ప్రేమ శాంతి ధర్మం సహనం సమత మమత సేవాతత్పరతకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తి నాటి గొల్లపల్లే సత్యసాయి జన్మించిన గ్రామం. చిత్రావతి నది ఒడ్డున కొండకోనల్లోని గొల్లపల్లి లోని సామాన్య కుటుంబంలో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజు దంపతులకు సత్యసాయి 1926 నవంబర్ 23న జన్మించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్యుడిగా పూజలందు కుంటున్నారు. నాడు గొల్లపల్లిలో అధిక శాతం యాదవులు గోవులను పోషించేవారు. ఒక యాదవ యాజమానికి చెందిన ఆవు మేతకు వెళ్లి, ప్రతి రోజూ పుట్టలోని పాముకు పాలు ఇచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఆవులు పాలు ఇచ్చేవి. ఈ ఆవు పాలు ఇచ్చేది కాదు. ఆవు మధ్యాహ్న సమయంలో పుట్టవద్దకు వెళ్లి, పాముకు పాలు ఇస్తుండగా యజమాని గమనించి పామును రాయితో చంపాడు. పాము చనిపోతూ గొల్లపల్లి.. పుట్టలమయంగా మారాలని శపించిందట. పుట్టవద్ద ఉన్న రాతికి ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వేణు గోపాలస్వామి ఆలయం నిర్మించారు. అలా పుట్టపర్ధిని కాస్తా పుట్ట పర్తిగా ప్రసిద్ధికెక్కింది.
No comments:
Post a Comment