Wednesday, August 26, 2020

అనంతపురం_చరిత్ర


       ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో 19,130 చ.కి.మీ(7,390 చ. మై)విస్తీర్ణంతో అతి పెద్ద జిల్లా అనంతపురం జిల్లా. దేశంలో మొదటి పెద్దజిల్లాగా కాశ్మీరులోని లడక్ ఉంటే, రెండవ పెద్ద జిల్లాగా పేరొందినజిల్లా  అనంతపురం జిల్లా.ఈ జిల్లాను 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసినారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు, చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం, KIA, సిమెంట్ తదితర ముఖ్యమైన పరిశ్రమలు.    

              
చరిత్రలో ఈ జిల్లా

మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
       పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు.

    తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారంనకు కాపలాగా ఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారికి కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేశాడు. అలా తిరిగి వచ్చిన హరిహర బుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. బుక్కరాయల భార్య అనంతమ్మ పేరు మీద బుక్కరాయలు తవ్వించిన చెరువుకు అనంతసాగరం  అని పేరు పెట్టారు. అనంత సాగరం ఒడ్డున ఏర్పడిన  ఊరుకు అనంతపురం అనే పేరు వచ్చింది. ఈ చెరువు కు ముసలమ్మ కట్ట ఉంది.చెరువు కట్ట తెగ కుండా ఆమె కట్టకు అడ్డం పడుకొని ప్రజలను కాపాడింది.అందువలన ఆమె పేరు మీద ముసలమ్మ కట్ట అన్నారు.
         అనంతసాగరం చెరువుకు మరో వైపున  ఏర్పడిన వూరుకు బుక్కరాయల పేరుమీద బుక్కరాయసముద్రం పేరు  ఏర్పడింది.
          1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది.
         క్రీ.శ. 1565లో తళ్లికోట యుద్ధంలో బహమనీ సుల్తానులు విజయం సాధించటంతో
విజయనగర సామ్రాజ్యం బలహీనపడింది. 
విజయనగరరాజులు తమ రాజధానిని హంపీ నుండి అనంతపురం జిల్లాలోని పెనుగొండకు
మార్చుకున్నారు. రాయలసీమలో విజయనగర పాలకులు పన్నులు వసూళ్ళ కోసం, రక్షణ కోసం కాపలాదార్లుగా సైన్యాన్ని సమకూర్చడం వంటి పనులకు పాలెగాళ్ళను నియమించేవారు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత రాయలసీమ 1650లో నిజాం నవాబుల
పరిపాలనలోకి పోయింది. పాలెగాళ్ళు నిజాం అధికారాన్ని ధిక్కరించేవారు. క్రమంగా వీళ్ళు స్వతంత్రులుగా అయినారు, వీరి పాలన అరాచకంగా ఉండేది. దోపిడి దొంగలు, దివిటీ దొంగలుగా ఏర్పడ్డారు. వీళ్ళను కుమ్మరి గుండోళ్ళని కూడా పిలిచేవారు.
        1677-78ప్రాంతంలో శివాజీ పాలన లోకి కొంతకాలం ఉండింది.1677 లో అనంతపురం జిల్లా మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూరు యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు
కున్నాడు.
      తరువాత నిజాంపాలన తరువాత హైదరలీతో జరిగిన యుద్ధం లో వారి మధ్య వచ్చిన1792 ఒప్పందంతో మళ్లీ నిజాం  అధీనంలోకి వచ్చింది ఈ ప్రాంతం.1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ధారాదత్తం చేశాడు. ధారాదత్తం చేసిన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, బళ్లారి ప్రాంతాలు ఉండేవి.అందువల్ల ఈ ప్రాంతాన్ని దత్తమండలం అన్నారు.
       ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి,ముదిగుబ్బ,నల్లమాడ,నంబులపూలికుంట,తలుపుల,నల్లచెరువు,ఓబులదేవరచెరువు,తనకల్లు,ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి.తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాల్, కణేకల్లు, బొమ్మనహళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు.

సరిహద్దులు

     అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున వైఎస్ఆర్ జిల్లా,కడప, ఆగ్నేయాన చిత్తూరు జిల్లా, పశ్చిమాన, నైఋతిన కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. 

భౌగోళిక స్వరూపం

       14041'యన్ 7703612 /14.68, 77.6 అక్షాంశ రేఖాంశముల మధ్య అనంతపురం
భౌగోళికంగా ఉంది. 
       జిల్లాకు ఉత్తరాన మధ్యభాగంలో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండి 
ఉంది. దక్షిణ భాగం ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు  335మీ(1099 అడుగుల)  ఎత్తులో ఉంది. 

నదులు

పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి, తడకలూరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. 

వర్షపాతం

జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురుస్తుంది. ఇది రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం.రాజస్థాన్ లోని జైసల్మేరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.

నియోజక వర్గాలు

     శాసనసభ నియోజక వర్గాలు14, లోక్ సభ నియోజిక వర్గాలు: 2.ఈ లోక్ సభ నియోజక వర్గాలను రెండు జిల్లాలు గా మార్చే అవకాశం ఉంది.అవి అనంతపురం, హిందూపురం లేదా పుట్టపర్తి.

రెవెన్యూ డివిజన్లు

భౌగోళికంగా జిల్లాను 5 రెవెన్యూ డివిజన్లుగాను,63 మండలాలుగా విభజించారు.అవి
🌳అనంతపురం,
🌳పెనుకొండ,
🌳ధర్మవరం,
🌳కదిరి,
🌳కళ్యాణదుర్గం

జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి.అవి

🌳డి.హిరేహాల్
🌳బొమ్మనహళ్
🌳విడపనకల్లు
🌳వజ్రకరూరు
🌳గుంతకల్లు
🌳గుత్తి
🌳పెద్దవడుగూరు
🌳యాడికి
🌳తాడిపత్రి
🌳పెద్దపప్పూరు
🌳శింగనమల
🌳పామిడి
🌳గార్లదిన్నె
🌳కూడేరు
🌳ఉరవకొండ
🌳బెళుగుప్ప
🌳కణేకల్లు
🌳రాయదుర్గం
🌳గుమ్మగట్ట
🌳బ్రహ్మసముద్రం
🌳శెట్టూరు
🌳కుందుర్పి
🌳కళ్యాణదుర్గం
🌳ఆత్మకూరు
🌳అనంతపురం
🌳బుక్కరాయసముద్రం
🌳నార్పల
🌳పుట్లూరు
🌳యల్లనూరు
🌳తాడిమర్రి
🌳బత్తలపల్లి
🌳రాప్తాడు
🌳కనగానపల్లి
🌳కంబదూరు
🌳రామగిరి
🌳చెన్నేకొత్తపల్లి
🌳ధర్మవరం
🌳ముదిగుబ్బ
🌳తలుపుల
🌳నంబులపూలకుంట
🌳తనకల్లు
🌳నల్లచెరువు
🌳గాండ్లపెంట
🌳కదిరి
🌳ఆమడగూరు
🌳ఓబులదేవరచెరువు
🌳నల్లమాడ
🌳గోరంట్ల
🌳పుట్టపర్తి
🌳బుక్కపట్నం
🌳కొత్తచెరువు
🌳పెనుకొండ
🌳రొద్దం
🌳సోమందేపల్లె
🌳చిలమతూరు
🌳లేపాక్షి
🌳హిందూపురం
🌳పరిగి
🌳మడకశిర
🌳గుడిబండ
🌳అమరాపురం
🌳అగలి
🌳రొళ్ల

నైసర్గిక స్వరూపం

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ భాగాన వ్యాపించి ఉంది. జిల్లా 14-40, 15-15 ఉత్తర అక్షాంశాలు, 76-50, 78-31 తూర్పు రేఖాంశాల మద్య విస్తరించి ఉంది.

చిత్రమేలి

13వ శతాబ్దం మొదట్లో యాదవ సింగన పరిపాలన కాలంలో ఈ జిల్లాలో రైతు సంఘంఉండేది. దాని పేరు 'చిత్రమేలి' ఇది స్థానిక రైతులు ఏర్పరచుకున్న సంఘం. ఇది ఎందుకు ఏర్పడిందో వివరాల్లేవు. ఈ సంఘం ప్రసక్తి ఈ జిల్లాలో తప్ప మరెక్కడా కానరాదు.

జాతీయ రహదారులు  

     యన్.హెచ్. 44 కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, యన్.హెచ్ 42 అనంతపురం నుండి చెన్నై వరకు మరియు యన్.హెచ్ 43, వంటి జాతీయ రహదారులు అనంతపురం గుండా పోతున్నాయి. 

రైలు మార్గాలు

అనంతపురం నుండి హైదరాబాదు, బెంగుళూరు, ముంబాయి, న్యూ ఢిల్లీ,అహ్మదాబాద్, ఆదోని, జైపూర్, భువనేశ్వర్, పూనా, విశాఖపట్నం, చెన్నై మొదలైన నగరాలకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. 

          దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ గుంతకల్లు ఇదే జిల్లాలో ఉంది.ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది. అనంతపురం నుండి గుంతకల్లు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.


విమానాశ్రయాలు

       అనంతపురానికి దక్షిణంగా 80 కి.మీ. దూరంలో పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. అలాగే 168 కి.మీ. దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళివద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

ఆహారపు అలవాట్లు

రాగి సంకటి, జొన్నరొట్టె,సన్న బియ్యం ఎక్కువగా
తీసుకుంటారు.రాగి సంగటిని ముద్ద అంటారు.
ముద్ద పప్పు,ముద్ద బోటి ఎక్కువగా తీసుకుంటారు.

అనంతపురం జిల్లాలోని పర్యాటక కేంద్రాలు

🌳అనంతపురం పట్టణం నడిబొడ్డున టవర్ క్లాక్
   అత్యం ప్రాచీనమైనది

🌳 అనంతపురం పాతనగరంలో ఉన్న అనంతసాగర్ తీరాన ముసలమ్మ కట్ట నుండి ప్రారంభమై గణేశ్ పార్క్ వద్ద ఉన్న వరుస ఆలయాలు.


🌳అనంతపురం పట్టణంలో బెంగుళూరు రహదారిలో శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ లార్నింగ్ ఎదురుగా ఉన్న  శృంగేరి ఆలయం1.8 ఎకరాల విస్తీర్ణంలో సుందర ప్రకృతి నేపథ్యంలో ఉన్నాయి. ఈ వరుస ఆలయాలు ప్రతిదినం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంటుంది.

🌳అనంతపురంలో కొండశిఖరం మీద ఆలయం ఉన్న ఒకేఒక కొండ దేవరకొండ.జాతీయరహదారి 7లో నగరశివార్లలో ఉన్న ఇస్కాన్ ఆలయం.

🌳అనంతపురానికి 20 కి.మీ. దూరంలో కూడేరులో ఉన్న శివాలయం.అనంతపురానికి 20కి.మీ. దూరంలో పంపనూరులో ఉన్న సుభ్రహ్మణ్యస్వామి ఆలయం.

🌳అనంతపురానికి 10 కి.మీ. దూరంలో కందుకూరులో త్రవ్వకాలలో బయట పడిన పురాతనమైన  శివాలయం.

🌳అనంతపురానికి 5 కి.మీ.దూరంలో ఉన్న 
సోములదొడ్డి సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం.

🌳 తాడిపత్రి దగ్గర పెద్దపప్పూరు లోని శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి, చక్ర భీమలింగేశ్వర స్వామి ఆలయాలు, ఇక్కడ ప్రతియేటా మాఘమాసం లో నాలుగు వారాల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

🌳తాడిపత్రికి 28కిలోమీటర్లదూరంలో ఉన్న బెలూం గుహలు (ప్రకృతి సిద్ధమైన గుహలు).

🌳 తాడిపత్రిలో ఉన్న చింతల వెంకటేశ్వరాలయం, బుగ్గ రామలింగేశ్వర ఆలయం. ఇది ఒక శిల్పకళావైభవం. హంపిని పోలి ఉన్న ఈ దేవాలయాలలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు, అంతే కాకుండా ఇక్కడ ఉన్న వెంకటేశ్వరస్వామి చింతలు తీరుస్తాడని అందుకే స్వామి వారికి చింతల వెంకటరమణ స్వామి అని పేరు. ఈ దేవాలయంలోనే పాతాల భైరవి, మాయాబజార్,చిత్రాల దర్శకుడు కె.వి.రెడ్డి గారు కథలు రాసేవారు అని చాలా మంది చెపుతుంటారు. పెన్నానది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో శివలింగం క్రింద ఉన్న నీరు ఏ కాలంలో అయినా ఇంకి పోవు. బుగ్గ ఉన్న శివాలయం  కనుక శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు.పోలిమేర పెద్దమ్మ తల్లి దేవాలయం. ఇగుడూరు గంగమ్మ తల్లి దేవాలయం.బండ మసీదు.సియస్ఐ చర్చి ఇక్కడున్నాయి.

🌳పెద్దవడుగూరు మండలంలో కోటకొండ ఇక్కడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందినది.

🌳గుత్తి పట్టణంలో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి. తరచు పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధ కోటను సందర్శిస్తుంటారు. గుత్తి దగ్గరలో ఉన్న బాట సుంకులమ్మ దేవాలయం ( గుత్తి సుంకులమ్మ )

🌳ఉరవకొండ పెన్న అహోబిళంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.
హేమావతి గుడి 8- 10 దశాబ్దాల్లో  కట్టారు. ఇది చాలా పెద్ద గుడి.

🌳స్వాతంత్ర్యం వచ్చిన రోజులలో నిర్మించిన గడియారగోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది.

🌳లేపాక్షి ఆలయం (విజయనగరాజుల కాలంనాటి ప్రసిద్ధ మురల్ చిత్రాలతో చూపరులకు ఆకర్షిస్తూ ఉంటుంది. లేపాక్షి ఆలయంలో శివుడు, విష్ణువు, వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు. సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీదతో నిలువెత్తు గాయకులు, నృత్యకారిణిల శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడి ఈ ఆలయం చూపరులను ఆకర్షిస్తూ మానసి కోల్లాసము శక్తీ కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆలయం లో ఉన్న నంది ప్రపంచ ప్రసిద్ధి చెందినది అలాగే అతి పెద్దది. (రాతితో చెక్కబడిన ఈ నంది శివుడికి వాహనము, ద్వారపాలకుడుగా ఉంటుంది) లేపాక్షి హిందూపూరు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

🌳పుట్టపర్తిప్రశాంతి నిలయము (ఇది దివంగత సత్యసాయి బాబా నివాసం. అలాగే సత్యసాయి స్థాపించిన అనేక ఇన్స్టిట్యూట్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉన్నాయి).
🌳తిమ్మమ్మ మర్రిమాను (ఇది కదిరికి 28కి.మీ.దూరంలో  ఉన్న 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన అతి పెద్ద మర్రిచెట్టు. 1989 గిన్నిస్ రికార్డులో ఈ వృక్షం అతిపెద్ద వృక్షంగా నమోదు అయింది )

🌳కదిరి సమీపంలో ఉన్న బట్రేపల్లి వాటర్ ఫాల్స్. ఇది కదిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాత దృశ్యం చూడవచ్చు.
🌳కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి 
    దేవాలయం

🌳నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె హనుమాన్ దేవాలయం.కదిరి నుండి ఇది 10కి.మీ.లోపే ఉంటుంది.
🌳కదిరికి సుమారు 10కి.మీ.దూరంలో ప్రపంచ మంతా తెలిసిన కవి వేమన సమాధి కటారుపల్లెలో ఉంది.
🌳కదిరిలో ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ముస్లింల శ్మశాన వాటికలో చంద్రవదధ మొహియార్ సమాధి ఉంది.


🌳గుంతకల్లు సమీపంలోని కసాపురం లో ఉన్న హనుమాన్ ఆలయం.

🌳గుంతకల్ మండలంలోని కలశాపురం (కసాపురం) గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్ఠిత వీరాంజనేయ స్వామి దేవస్థానం ఉంది.

🌳 గుంతకల్లు పట్టణం దగ్గర్లో జంబుద్వీప చక్రం.

🌳కనంపల్లిలో గ్రామంలో ఉన్న శ్రీ నల్లమల స్వామి ఆలయం. ఇది అనంతపురం నుండి సుమారు 22 కిలోమీటర్లదూరంలో ఉంది.

🌳నీలంపల్లి గ్రామంలోఉన్న శ్రీ నాగలింగేశ్వ రాలయం. ఇది సుమారు అనంతపురానికి 12 కిలోమీటర్లదూరంలో ఉంది.

🌳పెన్న అహోబిలంలో ఉన్న లక్ష్మీనారాయణా లయం. ఇది అనంతపురానికి 35 కి.మీ.  దూరంలో ఉంది.

🌳అనంతపురానికి 70కి.మీ. దూరం లో అలాగే బెంగుళూరు విమానాశ్రయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండ (ఘనగిరి) 

హజారత్‌బాబా మసీదు (దర్గా), పెనుకొండ ప్రవేశంలో ఉన్న 14వ శతాబ్ధానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరుసు సమాధి, పెద్ద నరసింహస్వామి ఆలయం, కొండశిఖరం మీద ఉన్న కోనేరు, పచే పరస్వంతాలయం (ఇది ఒక పురాతన జైన ఆలయం), గగన్ మహాల్ (కృష్ణదేవరాయ వేసవి విడిది) మొదలైనవి ఈ  పట్టణంలో ఉన్నాయి.

🌳కల్యాణదుర్గంలో ఉన్న రామస్వామిఆలయం.

🌳అనంతపురం జిల్లా చిల్లావారి పల్లిలో ఉన్న కటకోటేశ్వరాలయం.

🌳అనంతపురం జిల్లా బుదగవి పల్లెలో పురనకాల సూర్యదేవాలయము కలదు

🌳ఉరవకొండ సమీపంలో జారుట్ల రామపురంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం. ఈ ఆలయం అనంతపురం నుండి 65 కిలోమీటర్లు ఉరవకొండ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అలాగే పెన్న అహోబిలం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరికి దూరంగా ఉండే ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయానిని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ, పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది) వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది.

🌳అనంతపురానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లపురం కొండలు.

🌳అనంతపురానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న నసన కొట ముత్యాలమ్మ గుడి, వేంకటేశ్వర స్వామి ఆలయం.

🌳డీ.హిరేహల్ మండలంలోని మురడి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది.

🌳శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం, కంబదూరు

🌳నార్పల మండలములోని గూగూడు కుళ్ళాయిస్వామి ఆంజనేయ స్వామి జంట దేవాలయాలు ప్రసిద్ధి గాంచినవి ఇక్కడ జరిగే మొహరం పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

🌳పుట్లూరు మండల కేంద్రము లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, శివాలయం, బాటసుంకులమ్మ వనం, పురాతన ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ ప్రతి యేటా మహాశివరాత్రి, ఉగాది తిరునాళ్ళు,శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటారు.

🌳 తాడిపత్రి కి 12 కీ.మీటర్ల దూరంలో ఉన్న ఆలూరు రంగనాయకుల స్వామి కోన, ఓబులేసు స్వామి కోన, హజీవలి దర్గ ప్రసిద్ధి గాంచినవి.. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు, దర్గ ఉరుసు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు, ఇక్కడ భక్తులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారు.

🌳యాడికి దగ్గర కోన వాటర్ ఫాల్స్, కొండమీద దేవాలయం, చెన్నకేశవ స్వామి దేవాలయం.

🌳పెద్ద పప్పూరు దగ్గరలోని తిమ్మన చెరువు వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.

🌳బుక్కరాయ సముద్రం లోని ని కొండమీద రాయుడు దేవాలయం ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు చాలా పెద్ద ఘనంగా నిర్వహిస్తారు.

🌳గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, మస్తాన్ వలీ దర్గా.

🌳రాయదుర్గం పట్టణంలో దశ భుజ గణపతి టెంపుల్ ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి అలాగే ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా ప్రసిద్ధి అలాగే రాయదుర్గం పట్టణం నందు రాయలు పరిపాలనా చేసిన కోట కలదు కొండ పైన గల శ్రీ పట్టాభి సీతారామయ్య గారి టెంపుల్ మరియు ఎల్లమ్మ   దేవాలయం మరియు  రస సిద్దుల  దేవాలయం    
ఉన్నాయి.

🌳సెంట్రల్ యూనివర్సిటీ.

🌳మారూరు శ్రీచిన్నకదరయ్య దేవాలయం.

🌳కంబదూరు మల్లేసు స్వామి దేవాలయం.


పరిశ్రమలు

🌳యాడికి గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.

        జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. రామగిరి, శింగనమల, వజ్రకరూరు జిల్లాలోని కొన్ని ముఖ్య పవన విద్యుత్కేంద్రాలున్నాయి.
        పారిశ్రామికపరంగా తాడిపత్రి పట్టణంలో గ్రానైటును శుద్ధి చేసే పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, ధర్మవరం పట్టు, జౌళి పరిశ్రమ బాగా ప్రసిద్ధి చెందినవి.
       జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
    సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ )

పెన్నా సిమెంట్(యాడికి),సాగర్ సిమెంట్(యాడికి)
సిఫ్లాన్ డ్రగ్స్
ఎమ్ జి మెటాలిక్స్ అండ్ స్ప్రింగ్స్
జ్యోతి హార్డ్వేర్
మొనార్చ్ పైప్స్
భాస్కర్ ఫర్టిలైజర్స్
హేమ ఇండస్ట్రీస్
రేణుక ఫర్టిలైజర్స్
అమరన్ బ్యాటరీస్
గాయత్రి మిల్క్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్
కియా మోటార్స్)
కియా మోటార్స్ అనుబంధ సంస్ధలు
తాహ అయుర్వెద, అరాగనిక్ కంపని


క్రీడలు 

🌳అనంతపురం జిల్లాలో క్రీడలకు అధికమైన వసతులు ఉన్నాయి. 1963-1964 లో ఇరానీ కప్పుకు ఆతిధ్యం ఇచ్చి క్రీడలను నిర్వహించింది. సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో విజేతలైన ముంబాయి జట్టుకు ఎదురుగా ఆడిన రెస్టాఫ్ ఇండియా అతి తక్కువ స్కోరు 83 మాత్రమే చేసింది. అలాగే పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు రంజీ ట్రోఫీ టోర్నమెంట్స్‌కు అనంతపురం ఆతిథ్యం ఇచ్చింది. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది.

ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 7 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అనంతపురంలో ఉంది.

జిల్లా_ప్రముఖులు

🌳పూర్వ భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (రెండుమార్లు), లోక్‌సభ స్పీకరు (రెండుమార్లు), ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, నీలం సంజీవరెడ్డి.
కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్‌సభ సభ్యుడు, తరిమెల నాగిరెడ్డి.
పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు.
తెలుగు సినీ దర్శకుడు కె. వి. రెడ్డి జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో జన్మించాడు.
పారిశ్రామికవేత్త ఎన్.అరుణ్ రాజు s/o ఎన్.లక్ష్మినారాయణ అనంతపురం పట్టణంలో జన్మించాడు.
మైక్రోసాఫ్ట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్య నాదెళ్ళ ఈ జిల్లాకు చెందిన వ్యక్తి.

వాతావరణం

🌳అనంతపురం సంవత్సరమంతా వేడి, పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఫిబ్రవరి చివరలో మొదలైయ్యే వేసవి, మే మాసానికి తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సరాసరి ఉష్ణోగ్రత 37° సెల్సియస్ ఉంటుంది. అనంతపురంలో కేరళ నుండి వీచే నైరుతీ ఋతుపవనాల ద్వారా ముందుగానే వర్షాలు మొదలౌతాయి. సెప్టెంబరులో ఆరంభం అయ్యే వర్షాలు నవంబరు ఆరంభం వరకు ఉంటాయి. సరాసరి వర్షపాతం 250 మిల్లీ మీటర్లు ఉంటుంది. నవంబరు చివరిలో ఆరంభం అయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది. శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత 22-23°సెల్సియస్ ఉంటుంది. అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం. సంవత్సర సరాసరి వర్షపాతం 560 మి.మీ.
ఒకప్పుడు పాడి పంటలతో కళకళ లాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో సతమతమౌతోంది. జిల్లాలో అధిక విస్తీర్ణం సాగు వర్షాధారం. ఇక్కడ వేరుసెనగ ఎక్కువగా సాగు చేస్తారు

స్వచ్ఛంద_సేవా_సంస్థలు

🌳ఏళ్ళు గడచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు. ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు గ్రామీణ అభివృద్ధి సేవా సంస్థ, RDT, మరియు వివిధ గ్రామీణాభివృద్ధి సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్ లు చాలా ఏళ్ళుగా కృషి చేస్తున్నాయి.

విద్యాసంస్థలు

అనంతపుం మంచి విద్యాకేంద్రంగాభాసిల్లుతోంది. ఆరు విశ్వవిద్యాలయాలున్నాయి,
1) శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
2) యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
3) జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జె.ఎన్. టియు)
4) సత్యసాయి డీష్ విశ్వవిద్యాలయం
5) ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం

🌳 SK యునివర్సిటీతో పాటు
అనంతపురం లోని JNTU ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు.

🌳ప్రాథమిక పాఠశాలలు,ఆంగ్ల మాధ్యమ బాల బాలికల పాఠశాలలు,హైస్కూల్స్, ప్రభుత్వ, ప్రవేట్ హైస్కూల్ పాఠశాలు, రెసిడెన్షియల్,జూనియర్ కాలేజులు,బాలల, బాలబాలికల జూనియర్, కళాశాలలు,ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, ఉన్నతకళాశాలలు,ఎమ్ ఎస్ సి, పిజి, యుజి,డిగ్రీ, కాలేజులు,విశ్వవిద్యాలయాలు,ప్రభుత్వ ప్రవేట్ మెడికల్ కాలేజిలు,ఇంజనీరింగ్ కాలేజీలు,పోలీస్ ట్రైనింగ్,నర్సింగ్శ్ ఇన్‌స్టిట్యూట్స్,ఎజ్యుకేషనల్, టెక్నో డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్,టీచర్ ట్రైనింగ్స్, లిటిల్ ఫ్లవర్ సంస్థలకు చెందినవి. ఫిజియోథెరఫీ కస్తూర్భా ఫిజియోథెరఫీ, తదితర విద్య పాఠశాలలు హాస్టల్స్, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.

No comments:

Post a Comment