మురడి అంజన్న ఆలయ చరిత్ర ప్రకారం 15వ శతాబ్దాంలోని అప్పటి శ్రీకృష్ణదేవరాయలు గురువు వ్యాసరాయలు ఆంజనేయ స్వామికి మహా భక్తుడు. దేవరాయ లును కుహూ అనే గండం నుంచి తొలగించేందుకు దక్షిణ భారతదేశంలో 732 ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించారని తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో మురడి, నేమకల్లు, కసాపురం ఆంజనేయస్వామి ఆలయాలను మూడు ప్రాంతాల్లో ఒకే రోజు, ఒకే నక్షత్రంలో ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది.
మురడిలో వెలసిన స్వామివారు 8 అడుగుల ఎత్తులో ఉండటంతో మురడి ఆంజన్నగా పేర్కొంటున్నట్లు ఆలయ పెద్దలు చెబుతున్నారు. ఆ
ఆలయంలో సీత సమేత కోదండరామస్వామి, వినాయక స్వామి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి.
మండలంలో మరో ప్రసిద్ధిగాంచిన గవి సిద్దేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. సరిహద్దు దేవుడిగా పిలువబడే గవిసిద్దేశ్వర స్వామి ఆలయం సరిహద్దు ప్రాంతంలో హెచ్ సిద్దాపురంగ్రామంలో ఇనుపకొండల మధ్య వెలిశారు. ఇక్కడ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గవిసిద్ధేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.
ఈ ఆలయంలో 101 లింగాలు, 7పడగలనాగులను దర్శించుకుంటే దోషాలు తొలగి శుభాలు కలుగు తాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలినడకన సొంత వాహనంలో వెళ్తుంటారు.
No comments:
Post a Comment