలు ఉండగా 2003-04 నాటికి అవి 23కు తగ్గిపోయాయి. ఫలితంగా శ్రామికుల సంఖ్య 419 నుండి 322కు తగ్గిపోయింది. ఉపాధి ప్రతి
ఏడాదికి ఇలా తగ్గిపోతూ వుంటే ప్రజాజీవనం గగనమవుతున్నది. చిన్నతరహా పరిశ్రమలు (10,000 రూ|| ఆపైన యూనిట్లు) 310 వున్నాయి. వీటిల్లో 1684 మందికి ఉపాధి లభిస్తోంది.

        రాయదుర్గంలో ప్రధానంగా జీన్స్ బట్టల కుట్టే యూనిట్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి.
జీన్స్ బట్టను కర్నాటక ప్రాంతం(బళ్లారి) ప్రాంతం నుంచి తెచ్చుకొని వాటిని దుస్తులుగా కుట్టి
బెంగుళూరు తదితర ప్రాంతాలలో విక్రయి స్తున్నారు. ఇదే ప్రధాన ఆదాయ వనరుగా వుంది. 
     రాయదుర్గం పట్టణంలో'' పుర 'పథకం కింద  కామన్ ఫెసిలిటీ సెంటర్ 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది .ఇక్కడ కొంత కాలం రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమలో పనిచేయు కార్మికులకు కుట్టు శిక్షణ ఇవ్వబడింది ..ప్రస్తుతం ఈ కేంద్రం మూతపడింది. రాయదుర్గం మండలం 74 -ఉడేగోళం గ్రామం వద్ద  చేనేత మరియు జవుళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల క్రితం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబడింది. 55 పరిశ్రమలకు గాను ప్రస్తుతం ఐదు పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. 55 సంవత్సరాల క్రితం రాయదుర్గం పట్టణంలో రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమకు పునాదులు ఏర్పడగా ప్రస్తుతం రాయదుర్గంలో  జీన్స్ కాటన్, మొదలైన మెటీరియల్తో ప్యాంట్లు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది పరోక్షంగా 20,000 మంది పనిచేసి జీవిస్తున్నారు 500 కోట్లకు పైగా టర్నోవర్ నడుస్తోంది. ఇక్కడి ఉత్పత్తులు దక్షిణ భారతంలోని ప్రధాన పట్టణాలు, నగరాల తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా మార్కెట్ అవుతున్నాయి. ఈ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు అహ్మదాబాద్, సూరత్ ,ముంబై బళ్లారి, బెంగళూరు నగరాలనుండి తెప్పించ బడుతోంది. ఒకప్పుడు రాయదుర్గం కాటన్ మరియు పట్టు చేనేత చీరల తయారీకి ప్రసిద్ధిచెందినది .
      ఇక్కడ కార్మికులకు జీన్స్ దుస్తుల తయారీలో, ఫ్యాషన్ డిజైన్లలో నైపుణ్యం అందించగలిగితే జీన్స్ఎగుమతి ప్రధాన ప్రాంతంగా మారుతుంది. ఇక్కడ ఆపరెల్ పార్కు ఏర్పాటు చేయడం ఉపయోగకరం.
          ఫ్యాషన్ టెక్నాలజీ టెక్స్ టైల్ టెక్నాలజీ లాంటి ఉపాధి నందించే కోర్సులు ఇక్కడి విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం. 
           ఈ మండలంలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. వీటిని వెలికి తీస్తే మంచి ఉపాధి లభిస్తుంది.

        ఇక్కడ 5000 చేనేత మగ్గాలు ఉండేవి. అయితే ప్రస్తుతం సుమారు 200 లోపు చేనేత మగ్గాలు ఉన్నాయి. గుమ్మగట్ట మండలం లోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఉన్ని కంబళ్ళ తయారీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. 
         1000 కంబళ్ళ మగ్గాలు   ఉన్నా యి.   చేనేతను నమ్ముకున్న కార్మికులకు తగిన సహాయ సహకారాలందిస్తే ఉపాధి విస్తరిస్తుంది. కంబళ్ళ మగ్గాలను ప్రోత్సహిస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.

         రాయదుర్గం మండలం 336 చ.కి.మీ. విస్తీర్ణం కలిగివుంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం రాయదుర్గం పట్టణ జనాభా 62,017. ప్రస్తుతం రాయదుర్గం పురపాలక సంఘం ద్వితీయశ్రేణి పురపాలక సంఘంగాకొనసాగుతోంది.
మురికి వాడల సంఖ్య 22.వీటిల్లో 54.77% మంది
ప్రజలు ఉన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి ఉంది.
మున్సిపాలిటీ లో 34 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 27 ఉన్నత పాఠశాలలున్నాయి.
మండల జనసాంద్రత రాష్ట్ర స్థాయికి సమానంగా 275 వుంది. లింగనిష్పత్తి 976 ఇక్కడ లింగవివక్ష
తక్కువేనని చెప్పవచ్చు (జిల్లా స్థాయి లింగ నిష్పత్తి 958 వుంది). ఈ మండలంలో 20% మంది దళితులున్నారు. 3% మంది గిరిజనులు వున్నారు. 55% మంది ఏ ఉపాధి లేకుండా వున్నవారు ఉన్న 7,842 కుటుంబాలలో 5417(69%) కుటుంబాలు
దారిద్రరేఖ దిగువన జీవిస్తున్నాయి.
        మండలంలో సగటు వర్షం 529మి. మీ. జిల్లా స్థాయితో పోటీ పడుతువుంది. వర్షం అత్యల్పమనే విషయం చెప్పకనే చెపుతోంది. 

        హగరి లేక వేదవతి అనేనది కర్నాటకలో పుట్టి రాయదుర్గం తాలూకాలో ప్రవహిస్తుంది. ఇది తాలూకాలో దక్షిణ దిశ నుండి ప్రవేశిస్తుంది. మధ్యలో చిన్న హగరినది దీనిలో కలుస్తుంది. అక్కడి నుండి నది ఉత్తర దిశగా ప్రవహించి కర్నాటకలోనికి ప్రవహిస్తుంది. ఇదే పెద్దనీటి వనరు. ఈనది ద్వారానే రాయదుర్గం మునిసిపాలిటీకి త్రాగునీరు లభిస్తోంది.
          42 చెరువులున్నాయి. 12 కాలువలు న్నాయి. చెరువుల క్రింద 1407 ఎకరాలు, కాలువల క్రింద 188 ఎకరాలు సాగుచేస్తారు. మొత్తం సాగువిస్తీర్ణం 65% వుంది. బీడు భూములు 26% అడవుల విస్తీర్ణం 9.4%గా వుంది.
         మండల అక్షరాస్యత శాతం 54. పురుషుల్లో 65% ఉండగా మహిళల్లో 43 శాతం మాత్రమే
వుంది. 7 గ్రామాలకు 5కి.మీ. పరిధిలోపల ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేవు. ఉపాధ్యాయ,
విద్యార్థి నిష్పత్తి 1: 62గా ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఎక్కువగా నియమించాలి.
      కె.టియస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరబిక్ ప్రవేటు డిగ్రీ కాలేజి,రాయల్ పీ.జీ. సెంటర్ వున్నాయి. పట్టణంలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (అందులో ఒకటి బాలికలకు ప్రత్యేకించబడినవి) కలవు. ప్రైవేటు  జూనియర్ కళాశాలలో రెండు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ,ప్రైవేటు ఐ టి ఐ, కళాశాలలు కూడా ఉన్నాయి.




 





 


Wednesday, August 26, 2020

చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ




       చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యధార్థ సంఘటన.
  

      1509_29లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో పర్షియా(నేటి ఇరాన్) దేశంనుంచి కొంతమంది వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు. వారు హంపీ తదితర ప్రాంతాలను చూసుకుంటూ కదిరికి కూడా వచ్చినారు.
కొన్నాళ్ళు ఇక్కడ కూడా వ్యాపారం చేసినారు. ఆ వ్యాపారస్తుల్లో మొహియార్ అనే యువకుడు  ఉండేవాడు. పాతర్లపట్నంకు చెందిన శ్రీరంగరాయలు కుమార్తె చంద్రవదన ఒక రోజు కదిరికి వచ్చింది. ఆమె మొహియార్‌ను చూసింది. మొహియార్ ఆమెను చూశాడు. వారిద్దరు పరస్పరం ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధంతో ఒక్కటైనారని ఒక కథనం ఉంది. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాథ కదిరిలో మతసామంస్యానికి ప్రతీకగా నిలిచివుంది. 
         వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి పురపాలకసంఘం ఒక ప్రాథమిక పాఠశాలను నెలకొల్పింది.

మరో కథ ప్రకారం 
       విజయనగర సామ్రాజ్యపు సామంత రాజు శ్రీరంగరాయలు పాతర్లపట్నంలో ఉండేవాడు.
ఆ పాతర్లపట్నంను నేడు పట్నంగా పిలుస్తున్నారు. ఆయన ఏకైక పుత్రిక చంద్రవదన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేది. పర్షియానుండి వజ్రాల వ్యాపారులు వచ్చారు. ఒకరోజు చంద్రవదన పర్షియా వ్యాపారస్తుడు మొహియార్ దుకాణం వద్దకు వెళ్లింది.
     ఆమె మొహియార్ను చూడగానే అతని ఠీవి, దర్పాన్ని చూసి తొలిచూపులోనే అతన్ని మోహించింది.
       ఆమెలో ప్రేమ మొగ్గతొడిగింది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి, గుండెల్లో
ముద్రవేసుకున్నాడు. పరస్పర ఆకర్షణల మధ్య ఒకరినొకరు మధుర ప్రేమలు పంచుకున్నారు.
         ఆమె బాహ్య ప్రపంచంలోకి వచ్చి తనస్థితి, స్థాయినీ గుర్తుతెచ్చుకొని వేగంగా కదిలి తన మందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్ చుట్టూ తిరుగుతూనే ఉంది.
కొన్ని నిముషాలుమెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనను మొహియార్ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతిక్షణం చంద్రవదనే మదిలో తలపులు రేపుతూ, నిద్రాహారాలను దూరం చేసింది. కానీ తన స్థాయి వేరు. పైగా మతం వేరు. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే ఉంది. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసురాక విలవిలలాడింది.
 వచ్చిన వ్యాపారస్తులు కదిరిని విడిచి వెళ్లి పోయారు.కాని మొహియార్ ఆమె కోసం కదిరిని విడిచి పోకుండా ఆమె ప్రేమ కోసం పరితపించ సాగాడు.
       ఒకరోజు మొహియార్ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంత:పుర భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదనపై ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండ టంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేసినారు. అతను ప్రక్కన వున్న గోడకు తలతగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. చనిపోయిన వ్యక్తి ఫలానా అని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి అతని స్థితిని చూసి చలించిపోయి ఆమె కూడా అమాంతంగా మొహియార్ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది.
   శ్రీరంగరాయలు విషయం తెలుసుకొని, మొదట వారిద్దరి మధ్య జరిగిన స్పందన, ప్రేమలనుఅర్థం చేసుకుని తన కొలువులోని గురువులను, పెద్దలను సంప్రదించి అందరి సలహాతో చంద్రవదన,మొహియార్ శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించాడు. 
          హిందూ, ముస్లింల సమైక్యతను
చాటుతూ వారి సమాధులను హిందూ ముస్లిం సంప్రదాయాల సమ్మేళనంతో నిర్మించాడు.
మొహియార్ శవాన్ని అంత్యక్రియలకోసం తీసుకెళదామని ఎంతమంది వచ్చి కదిపినా అది కదలలేదనీ చివరికి ఘోర దుఖంలో ఉన్న చంద్రవదన వచ్చి అతని శవాన్ని తాకిన మీదటనే దానిని లేపగలిగారనీ, చంద్రవదనకూడా మొహియార్ ఎడబాటును సహించలేక అతనితో పాటు సజీవసమాధి అయ్యిందని వారిది దైవికమైన అమర ప్రేమగా అప్పటి ప్రజలు భావించారనీ మరో కథ ప్రచారంలో ఉంది. 
        చంద్రవదన మొహియార్ సమాధి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాల ని మొక్కుకుంటారు. తాము ఆ జన్మాంతమూ విడిపోకూడదనుకునే ప్రేమికులూ దంపతులు కూడా ఈ సమాధిపై ఉంచిన కుంకుమ ను నేటికీ భక్తి శ్రద్ధలతో తీసుకెళు తుంటారు.
          వీరి సమాధి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ముస్లిం శ్మశానస్థలంలో ఉంది.

కదిరి



    కదిరి

        కదిరి పరిసర ప్రాంతాలను 3 వ శతాబ్దంలో పల్లవ రాజులు, 7వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజులు పాలించారు. క్రీ.శ 985 _1076  మధ్యకాలంలో పశ్చిమ చాళుక్యులు పరిపాలించారు. కదిరి లో లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నిర్మించక ముందు చాళుక్యులు క్రీ.శ. 965-1076 కాలంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. దుర్గాదేవి విగ్రహాన్ని కృష్ణవర్ణశిలతో అతి సుందరంగా చెక్కించి తమకాలపు ప్రత్యేకతను నాటి రాజులు చాటుకున్నారు. వీరి తరువాత క్రీ.శ1191 సంవత్సరం వరకు పశ్చిమ చాళుక్యులు , క్రీ.శ.1212 వరకు హొయసల వంశస్థులైన బల్లాల రాజులు పరిపాలించారు. క్రీ.శ. 1274లో  వీర బుక్కరాయలు విజయనగరమహా సామ్రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన ఆ నాటి ఖాద్రి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ భృగుమహర్షి పూజించిన స్థలాన్ని గుర్తించి ఒక మండపాన్ని నిర్మించాడు. దీన్ని క్రీ.శ 1275లో   నిర్మించినట్లు ఇక్కడి శాసనాలు చెపుతున్నాయి . 

      పూర్వపు కదిరి తాలూకా ప్రస్తుతం ఉన్న గాండ్లపెంట మండలంలో ఉండేది. ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది ఇక్కడ ఖాద్రీ వృక్షాలతో  ఉన్న మనోహరణ్యాన్ని నివాసయోగ్యంగా ఆనాటి  మునులు మార్చుకున్నారు. యజ్ఞయాగాదులు చేసే వారు. ఖాద్రీ వృక్షాలతో ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఖదిరా అని పిలిచేవారు.అది అందరి నోళ్లలో  ఖదిరీ అయింది. క్రమంగా కదిరి పేరుతో పిలిచారు. ఖదిరి చెట్టు ను చండ్ర చెట్టు అని కూడా పిలుస్తారు.
      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కదిరి ఒక ముఖ్య పట్టణం ,ఒక మండలం .పిన్ కోడ్ 515591. ఎస్.టి.డి కోడ్ 08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకా వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా రాష్ట్రములోనే అతి పెద్ద తాలూకా గా ఉండేది. కదిరి చుట్టూ 10 మండలాలు ఉండేవి.5 మండలాలను పుట్టపర్తి లో కలిపి ఒక నియోజక వర్గం చేశారు. ప్రస్తుతం కదిరి నియోజక వర్గం లో 10 మండలాలు ఉన్నాయి.
       కదిరి మల్లెపూలకు,  కనకాంబరాల పూలకు ప్రసిద్ధి గాంచింది. కదిరి కుంకుమకు ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. 
 కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.


 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.

            క్రీ.శ. 1274 లో   విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వీరబుక్కరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాద్రి వృక్షాల నీడలో విశ్రమించాడు .అప్పుడు ఒక చెట్టు కింద కొన్ని శిలలు కనిపించడం తో అక్కడ  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడం మొదలైంది. క్రీస్తుశకం 1391లో నరసింహ లక్ష్మన్న అనే దాసరులు ఇద్దరు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు. వారు ఆ గుడి చుట్టూ ఎత్తైన రాతి స్తంభాలను ఏర్పాటుచేసి, ఆ గుడిలో దీపాలను వెలిగించడం మొదలుపెట్టారు. 

ఇక్కడి విశిష్టత ఏమిటంటే మరే నారసింహ క్షేత్రములో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతముగా దర్శనమిస్తారు. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణాపథం,ముఖ మంటపం, అర్ధ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్తంభాలపై ఉన్న కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. 
అందువల్లనే తెలుగు రాష్ట్రాలలో ఉన్న యాదగిరి, పానకాల,సింహాచలం వంటి  తొమ్మిది నరసింహస్వామి ఆలయాలలో కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విశిష్టమైనదిగా పేరొందింది. బేట్రాయి సామి దేవుడా.. నన్నేలినోడా.. బేట్రాయి సామి దేవుడా కదిరి నరసింహుడా.. కాటమరాయడా...అంటూ జానపదులతో కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్టత చాలా గొప్పది.

       ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్తంభం పునాదిలో
నుండి కాకుండా ఒక బండపైనే అలా నిలబెట్టి ఉంది
        
      ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుగుతాయి.
         బ్రహ్మగరుడ సేవ,   బ్రహ్మ రథోత్సవం(తేరు) అతి వైభవంగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక,తమిళనాడు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తేరు రోజున కదిరి జనసంద్రాన్ని తలపిస్తుంది. 
        దేవస్థానానికి సంబంధించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థం(కోనేరు), ద్రౌపది తీర్ధం, కుంతి తీర్ధం, పాండవ తీర్ధం, వ్యాస తీర్ధం మొదలైనవి.
.
       గర్భగుడిలోనే లక్ష్మీదేవి గుడి  కూడా ఉంది.
ఈ విగ్రహం అఖండ శిల్ప రమణీయతకు ప్రతిరూపం.

       ఆలయం హొయసుల వాస్తు శైలిని కలిగి ఉంటుంది. శిల్పాలన్నీ విజయనగర కాలం నాటి శిల్పాలను పోలి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని మండపాల్లో అశ్వం, ఏనుగు ... మొదలైన జంతువుల శిల్పాలను అందంగా చెక్కారు.

దేవాలయం పై గల కామ సూత్ర శిల్పాలు అపురూపంగా దర్శనమిస్తాయి. తేరుపైన చారు శిల్పాలు వర్ణింపనలవిగావు.
గుడి బయట వున్న జయ విజయుల విగ్రహాల శిల్ప రమణీయత చెప్పనలవి కాదు.ఈ ఆలయం దాదాపు 10 ఎకరాలలో విస్తరించి ఉంది.
        క్రీ.శ.1509లో విజయనగరం సామ్రాజ్యాన్ని అధిష్టించిన తరువాత శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి, గర్భ గుడి ముందర 


రంగ మండపాన్ని నిర్మింపజేశారు. ఆ తర్వాత వచ్చిన అచ్యుత దేవరాయలు 1545 లో తూర్పు గోపురాన్ని నిర్మించారని , 1469 లో దక్షిణ గోపురాన్ని సాసవల చిన్నమ్మ, పడమర గోపురాన్ని 


1556లో కొక్కంటి పాలెగాళ్లు,ఉత్తర గోపురాన్ని టిప్పు సుల్తాన్ కాలం(1782_99)లో ముస్లిం పాలకులు నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. 


             క్రీ.శ.1569 లో తిరుమల రాయలు 10 మండ పాలను, పుష్కరిణి (కోనేరు)ని నిర్మించారని  దానికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని కొన్ని కథనాలు ఉన్నాయి.
           లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల ఒక కోనేరు ఉంది. బయట ఒక కోనేరు ఉంది. లోపల ఉన్న కోనేరు చాలా చిన్నది .బయట ఉన్నది చాలా పెద్దది .అయితే బయట ఉన్న పుష్కరిణిలో నీరు  పరిశుభ్రంగా లేనందున ఎవరూ అక్కడ స్నానం చేయట్లేదు. 


స్నానపు గదుల్లో స్నానం చేస్తున్నారు.అందువలన 
పుష్కరిణి ని బాగుచేయటం కోసం  పాలక వర్గం ప్రస్తుతం మరమ్మత్తులు చేయిస్తోంది.
        ప్రతి గుడికి ఒక కోనేరు ఉంటుంది. కారణ మేంటంటే గుడికి చుట్టూ నాలుగు గోపురాలు కట్టేటప్పుడు కింద నుంచి రాళ్లు తీసుకెళ్లడానికి గోపురం చుట్టూ మట్టిని ఏటవాలుగా పోస్తారు .ఆ మట్టిపై రాళ్లను ఏటవాలుగా దొర్లించుకుంటూ పైకి తీసుకెళ్తారు .అలా గోపురాన్ని నిర్మిస్తారు. కోనేరు కోసం తవ్వినప్పుడు వచ్చిన మట్టినే వాడు కుంటారు. అలా కోనేరును తప్పనిసరిగా  ఏర్పాటు చేస్తారు. ఇది పూర్వ కాలంలో  అన్ని చోట్లా జరిగింది.

ఈ గుడికి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామి రథం ఉంది దీనిని చెక్కతో నిర్మించారు.  దీని బరువు 120 టన్నులు. దీనికి ఆరు చక్రాలున్నాయి. 45 అడుగుల ఎత్తు కలిగి ఉంది.దీనిపై చెక్కిన కళాఖండాలు ఆనాటి విజయనగర రాజుల కళా కౌశ్యలానికి ఈ  రథం ప్రత్యేకంగా నిలుస్తోంది. 



ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా
సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవిలతో కలిసి నరసింహుడు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లఘుమ్మ కొండ(కదిరి కొండ_గాండ్లపెంట కు వెళ్ళే దారిలో ఉంది) దగ్గర పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం.
          పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 
          స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుణాల రోజున రథోత్సవం జరుగుతుంది ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తుంటారువీరిలో చాలామంది రధాన్ని పురవీధుల గుండా గుడి చుట్టూ లాగుతారు ప్రధానికి పెద్ద మోపులు కట్టి దాన్ని ప్రజలు లాగుతూ గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తారు.ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దపణం, పండ్లు ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రిందపడిన వీటిని ప్రసాదంగా‌భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక.

       ప్రతి సంవత్సరం సంక్రాంతి  మరుసటి దినం కనుమ రోజున లక్ష్మీనరసింహుడు సతీ సమేతంగా  దగ్గరకు పులి పారువేటకు వస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. పులిపారువేట అంటే పులివేట. మారిన పరిస్థితుల్లో పారువేటను కుందేల్లను వేటాడడంగా మార్చినారు. ఈ పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొస్తారు

       బ్రహ్మాత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాసముంటారు. ఏటా ఈ ఆలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూలతిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, ఆషాడ పౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.
          ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే... ఉత్సవాల సమయంలో
ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. 
        
ఇతర దేవాలయాలు

          కదిరిలో  శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చూడచక్కగా  విరాజిల్లుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆరాధన మహెూత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.

      ప్రపంచం లో నే మొట్టమొదటి   మరకత మహాలక్ష్మి ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో  అనంతపురం వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు పక్కన ఉంది. మహాలక్ష్మి దేవి మహావిష్ణువు హృదయేశ్వరి. ఆమె విగ్రహాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి  స్వహస్తాలతో ప్రతిష్టించారు.  


       ఈ ఆలయం  లో గణపతి , 


   దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు.

కదిరి కి సమీపాన 138 కి. మీ ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, 145 కి.మీ ల దూరంలో తిరుపతి విమానాశ్రయం,120 కి.మీ దూరంలో కడప విమానాశ్రయం ఉన్నాయి.
ఈ మూడు విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో  రెండు లేదా మూడు గంటలలో
కదిరి చేరుకోవచ్చు.


కదిరి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది పాకాల-ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది.తిరుపతి,  హైదరాబాద్, సికింద్రాబాద్ ,చెన్నై తదితర ప్రాంతాల నుండి కదిరి స్టేషన్ మీదుగా రైళ్లు వెళుతుంటాయి.

కదిరికి బస్సు/రోడ్డు మార్గం 
          ధర్మవరం, అనంతపురం, కర్నూలు, బెంగ ళూరు, హైదరాబాద్, తిరుపతి, చిత్తూరు, కడప తదితర ప్రాంతాల నుండి కదిరికి చక్కటి రోడ్డు మార్గం ఉంది.

సేవాఘడ్


బంజారాల మూల పురుషుడు, ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మ స్థలమైన సేవాఘడ్ గుత్తి దుర్గానికి 16 కి.మీ. ల దూరంలో ఉంది. 
         సేవాలాల్ మహారాజ్ క్రీ.శ.1739లో గుత్తి మండలంలోని చెర్లోపల్లె గ్రామ పంచాయితీలోని సేవాఘడ్ లో జన్మించారు. చాలా సంవత్సరాల
వరకు ఈ స్థలం నిర్జీవమైన గుట్టల ప్రాంతం. చరిత్ర పరిశోధకులు సేవాలాల్ గారి జన్మస్థలం
ఇదేనని కనుగొన్నారు. ఇప్పుడది పవిత్ర స్థలంగా మారింది. అదే సేవాఘడ్.
        గుత్తి దుర్గానికి 16కి.మీల దూరంలో ఉన్న రాంజీనాయక్, తాండాకు చెందిన గిరిజనులు
రాజప్రసాదానికి అవసరమైన పాడిని అందించేవారు. తాండాకు పెద్దగా ఉన్న భీమా నాయక్ తో ధర్మణీభాయి వివాహమైంది. 12 ఏళ్లయినా వారికి సంతాన యోగం కలగలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 15, 1739న భీమా నాయక్, ధర్మణిభాయిలకు మొదటి సంతానంగా శ్రీ సేవాలాల్ భాయ్ రాంజీ నాయక్ తాండాలో జన్మించారు. సేవాలాల్ పుట్టిన తర్వాత తండ్రి భీమ్లానాయక్ తాండాకు పెద్ద దిక్కు అయ్యారు. తాండావాసుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు.
       పంచాయతీలు నిర్వహించేందుకు రచ్చకట్టను నిర్మించి ఆ కట్టపై కూర్చునే తీర్పులు చెప్పేవాడు.
దానినే భీమానాయక్ కట్ట అంటారు. కట్టకు ఎదురుగా ఉన్న బావిని పవిత్ర కాళోకుండ్ గా
పిలుస్తున్నారు. 

ఈ కోకుండ్ కు సమీపంలో దండం మోరామో మాత (మారెమ్మ దేవత) గుడి ఉంది. కాలక్రమంగా పెరిగి పెద్ద వాడైనా సేవాలాల్ దేశ సంచారం చేసి వెళ్లిన ప్రతి చోటాఎందరినో ఆపదల నుంచి కాపాడారని ఇక్కడి వారి నమ్మకం.


సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైన సేవాఘడ్ ను పుణ్యస్థలంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. 

దాదాపు కోటి 25 లక్షలతో సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించారు.

ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు


గుడిబండ


        ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది.
క్రీ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో 

రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుండే వాడు.ఆయన 90ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కొండ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు.

       కొండపై సుందరమైన కొలనులు, కోటగోడలు, బందిఖానా, నంది విగ్రహం, ఫిరంగులు, సొరంగాలు
ఇక్కడ దర్శనమిస్తాయి. పూర్వీకులు చెక్కిన శిలలు, రాతలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదేగాకగుడిబండ కొండపై ఉన్న కొలనులో 

నిమ్మకాయవేస్తే కొండకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్నమోరుబాగల్ చెరువులో నిమ్మకాయ తేలుతుందని పూర్వీకులు నమ్మేవారు. ఇలాంటి కొండపైఅప్పట్లో కోటను నిర్మించడానికి రాజులు నానా తంటాలు పడ్డారని, ఆ కోట ఒక ప్రక్క నిర్మిస్తే
మరోపక్క కూలిపోయేదని చివరకు మల్లేశ్వరుడి గుడి కట్టిన తర్వాతనే కోట నిర్మాణం జరిగిందని
పూర్వీకులు చెపుతున్నారు. మూఢ విశ్వాసంతో ఒక నిండు గర్భిణిని అప్పట్లో బలిచ్చారట. ఇప్పటికీ ఆ మరణించిన మహిళ ఆనవాళ్ళు నేటికీ ఆ కొండపై చూడవచ్చు. ఈ కొండ పై నిర్మించిన
మల్లేశ్వరస్వామి ఆలయాన్ని బలైన మహిళ ఆనవాళ్ళను చూసి తెలుసుకోవడానికి ఎంతో మంది సందర్శకులు వచ్చి వెళుతుంటారు. ఈ కొండపైకి వెళ్లడానికి సరైన మెట్ల సౌకర్యం లేక మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

       కొండపై నిర్మించిన మల్లేశ్వరస్వామి ఆలయం కూడా కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది.
 మైరాడా స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఆలయానికి మరమ్మతు చేయించింది. దానితో ఆలయానికి పూర్వవైభవం వచ్చింది. గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నూతనంగా నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొండ పైకి వెళ్లే మెట్లదారిలోవిద్యుత్ స్థంభాలను అమర్చి మల్లేశ్వర దేవాలయానికి కొండ పైకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు.

జనాభా 

        2011లెక్కల ప్రకారం మొత్తం 52,610 మంది. పురుషులు 26,964 - స్త్రీలు 25,646.

2001 - 2011 మధ్య కాలంలో మండల జనాభా 47,838 నుండి 52,610 కి పెరిగి, 9.98% దశాబ్ద కాలపు పెరుగుదలను నమోదు చేసింది. ఇదే కాలంలో జిల్లా పెరుగుదల రేటు 12.1% గా ఉంది

మండలంలోని గ్రామాలు

  • కరికెర,రాళ్లహళ్లి,పిల్లెనహళ్లి,కేకతి,గుడిబండ,సిగతుర్పి,మొరుబగళ్, గునిమొరుబగల్,  ముత్తుకూరు,మండలహళ్లి,కొంకల్లు, ఎస్.రాయపురం,జమ్మలబండ

రొద్దం(రొద్దనాడు)


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలో ‌రొద్దం ( Roddam) ఒక మండలం. దీని  పిన్ కోడ్  515123. 
        పెనుగొండ నుండి  పది మైళ్ళ దూరంలో ఉన్న రొద్దం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది. పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది. క్రీ.శ.992లో రెండవ తైలాపుడు చోళ రాజరాజును ఓడించిన తర్వాత రొద్దంలో స్థావరమేర్పరచినట్టు బళ్ళారి జిల్లాలోని కొగలి శాసనాలు తెలుపు తున్నాయి. ఆహవమల్ల మొదటి సోమేశ్వరుడు రొద్దం ప్రాంతీయ రాజధానిగా నొళంబవాడిని పాలించినట్టు శాసనాలలో తెలుస్తున్నది.రొద్దం గ్రామానికి పూర్వ నామము రౌద్రపురము అని పేరున్నట్లుగా తెలుస్తున్నది. దానికాధారము 17.9.1927 నాటి సాధన పత్రిక.... 9వ పుటలో నున్న ఒక వార్త. 
      సమీప పట్టణమైన హిందూపురం నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2311 ఇళ్లతో, 10164 జనాభాతో 5505 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5073, ఆడవారి సంఖ్య 5091. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 64. 


రౌద్రపురం లేదా రొద్దనాడు అలియాస్ రొద్దం.

 ఇది రాయలసీమే? ఇక్కడెవర్ని చరిత్ర గురించి ప్రశ్నించినా మొట్టమొదట ఏమాత్రం తడుముకోకుండా చెప్పే పేరు కృష్ణ దేవరాయల పేరే! కానీ చాలామందికి తెలీని విషయమేమంటే, దక్షిణా పథానికి రెండవ రాజధానిగా వేసవి విడిదిగా  ఘనచరిత కలిగిన ఘనగిరి అదే పెనుకొండను, తన జీవితకాలంలొ అసలొక్కసారికూడా సందర్శించలేదని చాలామంది చరిత్రకారుల అభిమతం! ఆయన సామాన్య ప్రజానీకానికి వేసిన లంజపన్ను, వీరముష్టి పన్నులాంటి సేవలు పక్కన పెడితే, దానాలు పొందిన వర్గంచే సాహితీ సమరాంగన సార్వభౌముడిగా కీర్తింపబడుతూ దేవాలయాలకు భూరి విరాళాలతో జీవితాన్ని గడిపినా ఇక్కడి సామాన్యులకే కాదు అసమాన్యులక్కూడా తెలీని విషయమేమంటే? ఈ రాయల సీమకు కృష్ణ దేవ రాయలి కంటే ముందు కూడా చాలా చాలా గతించిన ఉజ్వల చరిత్రుందని!

అవును సంగమ, సాళువలాంటి మరో రెండు వంశాలు ఈయన కంటే ముందు దక్షిణాపథాన్ని విజయవంతంగా ఏలాయని. వారి హయాంలోనే ఇక్కడ ఎక్కువ భాగం చెరువులు చిక్కన్న వడయార్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయని!? ఇక ఈ రొద్దం విషయమే గమనించినట్లైతే రౌద్రపురంగా స్థానికులు పేర్కొంటున్నప్పటికీ రొద్దనాడుగా శాసనాల్లో పిలవబడ్డ ఈ ప్రాంతం పదహారో శతాబ్దం కాదు పదో శతాబ్దంలోనే తన వునికి చాటుకుందంటే మీరంతా ఆశ్చర్యపడకుండా వుండగలరా!

ముందుగా అక్కడి చరిత్రను తేటతెల్లం చేస్తున్న దేవాలయాల గురించి తెలుసుకునేముందు, దేశవ్యాప్తంగా వున్న దేవాలయాల ప్రధాన శైలులు గమనించినట్లైతే? అవి నాగర(ఉత్తరాది) ద్రావిడ(దక్షిణాది) వేసర(నాగర ద్రావిడ రెండూ కలగలపిన) చెప్పుకోవచ్చు. 
           దేవాలయాల్ని యోగ, భోగ, వీర, అభిసారికనే నాలుగు వర్గాలుగా పేర్కొనవచ్చు.                యోగ అంటే ఊరికి కాస్తంత దూరంగా ఏ కోనల్లోనో కొండల మీదుండే యోగ నరసింహలాంటి దేవాలయాలు. 
          భోగ అంటే వూరి మద్యలో సకల భోగ భాగ్యాలతో అంగరంగవైభవంగా అలరారే వైష్ణవ సంప్రదాయపు దేవాలయాలు.
           వీర అంటే పల్లెలు, గ్రామాలు, వూర్లు లేదా కోటలు పేటలకు కొనా లేదా మొదల్లో వుండే వీరాంజనేయుని వంటి దేవాలయాలు. 
            అభిసారిక అంటే ఇవి కొంచెం తాంత్రిక మైనవిగా భావించవచ్చు, ఇవి చాలామటుకు వూరి చివర్లలో వూరికి దూరంగా వుండడం విశేషమైతే, ఇవన్నీ కూడా ఎక్కువుగా వీరభద్ర, భద్ర కాళి, భైరవ వంటి శైవ సంప్రదాయపు దేవాలయాలే కావడం మరో విశేషం.
        
             రొద్దానికి మొదల్లోనే పురాతన వీరాంజనేయుడి గుడి మనకు స్వాగతం పలికితే, ప్రస్తుతం వూరి మద్యన (ఒకప్పుడు వూరు బయట కావచ్చు) ఇక్కడున్న వీరభద్ర దేవాలయం పూర్తిగా 

శిథిలమై వారక్కడ కొత్త గుడి కట్టుకొని, భిన్నమైన వీరభద్రుని విగ్రహాన్నలా బయల్లో వుంచేసారు.

 అదే ప్రాంగణంలో వీరభద్రుడి విగ్రహం ప్రక్కనే శిథిలమైన మరో విగ్రహం కిరీటం వంటి మకుటం కలిగిన జటాఝూటపు శివుడిగా భావించ వచ్చేమో. బహుశా వీరభద్రుడు శివుడి జటాఝూటం నుండి వెలువడ్డవాడిగా సూచించడానికిలా ఏర్పాటు చేసిండచ్చేమో. ఇక అక్కడే పడిపోకుండా భూమిలో సగానికి సగం కూరుకుపోయి నిలుచున్న వేసర శైలిలోని రెండు స్థంభాలను పరిశీలించినట్లైతే, వాటి అందాలను చూడాల్సిందే కానీ వర్ణించడానికి వీలుకాదు.
అలాగే ఇంకాస్త ముందుకెలితే ఓ పాత దిబ్బలో సగానిపైగా కూరుకుపోయున్న పెద్ద నంది తన కిందున్న చరిత్రను తవ్వి తీసే వారికోసం మౌనంగా తపస్సు చేస్తున్నట్లు కనిపిస్తుంది. దాని పక్కనే నాలుగడుగుల దూరంలో వున్న భిన్నమైన చిన్న నంది సీమలో చరిత్రకు పట్టిన గతికి సాక్షీభూతంగా దిగాలుగా కూర్చుని కనిపిస్తుంది. మరో పదడుగులు దూరం వుత్తరంగా నడిచామంటే పెన్నేటి గడ్డునే వున్న (ప్రస్తుతం ఆక్రమణలు పరివాహక ప్రాంతం కుచించుకుపోవడం వల్ల పెన్నేరు చాలా దూరంగా వుందని గమనించగలరు) మరో పురాతన ఆధునీకరించబడిన దేవాలయం 
స్థానికులు రొద్దకాంబ లేదా రౌద్రకాంబగా పిలిచినప్పటికీ నాకు తెలిసినంత మటుకు అది భద్రకాళి గుడి అయ్యే అవకాశాలే ఎక్కువని భావిస్తున్నాను. అక్కడున్న మూలవిరాట్టును ప్రస్తుత ఆధునిక ప్రభావం వలన విపరీతంగా అలంకరించడం వలన ఇదమిద్దంగా గమనించడం సాధ్యపడలేదు.

ఇక ఆ దేవాలయ పరిసరాల్లో స్థానికులకు అవగాహనలేక విరిగిపడున్న సగం బండరాయిపై వున్న శాసనాన్ని లైవ్ లో మొబైల్ ద్వారా వీక్షించిన ప్రఖ్యాత విశ్రాంత పురావస్తు శాఖ ఏడీ మాన్య శ్రీ విజయ్ కుమార్ జాదవ్ గారు అది పదవశతాబ్దానికి చెందినదని, అందులో వున్న భాష కన్నడమని, లిపి కన్నడ తెలుగు కలగలపి వుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆయన చెప్పిన దానిని బట్టి ఈ రొద్దం మొదట ఎల్లోరా వంటి గొప్ప నిర్మాణాలు చేపట్టిన ఇప్పటి మహారాష్ట్రాలోని మాన్యకేతాన్ని పరిపాలించిన రాష్ట్రకూటుల ఏలుబడిలో, హెంజేరు32000 అంటే ప్రస్తుతం హేమావతి రాజధానిగా చేసుకొని సామంతులుగా పరిపాలించిన నొళంబ పల్లవుల పాలనలో వుండినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సగానికి పైగా భూమిలో పూడుకుపోయున్న ఆ నంది అప్పటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మెలిగిన మలయనూరు రాజధానిగా పరిపాలించిన తెలుగు చోళుల ఏలుబడిలో కూడా ఈ రొద్దం తన ప్రాభవాన్ని కొనసాగించుకుందని చెప్పవచ్చు. ఇంతకు మునుపు నేను చెప్పిన ఆ ఆధునీకరించబడిన వీరభద్ర దేవాలయం దగ్గరున్న శిథిలావస్థకు చేరుతున్న ఆ రెండు స్థంభాలు వీటికి ససాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీటి నిర్మాణశైలి కంబదూరులోని మల్లేశ్వర స్వామి గుడిలోని స్థంబాలను పోలివుండడం మనం గమనింపవచ్చు.

ఆ తర్వాత పదమూడో శతాబ్దంలో పెనుకొండ రాజధానిగా ఏలిన హొయసాలులు తదుపరి పద్నాలుగో శతాబ్దం నుండి హరిహరి రాయలు బుక్కరాయల సంగమ వంశపాలనలో శ్రీకారం చుట్టుకున్న విజయనగర రాజుల పరిపాలనలో కూడా ఈ రొద్దం తన ప్రభలు చిందించిందనే చెప్పచ్చు.
ఇక ప్రధానంగా ఈ రొద్దకాంబ గుడి పరిసరాల్లో పడున్న వీరగల్లులు పదో శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకూ వున్న చరిత్రను తేటతెల్లం చేస్తున్నాయి. 
           వీర అంటే యుద్దాల్లో కానీ లేదా ఆ వూరికి సంబందించిన పశు సంపదను కాపాడ్డంలో వీరమరణం పొందిన వారి గుర్తుగా కన్నడ భాషలో కల్లు లేదా వ్యావహారికంలో గల్లుగా పిల్చే రాయి అంటే వీరులను స్మరించేటందుకు ఏర్పాటు చేసుకున్న సంస్మరణ ఫలకాలని చెప్పుకోవచ్చు. 

        వీరగల్లుల గురించి చెప్పుకోవాలంటే, ఒకే రాతి పలకపై రెండు లేదా మూడు నాలుగు విభాగాలుగా ఒక రాతి బండపై వీటిని ముందుగా క్రింద భాగంలో ఆ వీరుడెవరో ఆయుధాలతో వున్నట్టు, రెండవ భాగంలో అతను యుద్దంలో నిహతుడైనట్టు, మూడవ భాగంలో తన సతులతనితో సహగమనం చేసినట్టు, నాలుగవ భాగంలో అతను సతీ సమేతుడై శివసాయుజ్యం పొందినట్లుగానూ వీటి నిర్మాణశైలి వుంటుంది. ఒక్కోసారి మూడవ భాగంలోనే సతులతో శివసాయుజ్యం పొందినట్లుగా కూడా చూపిస్తారు. ఇంతకు మునుపు చెప్పినట్లు ఈ వీరగల్లులపై కొన్ని పశువులను చూపించితే వీరు ఆ పశుసంపదకోసం చేసిన పోరాటంలో నిహతులైనట్లుగా భావించాలి.
ఇలాంటి వీరగల్లులు రాయలసీమంతా విస్తారంగా లభిస్తున్నప్పటికీ ప్రత్యేకించి అనంతలో వీటికో ప్రత్యేక స్థానముందనే చెప్పచ్చు. అనంతపురానికి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలోని బత్తలపల్లికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న ఈదుల ముష్టూరు అనే పల్లెలో వున్న వీర ముద్దప్ప ఆలయం వద్దున్న పదులకుపైగా వున్న వీరగల్లులిక్కడి గతించిన వీరుల కథలకు కేవలం మౌన సాక్ష్యాలుగా నిలుచున్నాయి. నిజం చెప్పాలంటే ఇది వీరుల ముష్టూరుగానూ కాలక్రమేణా యీదుల ముష్టూరుగానూ అయివుండచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ముష్టి అంటే బలమైనా లేదా చిన్న అని అర్థం వస్తుంది, ముష్టూరు అంటే చిన్న వూరు లేదా శివుడు ఉంఛం స్వీకరించేవాడు కావున ముష్టీశ్వరుడిగా కూడా పిలవబడినందువల్ల ఇది శైవ ప్రాంతమయ్యే అవకాశమే ఎక్కువని గమనించగలరు. చెన్నేకొత్తపల్లి నుండి దక్షిణంగా ముష్టి కోవెల అనే గ్రామం కూడా వుండడం గమనింపవచ్చు.

ఈ వీరగల్లుల సంస్కృతి ఎనిమిదవ శతాబ్దంలోని వైదంబుల నుండి ప్రారంభమై పదహారో శతాబ్దం విజయనగర రాజుల పరిపాలనల్లో కూడా కొనసాగినట్లుగా మనకు తెలుస్తోంది. అందుకుదాహరణ మన తిమ్మమ్మ మర్రిమానుగా ప్రసిద్ధికెక్కిన సతీ సహగమన వుదంతం. ఇదీ క్లుప్తంగా రొద్దం గతించిన చరిత్ర. మరిప్పటి సీమ చరిత్రకు పట్టిన చెదలు అనంత చరిత్రకు పట్టిన అధోగతికి కారణాలు విశ్లేషిస్తే?

ముందుగా ఇక్కడి ప్రజలకు తమ స్థానిక చరిత్ర పట్ల అనాసక్తి, యువత కరువు కాటకాలకు దూరాభారాల వలసలు, స్థానికుల్లో వుండే అపోహలు, గుప్త నిథుల త్రవ్వకాల వేటగాల్ల కరకు కాట్లు వంశ పారంపర్యంగా రాజకీయ నాయకుల తయారీ, వారికి సీమ చరిత్రపై కనీసం కరవైన శ్రద్ధ, టూరిజాన్ని ప్రోత్సహించాలన్న కనీస జ్ఞానం లోపించడం

ఎన్నికైన ఏ ప్రభుత్వాలైనా కేవలం దేవాదాయ శాఖ, దేవాలయాల్లో హుండీలపైనే చూపు తప్ప పురావస్తు శాఖనసలు పట్టించుకోకపోవడం.

ప్రస్తుతం పురావస్తు శాఖలో విభజన తర్వాత వున్న అధికారుల్లో చాలామందికి తాము పనిచేస్తున్న శాఖపై కనీస జ్ఞానం లేకపోవడం, కనీసం ప్రభుత్వమైనా పూనుకొని వీరికి విశ్రాంత అధికారులచే తర్ఫీదిప్పించకపోవడం

ప్రభుత్వ పాఠశాలులు కళాశాలలు యూనివర్శిటీల్లో చరిత్రంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా చరిత్రను సరిపెడుతున్న వైనాలు. బూటక పరిశోధనలు కడుపుకోసమై వుత్తుత్తి నాణ్యతలేని చారిత్రక పరిశోధనలు

అయిపు అజాలేని ప్రజాసంఘాలు వున్న ఇంటాక్ వంటి చారిత్రక పరిరక్షణా సంస్థలు కేవలం జిల్లా కేంద్రాల్లో సమావేశాలకే పరిమితాలు.

వెరశి ఇన్ని గ్రహణాలు ఒక్కసారిగా మిందపడితే సీమ అనంత చరిత్రకు కారు చీకట్లు కమ్ముకోక మరేమౌతుందో మీరే చెప్పండి. నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో నిజాం హాయాంలోనో తర్వాత బ్రిటీష్ వారి హయాంలోనో జరిగిన చారిత్రక పరిశోధనలు తప్పితే కొత్తగా సీమ చరిత్రకై సమగ్ర పరిశోధన జరగలేదనే చెప్పచ్చేమో. అలా సీమ చరిత్రను సమగ్రంగా పరిశోధించనంత వరకూ పదకొండు రూపాయలా ఎనిమిది పైసలా రెండణాల వీరులే సినిమాల రూపంలో కొత్త చరిత్ర గతులు సృష్టిస్తుంటారు. అంత వరకూ వూరు మాత్రమే వుండి పేరు తెలియని మరెందరో వీరులు వీరగల్లులై ఈ సీమలో పుట్టిన పాపానికి అనంతంగా రోదిస్తుంటారు...

ఉపసంహారం : INTACH - Indian national trust for art & cultural heritage (భారతీయ పురాతన కళలు సంస్కృతి వారసత్వ పరంపర పరిరక్షణ సంస్థ) గత ఇరవైయేళ్ళుగా జీవిత సభ్యుడినైన నేను విజయ కుమార్ జాదవ్ గారి పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా అంతో ఇంతో పర్యటించిన అనుభవంతో గ్రహించినంత మేరకు తెలుసుకున్న చరిత్రతో ప్రస్తుతం కూడా వీలును బట్టి పర్యటిస్తూ స్థానిక ప్రజల్లో చైతన్యానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడి స్థానికులెవరైనా వచ్చి జిల్లా కేంద్రంలో ఈ విషయమై పురావస్తు శాఖకు మరియు కలెక్టరు కార్యాలయానికి వీటి సంరక్షణ విషయమై ఒక వినతి పత్రాన్నివ్వవలసిందిగా అభ్యర్థించి నా నెంబరు కూడా ఇచ్చాను. ఇవి పూర్తిగా శిథిలం కాకముందే స్థానికులు ప్రభుత్వ మరియు ప్రైవేటు సహకారంతో వీటినన్నింటినీ ఒకచోట చేర్చి పెనుకొండలో ఒక ప్రచార చిత్రం ఏర్పాటు చేయగలిగితే అటు పెనుకొండకు వచ్చేవారు, ఇటు పావగడకు శనీశ్వర దర్శనానికి వెళ్ళేవారు సందర్శించే అవకాశం వుంది. తద్వారా అంతో ఇంతో గ్రామాభివృద్ధి కూడా జరిగే అవకాశం వుందని భావిస్తున్నాను....

సంగీతవాణీ