Tuesday, August 25, 2020

హిందూ ముస్లిం సమైక్యతకు ప్రతీక గూగూడు


         నార్పల మండలంలోని  గూగూడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి, కుళ్లాయి స్వామి మకాన్(చావిడి) ప్రక్క ప్రక్కనే ఉన్నాయి.ఇవి హిందూముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచాయి.

            ప్రతి సంవత్సరం మొహరం పండుగను ఇక్కడ అత్యంత కోలాహలంగా జరుపుతారు.
జిల్లానలుమూలల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.
రెండు ఆలయాలను భక్తితో పూజిస్తారు.
         గూగూడుకు దగ్గరలో చండ్రాయునిపేటలో రామచారి, లక్షణాచారి అనే ఇద్దరు సోదరులు
ఒక పీరును తయారుచేసి పూజించాలనుకున్నారు. పీరు తయారయిన తరువాత ఆగ్రామం తగుల
బడిపోవటంతో అది పీరు ప్రభావమనుకుని దానిని దగ్గరున్న బావిలో పడవేశారు.

 ఒక గొర్రెలకాపరి తిరుమల కొండన్నకు దాహనికై బావిలో దిగినపుడు ఆ పీరు కనిపించింది. దాన్ని అతడు తీసుకొనివచ్చి మొహరం ఉత్సవాల్లో ప్రదర్శించాడు. అపుడు దాన్ని కుహూళ్ల స్వామి అనేవారు.క్రమేపి అది కుళ్లాయి స్వామిగా మారిపోయింది.     1922లో కుళ్లాయిస్వామి మకాన్ నిర్మించారు.
           గుహూడు అనే పేరుగల ముని ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించేవాడట. ఆయన
పేరు మీదుగా ఈ గ్రామానికి గూగూడు అనే పేరు వచ్చినట్లు పూర్వీకులు చెపుతుంటారు.

No comments:

Post a Comment